E-Paper
Advertisement

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్
Advertisement

Reality Show: విల్లీ వోంకా చాక్లెట్ ఫ్యాక్టరీలోకి నిజంగానే అడుగుపెడితే?  చాక్లెట్లు తినడం కాదు.. ఊహించని గేమ్స్, టెంప్టేషన్స్, ప్రమాదకరమైన ఛాలెంజ్‌లు ఎదుర్కొంటూ చివరి వరకు నిలబడాల్సి వస్తే? 12 గోల్డెన్ టికెట్లు దక్కించుకున్న 24 మంది కంటెస్టెంట్లు తమకు నచ్చిన పార్ట్‌నర్‌తో కలిసి ఈ మాయా ఫ్యాక్టరీలోకి ఎంట్రీ ఇస్తారు. శారీరకంగా, మానసికంగా, నైతికంగా పరీక్షించే టాస్కుల్లో పోటీపడుతూ చివరికి ఒక్కరే విజేతగా నిలవాలి. గెలిచిన వారికి జీవితాంతం సరిపోయేంత భారీ నగదు బహుమతి అందుతుంది. ఈ రియాలిటీ కాంపిటీషన్ ‘Wonka’s The Golden Ticket’. సెప్టెంబర్ 23 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. మరి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎలాంటి గేమ్స్ ఉంటాయి? టెంప్టేషన్స్‌ను తట్టుకుని ఎవరు చివరి వరకు నిలుస్తారు? ఒక్క విజేతకు దక్కే ప్రైజ్ మనీ ఎంత? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇది సాధారణ కథతో నడిచే సిరీస్ కాదు. దేశవ్యాప్తంగా గోల్డెన్ టికెట్ దక్కించుకున్న 12 మంది తమతో పాటు ఒక్కో పార్ట్‌నర్‌ను తీసుకుని వోంకా చాక్లెట్ ఫ్యాక్టరీలోకి అడుగుపెడతారు. అంటే మొత్తం 24 మంది పోటీదారులు. చిన్నప్పటి నుంచి ఊహల్లో మాత్రమే చూసిన వోంకా ప్రపంచం ఇప్పుడు వాళ్ల ముందే నిజమైన గేమ్ అరేనాగా మారుతుంది.

Advertisement

ఫ్యాక్టరీలోకి వెళ్లిన తర్వాత అసలు ఆట మొదలవుతుంది. గేమ్స్, టెస్టులు, టెంప్టేషన్స్ ద్వారా కంటెస్టెంట్ల శారీరక సామర్థ్యంతో పాటు మానసిక బలం, నిర్ణయాలు తీసుకునే తీరు, నైతికతను కూడా పరీక్షిస్తారు. ఓ టాస్క్‌లో గెలవడం మాత్రమే కాదు.. ఎప్పుడైనా ఊహించని పరిస్థితి ఎదురైతే టీమ్‌గా ఎలా స్పందిస్తారన్నదీ ముఖ్యం. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకుంటారా? డబ్బు కోసం టెంప్ట్ అవుతారా? లేక చివరి వరకు తమ పార్ట్‌నర్‌ను వదలకుండా ముందుకు సాగుతారా? అనేదే అసలు గేమ్.

చాక్లెట్ ఫ్యాక్టరీలోని ప్రతి గది ఓ కొత్త ఛాలెంజ్‌తో ఎదురవుతుంది. ఎవరు గెలుస్తారో చివరి వరకు అంచనా వేయలేని విధంగా పోటీ సాగుతుంది. చివరికి ఒక్క కంటెస్టెంట్ మాత్రమే వోంకా ఇచ్చే లైఫ్-చేంజింగ్ ప్రైజ్‌ను సొంతం చేసుకుంటాడు. సిరీస్‌కు సెప్టెంబర్ 30న రెండు భాగాలుగా ఫైనల్ ఎపిసోడ్లు రానున్నాయి.

తెలుగులో అందుబాటులో ఉందా?

Advertisement

‘Wonka’s The Golden Ticket’ ఇంగ్లీష్ ఒరిజినల్ రియాలిటీ కాంపిటీషన్ సిరీస్ సెప్టెంబర్ 23 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. 12 టీమ్స్, వోంకా చాక్లెట్ ఫ్యాక్టరీ, ఊహించని టాస్కులు, భారీ ప్రైజ్ మనీతో ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడటానికి సరదా కాంపిటీషన్‌గా నిలుస్తుంది. ప్రస్తుతానికి కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో స్ట్రీమింగ్ లో లేదు.

Read Also: మందు బాటిల్ వల్ల మొదలైన గొడవ… చివరికి క్రైమ్‌లో చిక్కుకున్న స్నేహితులు… ఫుల్ నవ్వులు

Tags

Related News

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఫ్రెండ్ కోసం ఫేక్ డేటింగ్… ప్రొఫెసర్‌తో ఆ పనిదాకా వెళ్తే… ఈ రొమాంటిక్ కామెడీ తెలుగులోనే

ముంబైని వణికించే మూగ చెవిటి లేడీ సైకో… వణుకు పుట్టించే డార్క్ క్రైమ్ థ్రిల్లర్

మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

అమాయక ఐస్‌క్రీమ్ మ్యాన్ వెనుక దాగివున్న డార్క్ సీక్రెట్… నిద్రను దూరం చేసే భయంకరమైన సైకో హర్రర్

సోదరుడి మృతదేహం కోసం అర్ధరాత్రి వచ్చిన వ్యక్తి… రాత్రంతా ఊపిరి బిగపట్టించే టెన్షన్… డార్క్ సస్పెన్స్ డ్రామా

Big Stories

Advertisement
×