Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటికీ ఒక సరైన లవ్ స్టోరీ కూడా లేదు. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్‌లో అయితే ఏకంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలే నడిచాయి. కానీ ఈసారి అలా జరగడం లేదు. సోనియా ఉన్నప్పుడు నిఖిల్‌తో ప్రేమాయణం నడిపింది. కానీ తను వెళ్లిపోయిన తర్వాత నిఖిల్ ఒంటరి అయిపోయాడు. ఇక కొన్నాళ్ల నుండి సీన్‌లోకి యష్మీ ఎంటర్ అయ్యింది. ఒకవైపు నిఖిల్ అంటే ఇష్టం అంటూనే పృథ్వితో క్లోజ్‌గా ఉంటూ ప్రేక్షకుల్లో కన్ప్యూజన్ క్రియేట్ చేస్తోంది యష్మీ. ఇక తాజాగా ఏకంగా నిఖిల్ ముందే పృథ్వికి ఇన్‌డైరెక్ట్‌గా ప్రపోజ్ చేసింది. ఇదిలా ఉండగా మెగా చీఫ్ అయిన తర్వాత ప్రేరణ పూర్తిగా మారిపోయింది.
నిఖిల్ రెడ్ ఫ్లాగ్
ఇటీవల సండే ఫన్‌డే ఫన్ టాస్క్ కోసం అబ్బాయిలంతా క్లీన్ షేవ్ చేసుకున్నారు. పృథ్వి తప్పా అందరూ అదే చేశారు. దీంతో నిఖిల్ లుక్కే మారిపోయింది. గడ్డం తీసేయడం వల్ల నిఖిల్ పూర్తిగా రెడ్ ఫ్లాగ్ లాగా మారిపోయాడు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది యష్మీ. అంతకు ముందు కాస్త గ్రీన్ ఫ్లాగ్ లాగా కనిపించేవాడని, కానీ ఇప్పుడు పూర్తిగా రెడ్ ఫ్లాగ్ అయిపోయాడని చెప్పింది. నాకేం గ్రీన్ అవ్వాలని లేదు అంటూ రివర్స్ అయ్యాడు నిఖిల్. పృథ్విని చూస్తూ నువ్వు గడ్డం అలాగే ఉంచుకున్నందుకు నీకు పడిపోయేలా ఉన్నాను అంటూ సిగ్గుపడుతూ చెప్పింది యష్మీ. అది విన్న నిఖిల్.. విష్ణుప్రియా ముందు ఇదే మాట చెప్తే అర్థరాత్రి వచ్చి మర్డర్ చేస్తుంది అంటూ కూల్‌గా కౌంటర్ ఇచ్చాడు.
Also Read: డేంజర్ జోన్ లో టైటిల్ ఫేవరేట్.. ఎలిమినేషన్ తప్పదా..?
మొన్నటివరకు విష్ణుప్రియా
ప్రేరణ మెగా చీఫ్‌గా మారి మూడు రోజులే అయ్యింది. అయినా అప్పుడే అందరి మీద అధికారం చూపిస్తూ.. ఫ్రెండ్స్‌ను సైతం దూరం చేసుకుంటుంది. పృథ్వి, విష్ణుప్రియా, నిఖిల్, యష్మీ సపోర్ట్ చేయడం వల్లే తాను మెగా చీఫ్ అయ్యాననే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది ప్రేరణ. ఆఖరికి గౌతమ్ కూడా తనకే సపోర్ట్ చేయాలనుకున్నాడు. ఇవన్నీ మర్చిపోయి ముందు విష్ణుప్రియాను, ఇప్పుడు గౌతమ్‌ను టార్గెట్ చేస్తోంది. కిచెన్ డ్యూటీస్, క్లీనింగ్ డ్యూటీస్ విషయంలో కంట్రోల్ తప్పుతోంది. మొన్నటి వరకు విష్ణుప్రియాను పనిచేయమంటూ, పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ టార్చర్ పెట్టింది. ఇప్పుడు గౌతమ్‌పై తన కన్నుపడింది.
ప్రేరణ సీరియస్
హౌస్ మొత్తం కోసం ఉన్న ఒకేఒక్క సీతాఫల్‌ను గౌతమ్ తినేశాడు. దానివల్ల అప్పుడే వారిద్దరి మధ్య పెద్ద గొడవయ్యింది. సిగ్గులేకుండా తిన్నావని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. అలా చేసినందుకు వారమంతా గిన్నెలు తనే కడగాలని పనిష్మెంట్ ఇచ్చింది. అదే విషయాన్ని మరోసారి గౌతమ్‌కు గుర్తుచేసింది. కానీ గౌతమ్ మాత్రం ఒక్కడినే చేయలేనని మరొక తోడు కావాలని అన్నాడు. దానికే ప్రేరణ సీరియస్ అయ్యింది. ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. నువ్వు వరస్ట్ మెగా చీఫ్ అని గౌతమ్ అనగా.. నువ్వు వరస్ట్ కంటెస్టెంట్ అని ప్రేరణ సీరియస్ అయ్యింది. మనుషులను అస్సలు గౌరవించడమే రాదంటూ అక్కడి నుండి పనిచేయకుండా వెళ్లిపోయాడు గౌతమ్.