Pope Successor Election| ప్రపంచవ్యాప్తంగా కేథలిక్ క్రైస్తవుల మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ మరణించిన తరువాత ఆయన వారసుడిని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతోంది. వందల ఏళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాల ప్రకారం కొత్త పోప్ ఎన్నిక చాలా గోప్యంగా, సుదీర్ఘంగా ప్రక్రియ జరిగుతుంది. ఇది పూర్తిగా వాటికన్‌లోని సిస్టిన్ చాపెల్‌లోనే జరగడం, ఎలాంటి సమాచారం బయటకు పొక్కకూడదనే నిబంధనల మధ్య జరుగుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను బయట చెప్పడం నిషిద్ధం. 1996లో పోప్ జాన్‌పాల్ 2 ప్రవేశపెట్టిన కఠిన నియమాలను పోప్ బెనెడిక్ట్ రెండుసార్లు సవరిస్తూ కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన కార్డినల్స్‌ను వెంటనే తొలగించేలా పోప్ బెనెడిక్ట్ 16 నిబంధనలను మరింత కఠినతరం చేశారు.
పోప్ మృతికి అనంతరం ప్రారంభమయ్యే ప్రక్రియ:
- పోప్ మరణించాక, రోజువారీ పనులను కార్డినల్ కెవిన్ ఫారెల్ చాంబర్లెయిన్ హోదాలో కేవలం లాంఛనంగా నిర్వర్తిస్తారు. కానీ, ఆయన ఈ సమయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోరు.
- చాంబర్లెయిన్ అధికారికంగా పోప్ మరణాన్ని ధృవీకరించిన తర్వాత, పోప్ నివాసాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు.
- పోప్ మరణించాక, కొద్ది మందిని మినహాయిస్తే, మిగతా వాటికన్ ఉన్నతాధికారులంతా తాత్కాలికంగా తమ పదవులనుంచి తప్పుకుంటారు.
- పోప్ అధికారిక ముద్రగా ఉపయోగించే ‘ఫిషర్‌మన్స్ రింగ్’ను చాంబర్లెయిన్ ఒక ప్రత్యేకమైన సుత్తెతో ధ్వంసం చేస్తారు. ఇది ప్రస్తుత పోప్ పాలనకు ముగింపు అని సంకేతం.
- కార్డినల్స్ కాలేజీ త్వరగా సమావేశమై పోప్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను నిర్ణయిస్తుంది.
- పోప్ ఫ్రాన్సిస్ కోరిక మేరకు, ఆయన అంత్యక్రియలు ఆయన ప్రీతిపాత్రమైన సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఎంతో సాదా సరళంగా నిర్వహించబడతాయి.
- సాధారణంగా మూడు రకాల శవపేటికలు (సైప్రస్, జింక్, ఇల్మ్ వుడ్స్‌తో) వాడుతారు. అయితే ఫ్రాన్సిస్ కోరిక మేరకు కేవలం జింక్‌తో తయారైన ఒకే పేటికను ఉపయోగించనున్నారు.
- తర్వాత వంతెనగా 9 రోజులపాటు వాటికన్‌లో సంతాప దినాలు పాటిస్తారు. ఈ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచీ కార్డినల్స్ అందరూ రోమ్‌కు వస్తారు.
పోప్ ఎన్నిక సాగుతుందిలా
- పోప్ మరణించిన 15 నుండి 20 రోజులలోపే కొత్త పోప్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- సిస్టిన్ చాపెల్‌లో కార్డినల్స్ అందరూ సమావేశమై ఓటింగ్ ద్వారా కొత్త పోప్‌ను ఎన్నుకుంటారు.
- ఈ ఎన్నికకు అర్హత కలిగినవారు వయసు 80లోపు ఉన్న కార్డినల్స్ మాత్రమే. ప్రస్తుతం అటువంటి వారు 135 మంది ఉన్నప్పటికీ, ఓటు హక్కుతో పాల్గొనేవారి గరిష్ఠ సంఖ్య 120గా మాత్రమే ఉండాలి.
- ఓటింగ్ ప్రక్రియ కాగితపు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఈ బ్యాలెట్ పత్రంపై “సుప్రీం పాంటిఫ్‌గా నేను ఎన్నుకుంటున్నది” అని రాసి, పక్కన ఆ వ్యక్తి పేరు రాసేలా ఖాళీ వుంటుంది.
- కార్డినల్ తమకు నచ్చిన అభ్యర్థి పేరును రాసి, ఆ బ్యాలెట్‌ను సగానికి మడిచి ట్రేలో వేస్తారు.
