E-Paper
Advertisement

భారీ ధరకు ‘జనవరి 12 విడుదల’ ఓటీటీ రైట్స్..వెంకీ కెరీర్ లోనే హైయెస్ట్!

భారీ ధరకు ‘జనవరి 12 విడుదల’ ఓటీటీ రైట్స్..వెంకీ కెరీర్ లోనే హైయెస్ట్!
Advertisement

January 12 Vidudala OTT: సంక్రాంతి హిట్ మిషన్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన అనిల్ రావిపూడి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈయన డైరెక్షన్లో వెంకటేష్(Venkatesh), కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోలుగా నటిస్తున్న చిత్రం “జనవరి 12 విడుదల”(January 12 Vidudala).

రూ. 80 కోట్లకు జనవరి 12 విడుదల రైట్స్..

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పనులను కూడా వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజినెస్ కూడా జరుపుకుంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5(Zee 5)రూ.80 కోట్లకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

జీ 5 చేతికి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్..

Advertisement

ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరలకు అమ్ములు పోవడంతో దాదాపు సగం పెట్టుబడి మొత్తం వచ్చేసిందనే చెప్పాలి. ఇకపోతే విక్టరీ వెంకటేష్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ సినీ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ అని తెలుస్తోంది. ఇలా జీ 5 కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా ఆడియో, సాటిలైట్ రైట్స్ కూడా కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమా అంటే సూపర్ హిట్ అనే మార్క్ ఇండస్ట్రీలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈయన సినిమాకు ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయని చెప్పాలి.

సంక్రాంతి హిట్ రిపీట్ అయ్యేనా..

ఇక ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకుని ప్రమోషన్లను కూడా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ కు ఇది ఐదో సినిమా కావటం విశేషం. ఇక కళ్యాణ్ రామ్ కు రెండవ సినిమా. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహుగరపాటి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: 10 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ వెళ్ళను..కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్!

Related News

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు పునకాలే.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

Big Stories

Advertisement
×