E-Paper
Advertisement

10 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ వెళ్ళను..కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్!

10 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ వెళ్ళను..కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్!
Advertisement

Bigg Boss 10 Telugu: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి చాలా మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రచారం అవుతూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక తెలుగులో ఈ కార్యక్రమానికి కూడా చాలా మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం తెలుగులో సీజన్ 10 కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమం రెండు వారాలను పూర్తి చేసుకొని హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపించారు.

బిగ్ బాస్ షో పై త్రిగుణ్ షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొనడానికి చాలామంది ఆసక్తి చూపు ఉంటారు. మరి కొంతమంది మాత్రం అవకాశం వచ్చినా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ మాకు కోట్లు ఆఫర్ ఇచ్చినా వెళ్లమంటూ మాట్లాడిన వారు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10 Telugu)కంటెస్టెంట్ గా కొనసాగుతున్న త్రిగుణ్(Trigun) సైతం బిగ్ బాస్ కార్యక్రమం పై గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రూ. 10 కోట్లు ఇచ్చిన నేను ఉండలేను…

Advertisement

త్రిగుణ్ వెండితెర నటుడిగా పలు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు అయితే గతంలో ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు బిగ్ బాస్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీకు బిగ్ బాస్ అవకాశం రాలేదా అంటూ ప్రశ్నించగా తనకు ప్రతి ఒక్క సీజన్లోనూ అవకాశం వచ్చిందని కానీ నేనే వెళ్లలేదని త్రిగుణ్ తెలిపారు. నాకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం ప్రతి సీజన్ ప్రతి ఒక్క ఎపిసోడ్ కచ్చితంగా చూస్తానని తెలిపారు.. కానీ అక్కడ నేను గేమ్స్ ఆడలేనని తెలిపారు ఇప్పుడు ఎవరైనా 10 కోట్లు ఇచ్చి లాక్ చేసి అక్కడే ఉండాలి అంటే నేను ఉండలేనని, నేనే ఎదురు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేస్తాను అంటూ ఈయన మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

ఇలా 10 కోట్లు ఇచ్చినా కూడా తాను ఉండనని గతంలో చెప్పిన త్రిగుణ్ ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి తనదైన శైలిలోనే టాస్కులు ఆడుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక త్రిగుణ్ గురించి కాస్త నెగెటివిటీ వచ్చినప్పటికీ టాస్కుల విషయంలో మాత్రం అద్భుతంగా ఆడుతూ విన్నర్ రేసులో ఉన్నారని చెప్పాలి. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఇష్టం లేదని చెప్పిన త్రిగుణ్ ఇప్పుడు విన్నర్ రేస్ లో ఉండడంతో ఈయన ఓల్డ్ వీడియో పై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ 10 లవ్ ట్రాక్స్..విన్నర్ ఎవరో చెప్పిన కృష్ణుడు!

Related News

‘ఢీ’ షో వచ్చాకే మార్పు మొదలైందా.. ఉదయభాను షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్!

బిగ్ బాస్ 10 లవ్ ట్రాక్స్..విన్నర్ ఎవరో చెప్పిన కృష్ణుడు!

“నిజం ఎప్పుడూ దాగదు”.. మాధురి రాథోడ్ సంచలన పోస్ట్!

బిగ్ బాస్ 10 3వ వారంలో నామినేట్ అయ్యింది వీరే.. అయ్యో వీరు కూడానా?

డైలీ 10 కేజీల స్వీట్స్ తింటాను..నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న కృష్ణుడు మాటలు!

సుధీర్ పై సృష్టి ఫైర్.. మరీ అంత ఫ్లర్ట్ చేశాడా?

బిగ్ బాస్ నుంచి కృష్ణుడు అవుట్.. రెండు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×