- ముగ్గురు కార్డినల్స్ (స్ర్కుటినీర్స్) ప్రతి ఓటును చెక్ చేస్తారు.
- తర్వాత ఒక్కో ఓటును తెరిచి అందులోని పేరును చదివి లెక్క పెడతారు.
- ప్రతి ఓటింగ్ రౌండ్ అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు.
- కనీసం మూడింట రెండొంతుల ఓట్లు వచ్చిన అభ్యర్థి మాత్రమే పోప్‌గా ఎంపిక అవుతారు.
- మొదటి ఓటింగ్‌కు ముందు ‘ఇనిషియల్ మాస్’ అనే ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం ఉంటుంది.
- పోప్ ఎంపిక కావడంలో విఫలమైతే, ఆ బ్యాలెట్లను సూది ద్వారా గుచ్చి స్టౌలో వేసి కాలుస్తారు.
- ఇది సిస్టిన్ చాపెల్ పైభాగంలోని చిమ్నీ నుంచి నల్ల పొగ రూపంలో బయటకు వస్తుంది, దీని అర్థం పోప్ ఇంకా ఎన్నిక కాలేదని.
- ఒక అభ్యర్థి ఎంపికైన వెంటనే, తెల్ల పొగ బయటికి వస్తుంది. అప్పుడు చర్చి గంటలు మోగుతాయి.
- కార్డినల్స్ నూతన పోప్ పేరు ప్రకటిస్తారు.
- తర్వాత కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రజల ముందు ప్రత్యక్షమై, తన తొలి ఆశీర్వాదాన్ని అందిస్తారు.
- ఎన్నిక ప్రక్రియ నడుస్తున్నంతకాలం, కార్డినల్స్‌తో పాటు ఆ ప్రక్రియలో పాల్గొనే వారెవ్వరూ బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం పెట్టుకోరాదు. మొబైల్ ఫోన్లు, ఆడియో లేదా వీడియో పరికరాలు తీసుకెళ్లడం పూర్తిగా నిషిద్ధం.
Also Read: వివాహం ఒక రోజు ముందు వరుడి కండీషన్.. పెళ్లికూతురు ఆత్మహత్య
పోప్ ఫ్రాన్సిస్ వారసుడిగా వినిపిస్తున్న ముఖ్య అభ్యర్థులు:
పాప్శీ కోసం బాప్టిజం తీసుకున్న క్యాథలిక్ పురుషుడు ఎవరైనా ఎంపికయ్యే అర్హత కలిగి ఉన్నా, 1378 నుంచి కేవలం కార్డినల్స్ మాత్రమే పోప్‌గా ఎంపికవుతూ వస్తున్నారు. ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ వారసుడిగా గట్టిపోటీగా ఉన్నవారిలో ప్రముఖులెవరంటే –
- కార్డినల్ లూయిస్ టగ్లే (67) – ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈయనను వాటికన్ మిషనరీ కార్యాలయానికి పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా ఎంపిక చేశారు.
- కార్డినల్ మట్టెయో జుప్పీ (69) – ఇటలీకి చెందిన ఈయనకు ఫ్రాన్సిస్ ప్రత్యేక అభిమానం ఉన్నారు.
- కార్డినల్ పియెట్రో పారోలిన్ (70) – ఇటలీకి చెందిన ఈయన ప్రస్తుతం వాటికన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు.
- కార్డినల్ మార్క్ ఔలెట్ (80) – కెనడాకు చెందిన ఈయన 2010 నుండి 2023 వరకూ బిషప్స్ విభాగానికి నేతగా పనిచేశారు.
- కార్డినల్ క్రిస్టోఫ్ షోన్‌బర్న్ (80) – ఆస్ట్రియాకు చెందిన ఈయన పోప్ బెనెడిక్ట్ 16కి శిష్యుడిగా ఉన్నారు. సంప్రదాయవాదిగా పేరొందిన వారు.
పోప్ ఎన్నికల్లో పొల్గొనబోతున్న భారతదేశానికి చెందిన నలుగురు కార్డినల్స్:
పోప్ ఎన్నికలో పాల్గొనబోయే 135 మంది కార్డినల్స్‌లో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. వారు ఫిలిప్ నెరీ ఫెరారో, బాసెలియొస్ క్లీమిస్, ఆంథోనీ పూల, జార్జ్ జాకోబ్ కూవకాడ్.

Share