OTT Movie : మలయాళం సినిమాలను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకులు. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. అయితే ఓటీటీలో ట్విస్టులతో మతి పోగొట్టే, ఒక మలయాళ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ మూవీ స్టోరీ ఒక నీతి కథతో ప్రారంభమవుతుంది. పురాతన కాలంలో ఒక బ్రాహ్మణుడు, అడవిలో పెరుమాదన్ అనే దెయ్యాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు, కానీ ఆ దెయ్యం చీమల రూపంలో అతని తలపై ఉంటూ అతన్ని తప్పుదారి పట్టిస్తుంది. అతను మాత్రం దెయ్యాన్ని పట్టుకోలేక, శాశ్వతంగా అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఈ స్టోరీ ఇప్పుడు జరిగే అసలు స్టోరీకి ఒక సూక్తిగా పని చేస్తుంది. ప్రస్తుత కాలంలో ఆంటోనీ, షాజీవన్ అనే ఇద్దరు పోలీసు అధికారులు మయిలదుంపరంబిల్ జాయ్ అనే నేరస్థుడిని పట్టుకోవడానికి చురులి అనే ఊరికి వెళ్తారు. వాళ్ళు పోలీసులమని చెప్పకుండా, రబ్బర్ తోటలో పని చేయడానికి వచ్చిన కూలీలుగా నటిస్తారు. వాళ్ళు స్థానికంగా ఉండే ఒక జీప్‌లో ఊరికి వెళ్తూ, ఒక బ్రిడ్జిని దాటుతారు. ఆ తర్వాత ఆంటోనీ, షాజీవన్ ఒక స్థానిక సారాయి షాప్‌లో పనిచేస్తూ, జాయ్ గురించి సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తారు.
అయితే ఈ గ్రామం మామూలుగా ఉండదు. ఇక్కడి ప్రజల భాష కూడా తేడాగా ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలు, నేరాలను ఆవులించినంత తేలిగ్గా చేసేస్తుంటారు. ఇప్పుడు పోలీసులకు ఈ గ్రామంలో వింత సంఘటనలు జరుగుతాయి. షాజీవన్‌కి గతంలో ఈ గ్రామంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆంటోనీ క్రమంగా గ్రామంలోని క్రూరమైన వాతావరణానికి అలవాటుపడతాడు. ఇక్కడ పోలీసులు ఒక టైమ్ లూప్ లో ఇరుక్కుపోతారు. ఆ గ్రామంలోకి వెళ్తే తిరిగి బయటకి రావడం జరగదు. చివరికి ఆ నేరస్థుడు పోలీసులకు దొరుకుతాడా ? ఆ గ్రామం నుంచి వీళ్ళు బయట పడతారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : కంటి ఆపరేషన్ కి కన్నింగ్ ప్లాన్… ఈ మర్డర్ కేసు మామూలుగా లేదు సామి
సోనీ లివ్ (SonyLIV) లో
ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘చురులి’ (Churuli). 2021 లో విడుదలైన ఈ మలయాళం సినిమాకు లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వ్యవహించారు. ఇందులో వినయ్ ఫోర్ట్, చెంబన్ వినోద్ జోస్, జోజు జార్జ్, సౌబిన్ షాహిర్ జాఫర్ ఇడుక్కి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీని మొనాస్టరీ, చెంబోస్కీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై లిజో జోస్ పెల్లిస్సేరి, చెంబన్ వినోద్ జోస్ నిర్మించారు. ఈ స్టోరీలో మైలదుంపరంబిల్ జాయ్ అని పిలువబడే, ఒక క్రిమినల్ కోసం వెతకడానికి ఇద్దరు పోలీసు అధికారులు వచ్చి చురులి గ్రామంలో చిక్కుకుంటారు. ఈ స్టోరీ మాత్రం మిస్టరీతో మెంటలెక్కిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ (SonyLIV) లో అందుబాటులో ఉంది.