VW 7.5 kg 5 Star Aqua Spin: ఇల్లు మారినా, బడ్జెట్ తక్కువైనా.. ఒక మంచి వాషింగ్ మెషీన్ ఉండటం ఇప్పుడు ప్రతి ఇంటికి అవసరం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల తక్కువ ధరలో ఎక్కువ కెపాసిటీ ఉండే వాషింగ్ మెషీన్ల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారి కోసమే VW కంపెనీ నుంచి వచ్చిన ‘VW 7.5 kg 5 Star Aqua Spin’ వాషింగ్ మెషీన్ మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. కేవలం రూ.7,490 ధరకే లభిస్తున్న ఈ మెషీన్, బట్టలను క్లీన్ చేయడంలో ఎలా పనిచేస్తుంది? దీని ఫీచర్లు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో రూ.8,000 లోపు ఒక మంచి వాషింగ్ మెషీన్ దొరకడం అంటే మాటలు కాదు. కానీ, VW వారి ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, కరెంట్, వాటర్ ఆదా చేయడంలో కూడా.. నెంబర్ వన్. బ్లాక్ కలర్ లో చూడటానికి చాలా ప్రీమియంగా కనిపించే ఈ మెషీన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు..
చిన్న నుంచి మధ్యతరగతి కుటుంబానికి (4 నుంచి 5 మంది సభ్యులు) ఈ 7.5 కేజీల కెపాసిటీ సరిగ్గా సరి పోతుంది. రోజువారీ బట్టలు, బెడ్‌షీట్లు, జీన్స్ వంటి బట్టలను కూడా ఇది చాలా ఈజీగా ఉతుకుతుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ లోడ్ తీసుకోవడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్.
చాలా మందికి సెమీ ఆటోమేటిక్ మెషీన్లు అంటే కరెంట్ ఎక్కువ తీసుకుంటాయేమో అనే భయం ఉంటుంది. కానీ దీనికి 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటం వల్ల, కరెంట్ బిల్లు విషయంలో.. అస్సలు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. తక్కువ పవర్ వాడటమే కాకుండా.. బట్టలను కూడా పాడవకుండా ఉతికేందుకు ‘Aqua Spin’ టెక్నాలజీ ఇందులో ప్రత్యేకంగా అమర్చారు.
Also Read: డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ, ఏఐ ట్రాన్స్‌లేషన్ సపోర్ట్. .మార్కెట్‌లో రచ్చ లేపుతున్న వన్ ప్లస్
దీనిలోని ప్రధాన ఆకర్షణ ‘ఆక్వా స్పిన్’. బట్టల నుంచి మురికిని వేగంగా తొలగించడానికి, వాటర్ సర్క్యులేషన్‌ను మెరుగు పరచడానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. బట్టలపై మొండి మరకలు ఉన్నా.. ఉతకడం చాలా ఈజీ అవుతుంది.
సెమీ ఆటోమేటిక్ మెషీన్లు ఫుల్లీ ఆటోమేటిక్ మెషీన్లతో పోలిస్తే త్వరగా పాడవవు, రిపేర్లు కూడా తక్కువగా వస్తాయి.
ఈజీగా వాడవచ్చు: దీని కంట్రోల్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు.
వాల్యూ ఫర్ మనీ: రూ.7,490 ధరకు ఇన్ని ఫీచర్లు రావడం అనేది నిజంగా గొప్ప డీల్.
మీరు బ్యాచిలర్ అయినా, చిన్న ఫ్యామిలీ అయినా.. బడ్జెట్ తక్కువగా ఉంది. కానీ మంచి క్వాలిటీ ఉన్న వాషింగ్ మెషీన్ కావాలి అనుకుంటే.. ‘VW 7.5 kg 5 Star Aqua Spin’ ని కళ్లు మూసుకుని కొనేయొచ్చు. ఇది మీ బడ్జెట్‌కు, మీ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది.