E-Paper
Advertisement

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు
Advertisement

Vision Quest OTT: సూపర్‌ హీరోల కథల్లో విలన్‌ ఎవరు, అతని లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు ఉత్కంఠను పెంచుతాయి. కానీ తన గతాన్ని మర్చిపోయిన హీరోనే అందరికీ లక్ష్యంగా మారితే… తనలో ఉన్న శక్తులు తనకే పూర్తిగా అర్థం కాకపోతే… పైగా తనను పట్టుకుంటే భారీ నజరానా లభిస్తుందని తెలిసిన వేటగాళ్లు వెంటపడితే ? అప్పుడు శత్రువులతో పోరాడటంతో పాటు, తాను ఎవరో తెలుసుకోవడం కూడా అతనికి పెద్ద సవాలుగా మారుతుంది. మార్వెల్‌ కథా ప్రపంచంలో విజన్‌ ప్రయాణాన్ని కొనసాగించే సూపర్‌హీరో సైన్స్‌ ఫిక్షన్‌ సిరీస్‌ ‘విజన్‌ క్వెస్ట్’ (Vision Quest). మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

విజన్‌ అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఆండ్రాయిడ్‌, గతంలో జరిగిన సంఘటనల తర్వాత తన జ్ఞాపకాలను, గుర్తింపును తిరిగి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. తనను ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూసిన వారి నుంచి తప్పించుకున్న విజన్‌, అజ్ఞాతంలో జీవిస్తూ తన జీవితానికి కొత్త అర్థం వెతుక్కుంటాడు. అయితే తన గతాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం అతడిని మరో ప్రమాదంలోకి నెడుతుంది. తనలోని కృత్రిమ మేధ వ్యవస్థలతో మాట్లాడే క్రమంలో విజన్‌కు జార్విస్‌ (J.A.R.V.I.S.), ఎడిత్‌ (E.D.I.T.H.), ఫ్రైడే (F.R.I.D.A.Y.) వంటి వ్యవస్థలు ఎదురవుతాయి.

Advertisement

వీటితో పాటు గతంలో మానవాళికి ప్రమాదకరమైన శత్రువుగా మారిన అల్ట్రాన్‌ కూడా అతని అంతర్గత ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తాడు. అల్ట్రాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొంటూనే తన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి విజన్‌కు ఎదురవుతుంది. బయట శత్రువుల నుంచి తప్పించుకోవడం ఒక సవాలైతే, తనలోని కృత్రిమ మేధతో తలెత్తే సంఘర్షణను ఎదుర్కోవడం మరో సవాలుగా మారుతుంది. ఇంతలో విజన్‌ తలపై భారీ నజరానా ప్రకటించడంతో అతడిని పట్టుకోవాలని వేటగాళ్లు రంగంలోకి దిగుతారు. వారిలో పాలడిన్‌ అనే వేటగాడు కూడా ఉంటాడు. విజన్‌ కోసం సాగుతున్న వేట మరింత ప్రమాదకరంగా మారుతుంది.

ఈ క్రమంలో థామస్‌ షెపర్డ్‌ అనే యువకుడు అతని ప్రయాణంలోకి వస్తాడు. థామస్‌ కు విజన్‌ కుటుంబంతో సంబంధం ఉందనే అనుమానం కథలో మరో కీలకమైన అంశం. అతడు విజన్‌ కుమారుడైన టామీకి పునర్జన్మనా ? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అల్ట్రాన్‌ ప్రభావాన్ని అతడు అధిగమించగలడా ? థామస్‌ తో అతనికి ఉన్న అనుబంధం ఏమిటి ? తనను పట్టుకోవాలని చూస్తున్న వారి నుంచి తప్పించుకుని తన జీవితానికి కొత్త అర్థాన్ని కనుగొనగలడా ? అన్నదే ఈ సిరీస్‌లోని ఉత్కంఠ.

Advertisement

Also Read : ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

ఓటీటీలో తెలుగులో చూడొచ్చా ?

‘విజన్‌ క్వెస్ట్’ అక్టోబర్‌ 14 నుంచి Jio Hotstarలో ప్రసారం అవుతోంది. ఈ సిరీస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది వాండావిజన్‌ (WandaVision), అగాథా ఆల్‌ అలాంగ్‌ (Agatha All Along) కథలతో కొనసాగింపుగా రూపొందిన మార్వెల్‌ సిరీస్‌. తెలుగు ఆడియో అందుబాటులో లేదు. తన గతాన్ని తెలుసుకోవాలనే విజన్‌ ప్రయత్నం, అల్ట్రాన్‌ ప్రభావం, థామస్‌ తో ఏర్పడే అనుబంధం కథను ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి.

Related News

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

Big Stories

Advertisement
×