OTT Movie : సూపర్నాచురల్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఒక తమిళ్ మూవీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఈసినిమా ట్రెండింగ్ అవుతూ ఉంది. ఈ సినిమా కులం, గౌరవం, ముఖ్యంగా స్త్రీలపై అణచివేత దోరణి హైలెట్ చేస్తుంది. క్లైమాక్స్ తో అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
Aha Tamil లో స్ట్రీమింగ్
2025లో విడుదలైన ఈ తమిళ సూపర్నాచురల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘యమకాతఘి’ (Yamakaathaghi). ఈ సినిమాకి పెప్పిన్ జార్జ్ జయశీలన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నైసాట్ వర్క్స్, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లలో నిర్మించబడింది. ఇందులో రూపా కొడువాయూర్, నరేంద్ర ప్రసాద్, గీతా కైలాసం, రాజు రాజప్పన్, సుబాష్ రామస్వామి, హరిత, ప్రదీప్ దురైరాజ్, జైసింత్ నటించారు. 113 నిమిషాల నిడివితో, ఈ సినిమా కులం, గౌరవం సూపర్నాచురల్ మిస్టరీ అంశాలతో తెరకెక్కించారు. ఎవరూ ఊహించని రీతిలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ చిత్రం 2025 మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. 2025 ఏప్రిల్ 14, నుండి Aha Tamil OTT ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది IMDbలో 6.6/10 రేటింగ్ పొందింది. దీని కథనం, నటనకు ప్రశంసలు అందుకుంది.
స్టోరీలోకి వెళితే
తంజావూర్ సమీపంలోని ఒక గ్రామంలో, ఊరి పెద్ద సెల్వరాజ్ నేతృత్వంలో గ్రామస్తులు స్థానిక ఆలయంలో “కాప్పు కట్టు” అనే సాంప్రదాయ ఆచారానికి సిద్ధమవుతుంటారు. సెల్వరాజ్ ప్రాచీన సంప్రదాయాలకు కట్టుబడి ఉంటాడు. కానీ అతని కుమార్తె లీలా (రూపా కొడువాయూర్) ఆస్తమాతో బాధపడుతూ, తండ్రి కఠినమైన నమ్మకాలపై తరచూ తిరుగుబాటు చేస్తుంది. లీలా ఆమె ఇన్హేలర్‌పై ఆధారపడుతూ, తన ప్రేమికుడు అన్బు (నరేంద్ర ప్రసాద్)తో రహస్య సంబంధాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ గ్రామంలో ఒక గది, మూఢనమ్మకంతో తాళం వేయబడి ఉంటుంది. దీనిని లీలా అమ్మమ్మ (గీతా కైలాసం) తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. లీలా ఆ గది నుండి వచ్చే దుర్వాసన గురించి ఆందోళన చెందుతుంది.
సెల్వరాజ్ ఆ గదిని తెరిచినప్పుడు, అక్కడ ఒక చనిపోయిన ఎలుక కనిపిస్తుంది. ఇది గ్రామస్తులలో భయాన్ని కలిగిస్తుంది. ఒక రోజు, లీలా సెల్వరాజ్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది. దీనిలో సెల్వరాజ్ ఆగ్రహంతో లీలాను చెంపదెబ్బ కొడతాడు. అవమానంతో, లీలా తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె కుటుంబం, తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి, ఈ మరణాన్ని ఆస్తమా వల్ల చనిపోయినట్లు నమ్మిస్తారు. అయితే లీలా శవాన్ని అంత్యక్రియల కోసం తరలించడానికి ప్రయత్నించినప్పుడు ఊహించని సంఘటన ఎదురుపడుతుంది. ఆ శవం కదలకుండా ఉంటుంది. ఇది గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది.
గ్రామస్తులు లీలా ఆత్మ, న్యాయం కోసం ఇంకా ఈ లోకంలో ఉందని నమ్ముతారు. ఆమె మరణానికి కారణమైన రహస్యాలు బయటపడకపోవడంతోనే శవం కదలదని భావిస్తారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, లీలా మరణం వెనుక దాగిన నిజాలు బయటపడతాయి. ఆమె సోదరుడు ముత్తు తన వైఫల్యాలను సరిదిద్దడానికి ఆలయ దేవత బంగారు హెడ్‌గేర్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఇది కుటుంబంలో మరింత ఉద్రిక్తతను కలిగిస్తుంది. లీలా ప్రేమ సంబంధం, కుటుంబ గౌరవం కోసం సెల్వరాజ్ కఠినంగా ప్రవర్తించడం, గ్రామంలోని కుల గౌరవ సమస్యలు కథను ముందుకు నడిపిస్తాయి. లీలా శవం, న్యాయం కోసం ఒక సూపర్నాచురల్ శక్తిగా, కుటుంబం, గ్రామస్తులను వారి పాపాలను ఒప్పుకోవడానికి ఒత్తిడి చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ తో అందరికీ ఫ్యూజులు అవుట్ అవుతాయి. లీలా శవం ఎందుకు కదలట్లేదు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : పని మనిషిగా వచ్చి యజమానితో రాసలీలలు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా