E-Paper
Advertisement

OTT Movie : దొంగ బాబా బంగారాన్ని కొట్టేసే గ్యాంగ్‌స్టర్ … కడుపుబ్బా నవ్వించే క్రైమ్ కామెడీ

OTT Movie : దొంగ బాబా బంగారాన్ని కొట్టేసే గ్యాంగ్‌స్టర్ … కడుపుబ్బా నవ్వించే క్రైమ్ కామెడీ
Advertisement

OTT Movie : ఓటీటీలో ఒక మరాఠీ క్రైమ్ కామెడీ సినిమా కడుపుబ్బా నవ్విస్తోంది. ఒక దొంగ బాబా వద్ద ఉన్న బంగారం అనుకోకుండా కొంతమంది చేతుల్లోకి మారుతుంది. ఆ తరువాత అసలు కామెడీ ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఇక ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. మొదట్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, వీక్‌లోనే చాలా మల్టీప్లెక్స్‌ల నుంచి ‘సైయారా’ వంటి ఇతర సినిమాల సునామిలో ఇది కొంచెం వెనుకబడింది. అయితే ఓటీటీలో మంచి వ్యూస్ తో నడుస్తోంది. ఫ్యామిలితో కలసి ఈ సినిమాని ఎంచక్కా ఎంజాయ్ చెయ్యచ్చు. ఈ సినిమాపేరు, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025లో విడుదలైన ఈ మరాఠీ క్రైమ్ కామెడీ సినిమా పేరు ‘యే రే యే రే పైసా 3’ (Ye Re Ye Re Paisa 3). ఇది సూపర్ హిట్ ‘యే రే యే రే పైసా’ సిరీస్‌లో మూడవ భాగం. సినిమా జులై 18, 2025న థియేటర్లలో రిలీజ్ అయింది. దర్శకత్వం సంజయ్ జాధవ్ చేశారు. మునుపటి రెండు భాగాలకు కూడా ఆయనే దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కరణ్ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సమర్పించడం విశేషం.
ఇందులో సంజయ్ నార్వేకర్, సిద్ధార్థ్ జాదవ్, ఉమేష్ కామత్, ఆజస్విని పండిట్ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది ఈ సినిమా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఓ దొంగ బాబా వద్ద ఉన్న బంగారం స్మగ్లింగ్ మిస్ అవ్వడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ బంగారు బిస్కెట్లు అనుకోకుండా ఒక గ్యాంగ్‌స్టర్, ఒక సింగర్, ఒక నటుడు చేతుల్లోకి మారుతాయి. ఆ బంగారం తమదంటే తమదని ప్రతి ఒక్కరూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపిస్తూ, దానిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ సీన్స్ చాలా సరదాగా సాగుతాయి. అయితే కథలో అసలైన ట్విస్ట్ ఏమిటంటే, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఆ బంగారం నిజానికి నకిలీదని ఆలస్యంగా తెలుస్తుంది. ఈ గందరగోళం మధ్య వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు, ఒకరినొకరు మోసం చేసుకునే సీన్స్ ప్రేక్షకులకు నవ్వును తెప్పిస్తుంటాయి.

Read Also :  డేవ్ బటిస్టా – జాసన్ మోమోవా క్రేజీ కామెడీ… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈ కొత్త మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Related News

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

Big Stories

Advertisement
×