BigTV English

OTT Movies : 30 ఏళ్లుగా ఓ శాపం.. ఆ ప్రాంతంలో దాగున్నా ఎన్నో మిస్టరీలు.. వరుస షాకులు..

OTT Movies :  30 ఏళ్లుగా ఓ శాపం.. ఆ ప్రాంతంలో దాగున్నా ఎన్నో మిస్టరీలు.. వరుస షాకులు..

OTT Movies : ఈ మధ్య జనాలు హారర్ సస్పెన్స్ మూవీలకు ఎక్కువగా పట్టం కడుతున్నారు. థియేటర్లలో కూడా భయపెట్టే సినిమాలను చూసి థ్రిల్ గా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నారు. అందుకే కొందరు డైరెక్టర్సు ఇలాంటి సినిమాలనే ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కొత్త కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. ఇక హారర్ మూవీలకు థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీలో కూడా డిమాండ్ ఎక్కువే ఉంది. అందుకే ఓటీ టీ సంస్థలు కొత్త సినిమాలను రోజు స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నారు. తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఓటీటీలోకి తీసుకొని వచ్చారు. ఆ వెబ్ సిరీస్ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..


ప్రేక్షకులకు డిఫరెంట్ కథలను అందించడం లో ముందుంటోన్న వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5. ఈ మాధ్యమం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడానికి డేట్ ను లాక్ చేసుకుందని తెలుస్తుంది. జీ 5 ‘వికటకవి’ ( vikatakavi ) సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌ మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ ను నిర్మిస్తున్నారు.. ప్రదీప్ మద్దాలి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఇక తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం..

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ తో అనేక స్టోరీలు వచ్చాయి. కానీ ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతున్నారు. ఇక హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కారణాలతో అమరగిరి ప్రాంతం లోని సమస్యను గుర్తించటానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. తన తెలివి తేటలతో ఆ గ్రామానికి సంబంధించిన పురాతన కథలను, అధునిక కుట్రల వెనుకున్న రహస్యాలను అతను వెలికితీస్తాడు. ఈ క్రమంలో ఎన్నో సస్పెన్స్ అంశాలు అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అసలు వరుస సస్పెన్స్ ల వెనుక ఉన్న కథను చక్కగా చూపించే ప్రయత్నం చేసాడు.. ప్రతి 10 నిమిషాలకు ఊహకు అందని ట్విస్ట్ లు ఉంటాయని తెలుస్తుంది. అమరిగిరి ప్రాంతంతో రామకృష్ణకు ఉన్న అనుబంధం ఏంటనేది తెలుసుకోవాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు.. ఇక ఈ సిరీస్ 28 న స్ట్రీమింగ్ కు రాబోతుంది రెడీ అవ్వండి..


Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×