Daivik SaReGaMaPa:జూనియర్ బాలు అంటూ అంతా ఆకాశానికి ఎత్తేస్తున్న దైవిక్ తాజాగా జీ తెలుగు ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’లో పాడలేక తేలిపోయాడు. ఈసారి కూడా ఎప్పటిలాగే అటు ఆడియన్స్ ని ఇటు జడ్జస్ ని మెప్పిద్దామని వచ్చిన దైవిక్ పాట పాడటంలో తడబడిపోయాడు. పాటలోని లిరిక్స్ ని గుర్తుపెట్టుకోలేక అడ్డంగా బుక్ అయిపోయాడు.
మొదటిసారిగా లిరిక్స్ ని మర్చిపోవడంతో
నిజానికి పోటీ దారులు పోటీలో పాల్గొనేటప్పుడు పాడటానికి అనువుగా , ఈజీగా ,సులభతరంగా ఉండే పాటల్ని ఎంచుకుంటారు.కానీ దైవిక్ ఎంచుకున్నది ఆడవే మయూరి అనే కష్ట సాధ్యమైన పాట. ఒకందుకు ఆ విషయంలో అతన్ని మెచ్చుకోవాలి కూడా.అయితే మొదట్లో పాటని బాగానే పాడిన దైవిక్ క్రమంగా పాట పాడుతూ మధ్యలో మొదటిసారిగా లిరిక్స్ ని మర్చిపోవడంతో అటు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మనో ,ఇటు జడ్జీలు అయిన sp శైలజ, అనిల్ రావిపూడి, అనంత శ్రీరాం ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
అయినప్పటికీ మనో పర్లేదు పాడమని ఎంకరేజ్ చేయడం తో మళ్ళీ పాట పాడటం మొదలుపెట్టాడు.ఇక మళ్ళీ పాట పాడటం మొదలు పెట్టిన దైవిక్ మళ్ళీ తడబడటంతో దైవిక్ కి పాట పాడే అవకాశం ఇవ్వాలా వద్దా అని డిస్కస్ చేసి దైవిక్ ని అడగ్గా అతను డ్రాప్ కావడానికే మొగ్గు చూపాడు.
మనో మాట్లాడుతూ
ఇక దైవిక్ గురించి మనో మాట్లాడుతూ అన్నయ్య బాలు గొంతుని అచ్చం దించేస్తున్నాడని ,భవిష్యత్ లోపెద్ద సింగర్ అవుతాడని ప్రశంసించాడు.sp శైలజ మాట్లాడుతూ ఇది చాలా కష్టసాధ్యమైన పాట అని ఇలాంటి పాటని పాడటానికి ఖచ్చితంగా 15 రోజులపాటు అయినా ప్రాక్టీస్ చేయాలి.కానీ దైవిక్ కేవలం రెండు రోజుల్లోనే నేర్చుకుని పాడటం అంటే మామూలు విషయం కాదని, తప్పులు ఎక్కడైనా జరుగుతాయని, కాబట్టి మరోసారి పాటని పర్ఫెక్ట్ గా నేర్చుకొని పాడాలని తెలిపారు.
అనిల్ రావి పూడి మాట్లాడుతూ
ఇక అనిల్ రావి పూడి మాట్లాడుతూ ఈ రోజు గెలుపు సక్సెస్ రెండూ చూశావని, పాట పాడాలని అనుకోవడం ఒక సక్సెస్ అయితే, ఆ పాటని పాడలేక ఫెయిల్ అయ్యావని ,పాటని మరింత ప్రాక్టీస్ చేస్తే పాటని బాగా పాడవచ్చని చెప్పుకొచ్చాడు.
మరోవైపు అనంత శ్రీరామ్ మాట్లాడుతూ మొదట్లో బాగానే పాడావని, ముఖ్యంగా పాడిన పాటలోని శృతి విషయంలో దైవిక్ కి మంచి అవగాహన ఉందని కానీ లిరిక్స్ మర్చిపోవడం వల్లే ఫెర్ఫామెన్స్ లో తేడా వచ్చిందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.
30 మార్కులకు 15 మార్కులు మాత్రమే
అలా ఎవరి అభిప్రాయాలు వారు చెప్పిన తర్వాత సుధీర్ మార్క్స్ ఇవ్వుమని అడగడంతో జడ్జిలు తాము ఎన్ని మార్క్స్ వేశారో చూపించారు.అయితే దైవిక్ ఇచ్చిన బ్యాడ్ ఫెర్ఫామెన్స్ వల్ల కేవలం
30 మార్కులకు 15 మార్కులు మాత్రమే వచ్చాయి.
మొత్తానికి జూనియర్ బాలు ,బాలు గారి గొంతు దించేస్తున్నాడు అంటూ మెచ్చుకున్న దైవిక్ ఇలా తడబడటంతో డీలా పడిపోతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఈ తడబాటుని దాటుకుని ముందు ముందు ఎలా కమ్ బ్యాక్ ఇస్తాడో !
ALSO READ :ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?