E-Paper
Advertisement

శ్రీలంక, టీమిండియా రెండో టెస్ట్ డ్రా…బెడిసికొట్టిన గిల్ WTC ఫైన‌ల్స్ ప్లాన్స్‌

శ్రీలంక, టీమిండియా రెండో టెస్ట్ డ్రా…బెడిసికొట్టిన గిల్ WTC ఫైన‌ల్స్ ప్లాన్స్‌
Advertisement

IND VS SL WTC Final Scenario:  టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka vs. Team India match) మధ్య జరిగిన రెండు టెస్టు (India tour of Sri Lanka 2026) డ్రా గా ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని అందరూ అంచనా వేయగా.. ఐదవ రోజు శ్రీలంక ప్లేయ‌ర్లు మ్యాచ్ టర్న్ చేశారు. వికెట్ నష్టపోకుండా చాలా జాగ్రత్తగా ఆడిన శ్రీలంక… ఓటమి నుంచి తప్పించుకుంది. దీంతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ క్రమంలో 1-0 తేడాతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.

శ్రీలంక, టీమిండియా రెండో టెస్ట్ డ్రా

శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 503 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 290 పరుగులకు కుప్పకూలింది. ఈ క్రమంలో శ్రీలంక జట్టుకు ఫాలో ఆన్ విధించాడు కెప్టెన్ గిల్. దీంతో రంగంలోకి దిగిన శ్రీలంక.. మ్యాచ్ ఓడిపోకుండా కాపాడుకుంది. నాలుగో రోజు ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయినప్పటికీ… ఇవాళ చాలా జాగ్రత్తగా ఆడారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఈ క్రమంలో ఐదవ రోజు ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయిన శ్రీలంక 429 పరుగులు సాధించింది. ఇక ఐదు రోజులు ముగిసిన నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. ఐదవ రోజున శ్రీలంక మిడిల్ ఆర్డర్ ఆటగాడు సోనాల్ దినుషా ( Sonal Dinusha) 133 పరుగులు చేసి ఇరగదీశాడు. నాటౌట్ గా నిలిచి శ్రీలంక ఓటమిని అడ్డుకున్నాడు. అతనికి తోడుగా కేశరా 46 పరుగులు చేసి రాణించాడు. అయితే సోనాల్ దినుషా వికెట్ తీసేందుకు టీమిండియా చాలా కష్టపడ్డప్పటికీ… ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో మ్యాచ్ డ్రా అయింది.

టీమిండియా WTC ఫైనల్ కు చేరాలంటే ఎలా?

Advertisement

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ డ్రా అయిన నేపథ్యంలో గిల్ సేనకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే…WTC పాయింట్ల పట్టికలో టీమిండియా, బంగ్లాదేశ్ జట్టును వెనక్కి నెట్టేది. అంటే నాలుగవ స్థానానికి టీమిండియా చేరుకునేది. కానీ ఈ ఓటమితో మరో రెండు పాయింట్లు కోల్పోయిన టీమ్ ఇండియా, అదే ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే టీమిండియా ఏడు మ్యాచ్ లలో కచ్చితంగా గెలవాలి. అలా గెలిస్తేనే 65 పైగా పాయింట్లను సాధించి రెండో స్థానాన్ని దక్కించుకుంటుంది. ఈ లెక్కన న్యూజిలాండ్ తో రెండు టెస్టులు… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు గెలవాలి. అలా అయితేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బరిలో టీమిండియా ఉంటుంది. లేకపోతే WTC ఫైనల్ ను వదులుకోవాల్సిందే.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

Related News

లార్డ్స్ లో పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు అవ‌మానం..కుర్చీలు మోయించిన ఇంగ్లాండ్

న‌న్ను రాళ్ల‌తో కొట్టి, చంపినా…ఇంగ్లండ్ పై పాకిస్తాన్ గెల‌వ‌దనే చెబుతా

స‌చిన్ కు బౌలింగ్ వేసేట‌ప్పుడు గుండెపోటు వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ్డా

గంగూలీ అంటేనే నాకు చిరాకు, కానీ PCB చేయ‌లేని సాయం చేశాడు !

బాబ‌ర్ చుట్టూ చెత్త నా కొడుకులు ఉన్నారు..లేక‌పోతే మ‌రో ధోని అయ్యేవాడు

ధోని ఓ అగ్ని ప‌ర్వ‌తం..5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్ చేశాడు, సెహ్వాగ్ సంచ‌ల‌నం

టీమిండియా జెర్సీని తీసేసి, రౌడీల్లా త‌న్నుకోండి..జైస్వాల్ పై స‌బా క‌రీమ్ ఫైర్‌

Big Stories

Advertisement
×