Delhi: వాహనదారులు, పారిశ్రామిక వినియోగదారులకు కొత్త కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. గతంలో పెట్రోల్-డీజిల్ సరఫరాపై విధించిన అన్ని రకాల ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. జులై 1 అనగా బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వాహనదారులకు కొత్త కబురు.. ఆయిల్‌పై ఆంక్షలు కేంద్రం ఎత్తివేత
పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితి రావడంతో కేంద్రం యాక్టివేట్ అయ్యింది. గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్ సరఫరా సాగుతోంది. ఈ క్రమంలో ఇరాన్-అమెరికా యుద్ధం సమయంలో విధించిన ఆంక్షలను క్రమంగా తొలగిస్తోంది కేంద్రప్రభుత్వం. ఇప్పటికే గ్యాస్ సరఫరా ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం, ఇప్పుడు పెట్రోల్-డీజిల్ వంతైంది.
జూలై ఒకటి అనగా బుధవారం నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆంక్షల్ని ఎత్తివేస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం నుంచి దేశ వ్యాప్తంగా ఆయిల్ పంపిణీ మరింత సులభతరం కానుంది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు తెలిపింది. డిమాండ్‌కు సరిపడిన ఆయిల్ అందుబాటులో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది.
ఆంక్షలు ఓకే.. ధరల మాటేంటి? ప్రశ్నిస్తున్న వాహనదారులు
దీనికి సంబంధించి జూన్ 12న ప్రకటన వచ్చింది. జులై 1 నుండి పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. ఈ మేరకు దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు.. పెట్రోల్ బంకులపై అన్ని రకాల నియంత్రణలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది.
కేంద్రం నిర్ణయం వల్ల బంకులకు ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగుతుంది. జూన్ 12న జారీ చేసిన ఆదేశాల మేరకు ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల డీజిల్ విక్రయించాలి. పారిశ్రామిక-వాణిజ్య-సంస్థాగత వినియోగదార్లు రిటెయిల్ ఆయిల్ సంస్థల నుంచి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయకుండా విధించింది. జూన్ 29న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ALSO READ: రాముడి సొమ్ము దోచిన వారికి లాయర్లు లేరు! అయోధ్య బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం!
ఆంక్షలు సడలిస్తున్న కేంద్రం, పెంచిన ఆయిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్-డీజిల్ ధరలను సమీక్షించి ప్రకటన చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో రూపాయి విలువ, రవాణా వ్యయం, రిఫైనరీ ఖర్చులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు పరిగణనలోకి తీసుకుని ధరలు నిర్ణయిస్తారు.
జూన్ 30న ఇంధన ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేశాయి. హైదరాబాద్‌లో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.116.15గా ఉంది. సోమవారంతో పోలిస్తే లీటర్‌కు 46 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్ ధర రూ.104.23గా ఉండగా, 41 పైసలు పెరిగింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ వంటి నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
Govt withdraws temporary regulatory measures governing the sale and distribution of Petrol and Diesel. @PetroleumMin said that with effect from 1st July, 2026, the temporary measures will be lifted from Motor Spirit and High Speed Diesel through retail outlets of Public Sector… pic.twitter.com/hp5oELwbgJ
— All India Radio News (@airnewsalerts) June 29, 2026