OTT Movie : కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, హారర్ సినిమాల కన్నా భయంకరంగా ఉంటాయి. వీటిలో సీన్ టు సీన్ టెన్షన్ పెట్టించే విధంగా ఉంటాయి. అందులోనూ హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో సీన్స్ ఘోరంగానే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక అమ్మాయి అడవిలో ఒంటరిగా దారి తప్పిపోతుంది. ఆ తర్వాత ఆమె మీద కన్ను పడ్డ కొంతమంది తనని టార్చర్ చేయడం మొదలు పెడతారు. మూవీ మొదటి నుంచి చివరి వరకు ఈ అమ్మాయి. తనపై వికృతంగా ప్రవర్తించే చర్యలు వణుకు పుట్టిస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ ఒక బెస్ట్ సజెషన్. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రస్ట్ క్రీక్’ (Rust Creek). ఈ మూవీకి జెన్ మెక్‌గోవన్ దర్శకత్వం వహించారు. జూలీ లిప్సన్ రాసిన స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో హెర్మియోన్ కార్ఫీల్డ్ ఒక కళాశాల విద్యార్థిగా నటించింది. ఆమె రోడ్డు ప్రయాణంలో దారితప్పిపోయి, నేరస్థులచేతిలో నరకం చూస్తుంది. ఇది 2018 బెంటన్‌విల్లే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. IFC ఫిల్మ్స్ ద్వారా జనవరి 4, 2019న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
సాయర్ అనే కాలేజీ విద్యార్థిని ఒక జాబ్ ఇంటర్వ్యూకి కారులో వెళ్తూ ఉంటుంది. కెంటకీలోని అప్పలాచియన్ అడవుల్లో ఆమె తప్పిపోతుంది. ఆమె కారు చెడిపోవడంతో దానిని బాగుచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె ఒంటరిగా ఉండటం చూసి ఇద్దరు క్రిమినల్స్ ఆమెను గమనిస్తారు. ఆమె దగ్గరికి సాయం చేస్తామని వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తారు. వారితో జరిగిన ఘర్షణలో సాయర్ గాయపడి, అడవిలోకి పారిపోతుంది. అక్కడ ఆమె చలికి , ఆకలికి బాధపడుతుంది. ఆ ప్రమాదకరమైన వాతావరణంలో బతకడానికి భయపడుతూ పోరాడుతుంది. ఈ క్రమంలో ఆమెకు లోవెల్ అనే ఒక వ్యక్తి సహాయం చేస్తాడు. కానీ అతని ఉద్దేశాలు మాత్రం అనుమానంగా ఉంటాయి.
ఇంతలో, క్రిమినల్స్, స్థానిక షెరీఫ్ మధ్య జరిగే ఒక డ్రగ్ డీల్ సాయర్ పరిస్థితిని మరింత క్రిటికల్ గా మారుతుంది. లోవెల్ ఒక్కసారిగా ఆమెకు వ్యతిరేకంగా మారుతాడు. అతని ఉద్దేశం తెలుసుకుని, అతని మీద దాడి చేసి పారిపోతుంది. ఆ ప్రాంతం అంతా క్రిమినల్స్ కూడా సాయర్ ను వెతుకుతూ ఉంటారు. ఇక సాయర్ తన తెలివితేటలు, ధైర్యం ఉపయోగించి ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి బయటపడే ప్రయత్నం చేస్తుంది. చివరికి సాయర్ ఆ మానవ మృగాల నుంచి తప్పించుకుంటుందా ? వాళ్ళ చేతిలో బలి అవుతుందా ?అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే,ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఓ మై గాడ్.. ఆ సీన్స్ కోసం నిజంగానే హత్యలు చేశారా? ఆ సినిమాలు ఏంటీ?