BigTV English

OTT Movie : నోటిలో క్లూ వదిలి వరుస హత్యలు చేసే సైకో … మెంటలెక్కించే మలయాళం క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : నోటిలో క్లూ వదిలి వరుస హత్యలు చేసే సైకో … మెంటలెక్కించే మలయాళం క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఈమధ్య పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. వీటిలో చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. ఓటిటిలో కూడా ఇటువంటి సినిమాలు దూసుకుపోతున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, ఇటువంటి సినిమాలు తీస్తున్నారు మేకర్స్ . ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ లో ఒక సైకో కిల్లర్ ని పట్టుకునే క్రమంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే..


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డి యన్ ఏ’ (DNA). 2024 లో వచ్చిన ఈ మూవీకి టి.ఎస్. సురేష్ బాబు దర్శకత్వం వహించారు. ఎ.కె. సంతోష్ దీనిని రచించారు. ఇందులో అష్కర్ సౌదాన్, రాయ్ లక్ష్మి, బాబు ఆంటోనీ, అజు వర్గీస్, రెంజీ పనిక్కర్, హన్నా రెజీ కోషి ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి శరత్ సంగీతం అందించగా , బెంజీ ప్రొడక్షన్ బ్యానర్ పై  KV. అబ్దుల్ నాజర్ ఈ సినిమాను నిర్మించారు.  ఒక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

కొచ్చిలో వరుసగా దారుణమైన హత్యలు జరుగుతాయి. ఈ హత్యలను పోలీసులు ‘పెన్‌డ్రైవ్ కిల్లింగ్స్’ అని పిలుస్తారు. ఎందుకంటే చనిపోయిన  ప్రతి బాధితుడి నోటిలో ఒక పెన్‌డ్రైవ్ కనిపిస్తుంది. ఈ కేసును ఛేదించే బాధ్యత రాచెల్ పున్నూస్ అనే ఐపిఎస్ అధికారిణికి అప్పగిస్తాడు పోలీసు కమిషనర్. ఆమె తన బృందంతో కలిసి ఈ హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొనేందుకు దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఆతరువాత లక్ష్మీ ఇందులో  నారాయణ్, హన్నా అనే రేడియో జాకీలు కూడా పరిచయం చేయబడతారు. వీరు కొచ్చిలోని ఒక ప్రముఖ రేడియో స్టేషన్‌లో జాకీలుగా పనిచేస్తారు. దర్యాప్తు సాగుతున్న కొద్దీ, హంతకుడు పోలీసులను ఎగతాళి చేస్తూ, ఒక్కొక్క హత్యను మరింత దారుణంగా చేస్తాడు. ఈ హత్యల వెనుక ఉన్న ఉద్దేశం వ్యక్తిగత ప్రతీకారంగా తేలుతుంది. హంతకుడు ఎవరూ ఊహించని వ్యక్తిగా మారుతాడు. కథలో ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంది. ఇక్కడ హంతకుడు బాట్‌మన్ లాంటి దుస్తులు ధరించి, బాధితులను సజీవంగా శవపరీక్ష చేస్తూ హత్యలు చేస్తాడు. రాచెల్, ఆమె బృందం ఈ కేసును ఛేదించడానికి అనేక క్లిష్టమైన సాక్ష్యాలను సేకరిస్తారు. చివరకు హంతకుడిని రాచెల్ పట్టుకుంటుందా ? అతడు ఎందుకు హత్యలు చేస్తున్నాడు ? చంపేటప్పుడు పెన్ డ్రైవ్ లను నోట్లో ఎందుకు పెడుతున్నాడు ? విషయాలను ఈ మూవీని చూసి తెలుసుకోండి.

Reaad Also : ఈ సెలూన్ లోకి వెళ్తే తలకాయలు తెగిపోతాయి … ఈ సైకో పిల్ల వేశాలకు గుండెల్లో దడ పుట్టాల్సిందే

Related News

OTT Movie : శబ్దం చేస్తే బతికుండగానే నమిలి మింగేసే డెత్ ఏంజెల్స్… కల్లోనూ వెంటాడే 1 గంట 30 నిమిషాల థ్రిల్లర్

OTT Movie : ఇంట్లో నుంచి పారిపోయి అబ్బాయిలతో అలాంటి పని… స్టేజ్ పైనే అంతా చేసే అమ్మాయి

OTT Movie : కోరిక తీర్చలేదని గర్ల్ ఫ్రెండ్ ని ట్రిప్పుకు తీసుకెళ్లి… మస్ట్ వాచ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : స్కూల్లోనే దుకాణం ఓపెన్.. ఇటు గర్ల్ ఫ్రెండ్, అటు టీచర్ తో… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అదృశ్యం… 2 గంటల సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్… క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్

OTT Movie : వెంటాడే చెట్టు శాపం… ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసే పువ్వులు… వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ మూవీ

OTT Movie : స్కూల్ నుంచి తిరిగొచ్చేలోపు బాయ్ ఫ్రెండ్ తో తల్లి… వాడిచ్చే ట్విస్టుకు వణుకు పుట్టాల్సిందే మావా

OTT Movie : మర్డర్ మిస్టరీకి టేస్టీ ఫుడ్ టచ్… కొరియన్ మూవీ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్

Big Stories

×