OTT Movie : ఓటీటీలోకి సరికొత్త కంటెంట్ తో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూడు సినిమాలు ఓటీటీలో టాప్ లేపుతున్నాయి. ఇవి డిఫరెంట్ జానర్స్ తో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటి పేర్లు ఏమిటి ? ఎందులో చూడచ్చో తెలుసుకుందాం పదండి.
‘జిన్ : ది పెట్’ (Jinn: The Pet)
2025లో విడుదలైన ఈ తమిళ ఫాంటసీ-హారర్-కామెడీ మూవీకి టి.ఆర్. బాలా దర్శకత్వం వహించారు. ఫెయిరీ టేల్ పిక్చర్స్, అనిల్ కుమార్ రెడ్డి ఏఆర్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌ల కింద ఈ సినిమాన నిర్మించారు. ఇందులో ముగెన్ రావు, భవ్య త్రిఖా, బాలా సరవణన్, ఇమ్మాన్ అన్నాచి, రాధా రవి, వడివుక్కరసి, నిజల్గల్ రవి, వినోధిని వైద్యనాథన్, జార్జ్ విజయ్ వంటి నటులు నటించారు. ఇది సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న స్టోరీతో తెరకెక్కింది. ఒక మిస్టరీ బాక్స్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. ఆ బాక్స్ లో అతీంద్రీయ శక్తి ఉంటుంది. దానిని తీసుకొచ్చాక భయంకరమైన సన్నివేశాలు జరుగుతాయి. ఈ సినిమా 2025 మే 30న థియేటర్లలో విడుదలైంది. 2025 జూన్ 20 నుండి సన్ ఎన్ఎక్స్‌టీ (Sun NXT)లో స్ట్రీమింగ్ అవుతోంది. :
‘కలియుగం’ (Kaliyugam)
2025లో విడుదలైన ఈ సినిమా, తమిళం, తెలుగు భాషలలో రూపొందిన ఒక పోస్ట్-అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్. దీనికి ప్రమోద్ సుందర్ తొలిసారిగా దర్శకత్వం వహించారు. దీనిని ఆర్‌కె ఇంటర్నేషనల్, ప్రైమ్ సినిమాస్ బ్యానర్‌ల కింద కె.ఎస్. రామకృష్ణ, కె. రామ్‌చరణ్ నిర్మించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ (భూమి), కిషోర్ (శక్తి), ఇనియన్ సుబ్రమణి (థామస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2064 సంవత్సరంలో ఆహారం, నీరు, మానవత్వం కోల్పోయిన ఒక అపోకలిప్టిక్ ప్రపంచంలో జరుగుతుంది.ఈ చిత్రం 2025 మే 9న థియేటర్లలో విడుదలైంది. తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ చేసింది. జూన్ 20 నుండి సింప్లీ సౌత్ (Simply South) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తమిళ సినిమాలో అరుదైన డిస్టోపియన్ జానర్‌ను ప్రయత్నించినందుకు ప్రశంసలను అందుకుంది. IMDbలో ఈ సినిమాకి 8.7/10 రేటింగ్ ఉంది.
‘సేవ్ నల్ల పసంగ’ (Save Nalla Pasanga)
2025లో విడుదలైన తమిళ కామెడీ-డ్రామా వెబ్ సిరీస్ కి సి. సతీష్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ 2025 జూన్ 20 నుండి 8 ఎపిసోడ్‌లతో Aha Tamilలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అజయ్ ప్రసాద్ (కన్నన్), విష్ణు (పళని), అన్నా అడోర్ (జెస్సికా) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సిరీస్ లవ్ ఫైల్ అయిన ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది.
Read Also : అమ్మాయిలు ఆ అపార్ట్మెంట్లో అడుగు పెడితే నరకమే… రెంట్‌కి ఉండాలంటే ప్రాణాలు వదులకోవాలి