Kingdom OTT: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం కింగ్డమ్(Kingdom). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Nagavamshi) నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ అందుకో లేకపోయినా విజయ్ అభిమానులను మాత్రం సంతోష పెట్టింది. గత కొంతకాలంగా ఈ స్థాయిలో విజయ్ దేవరకొండ సక్సెస్ అందుకోలేదని చెప్పాలి.
స్పై యాక్షన్ సినిమాగా..
ఇక ఈ సినిమా ఒక స్పై యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండ ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతారు. అయితే ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం ఈయన మాఫియాలో చేరడం తర్వాత మాఫియా డాన్ గా మారిపోవడం జరుగుతుంది. ఇలా స్పై యాక్షన్ సినిమాగా, అలాగే బ్రదర్ సెంటిమెంట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకుంది. థియేటర్ రన్పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.
నెట్ ఫ్లిక్స్ విడుదలకు సిద్ధమైన కింగ్డమ్…
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్(Netflix) వారు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి రాబోతుందని తెలుస్తోంది. అయితే తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో కూడా ఈ సినిమా అందుబాటులోకి రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి సంబంధించి నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన తెలియచేసింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ (Bhagya Shree)హీరోయిన్ గా నటించారు. అలాగే విజయ్ దేవరకొండ అన్నయ్య పాత్రలో సత్యదేవ్ అద్భుతమైన నటనను కనబరిచిన సంగతి తెలిసిందే.
In the kingdom of gold, blood and fire… a new king rises from the ashes 🤴🔥 pic.twitter.com/MWHBYavB0q
— Netflix India (@NetflixIndia) August 25, 2025
థియేటర్లలో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాతో పాటు రవికిరణ్ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ కూడా అనుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ జంటగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read: AA 26× A6: సినీ కార్మికుల సమ్మె.. రోజుకు కోట్లలో నష్టపోయిన బన్నీ నిర్మాతలు!