E-Paper
Advertisement

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!
Advertisement

Liquor Price Hike: దసరా పండుగ దగ్గరకు వచ్చిన తరుణంలో మద్యం ప్రియులకు షాక్​ తగిలింది. విదేశీ మద్యంపై ధరలను పెంచుతూ తెలంగాణ బ్రేవరేజెస్​ కార్పోరేషన్​ లిమిటెడ్​ (టీజీబీసీఎల్) సర్క్యులర్​ జారీ చేసింది. సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. 352 బ్రాండ్లపై దాదాపు 6 శాతం వరకు ధరలు పెరిగినట్టు ఎక్సయిజ్​ వర్గాలు తెలిపాయి.

అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యంపై సుంకాన్ని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రంలో విదేశీ మద్యం ధరలు పెరగడం చర్చకు దారితీసింది. దిగుమతి సుంకం తగ్గింపు ప్రభావం వినియోగదారులకు నేరుగా అందుతుందని భావించగా ధరల పెంపు మందు బాబులకు షాక్​ ఇచ్చిందనే చెప్పాలి.

Advertisement

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు ఆబ్కారీ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ కు భారీ స్పందన లభించింది. మొత్తం 8,771 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్​ ఫీజుగా లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించిన నేపథ్యంలో అప్లికేషన్ల రూపంలో ప్రభుత్వ ఖజానాకు 87.71 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నెల 16న లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు బార్లను కేటాయించనున్నారు.

Also Read: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

Advertisement

కాగా, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) ఏర్పాటుతో పాటు కొత్త మున్సిపాలిటీల ఆవిర్భావం, గ్రామాల విలీనంతో జనాభా, పట్టణ పరిధి విస్తరించిన నేపథ్యంలో కొత్త బార్లకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. క్యూర్‌ పరిధిలో 14 బార్లకు, ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 27 బార్లకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. క్యూర్‌ పరిధిలోనే 4,252 దరఖాస్తులు రావడం గమనార్హం.

Also Read: 2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

Tags

Related News

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

Big Stories

Advertisement
×