E-Paper
Advertisement

కంప్లీట్ డోస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు… అన్నీ ఒకే ఓటీటీలో

కంప్లీట్ డోస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు… అన్నీ ఒకే ఓటీటీలో
Advertisement

Sony Liv : ఓటీటీ మూవీ లవర్స్ కు ఇప్పుడు లెక్కలేనన్ని సినిమాలతో పాటు, అదిరిపోయే వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గనుక ప్రత్యేకంగా వెబ్ సిరీస్ ల అభిమానులు అయితే ఈ సూపర్ హిట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు మీ కోసమే. ఇక ఈ లిస్ట్ లో చెప్పుకోబోయే సిరీసులన్ని ఒకే ఓటీటీలో ఉండడం మరో విశేషం. మరి సోని లివ్ లో అందుబాటులో ఉన్న ఆ టాప్ క్రైమ్ కథా చిత్రాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Kathmandu Connection

“కాఠ్మండు కనెక్షన్” థ్రిల్లర్ వెబ్ సిరీస్. సచిన్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో అమిత్ సియాల్, అక్షా పర్దాసాని, అన్షుమాన్ పుష్కర్, గోపాల్ దత్, విక్రమ్ సింగ్, జాకిర్ హుస్సేన్ తదితరులు నటించారు. బాంబే బాంబు దాడులకు సంబంధించిన ఒక కేసును పరిష్కరించే డీసీపీ సమర్థ్ పాత్రలో అమిత్ కన్పిస్తారు. కేసును విచారిస్తున్న కొద్దీ విస్మయపరిచే నిజాలెన్నో బయట పడతాయి.

Manvat Murders

Advertisement

మహారాష్ట్రలోని ఒక గ్రామంలో జరిగిన నిజ సంఘటన ఆధారంగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “మాన్వత్ మర్డర్స్”. ఈ సిరీస్‌లో దర్శకుడు అశుతోష్ గోవారికర్ పోలీస్ అధికారిగా నటించారు. ఈ పాత్రకు డీఎస్పీ రామకాంత్ కులకర్ణి స్ఫూర్తి అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన స్వయంగా రాసిన “ఫుట్‌ప్రింట్స్ ఆన్ ది సాండ్స్ ఆఫ్ క్రైమ్” అనే పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. గ్రామంలోని 10 ఏళ్ల బాలిక అదృశ్యం కావడంతో కథ మొదలవుతుంది. ఆ తరువాత వరుసగా అమ్మాయిలు, మహిళలు మిస్ అవుతూ ఉంటారు. ఈ సిరీస్ మరాఠీ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషలలో ఓటీటీ ప్రియులకు అందుబాటులో ఉంది.

Kankhajura

ఈ లిస్ట్ లో చెప్పుకోవాల్సిన మరో క్రేజీ సిరీస్ “కంఖజురా”. చందన్ అరోరా దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో రోషన్ మాథ్యూ, మోహిత్ రైనా, సారా జేన్ డియాస్, మహేష్ శెట్టి, ఉషా నాడ్కర్ణి, నినాద్ కామత్ నటించారు. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత తన అన్న ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముడు అషు కథే ఇది. ఓవైపు తమ్ముడు జైల్లో మగ్గిపోతే అన్న మాత్రం బిజినెస్ మ్యాన్ గా ఎదుగుతాడు. ఇంటికొచ్చిన తమ్ముడు అన్న డ్రీం ప్రాజెక్ట్ లో హెల్ప్ చేస్తానని చెప్తాడు. కానీ అన్న మాత్రం అతన్ని ఎగతాళి చేస్తాడు. తరువాత ఏం జరిగింది ? అన్నదే స్టోరీ.

Advertisement

Also Read : సాక్ష్యాలు ఉన్నా సమాధానం దొరకని ప్రశ్న… అసలైన హంతకుడు ఆ వింత రాక్షసేనా?

Tanaav

‘తనావ్’ వెబ్ సిరీస్ లో కాశ్మీర్‌కు చెందిన ఒక ప్రొఫెసర్‌ ను బంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు తీసుకువెళ్లడంతో కథ షురూ అవుతుంది. ఒక బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారాన్ని అతని నుంచి రాబట్టే ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే ప్రొఫెసర్ ఉగ్రవాది పాంథర్ అలియాస్ ఉమర్ రియాజ్ (సుమిత్ కౌల్) కబీర్ ఫరూఖీ (మానవ్ విజ్) జరిపిన ఒక ఆపరేషన్‌లో హతమయ్యాడని, కానీ అతను ఇంకా బతికే ఉన్నాడని నిజాన్ని కక్కేస్తాడు.ఆ తరువాత కథ ఊహించని మలుపులు తిరుగుతుంది.

Tabbar

పవన్ మల్హోత్రా, సుప్రియా పాఠక్, రణ్‌వీర్ షోరే మెయిన్ లీడ్స్ గా చేసిన వెబ్ సిరీస్ “తబ్బర్”. కుటుంబాన్ని కాపాడటానికి ఓ తండ్రి ఎంతకు తెగించాడు అన్నదే ఈ సిరీస్ స్టోరీ. రిటైర్డ్ పోలీస్ అధికారి ఓంకార్ సింగ్ కుటుంబం ఒక హత్య కేసులో చిక్కుకుంటారు.

Tags

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×