Cash Exchange: ఫోన్ పే చేస్తాం.. క్యాష్ ఇస్తారా? అనే ఒక్క మాటకు మీరు ఒప్పుకున్నారా.. అయితే మీ అకౌంట్‌లు ఫ్రీజ్ అయినట్లే. ఈ ఒక్క మాటకు తొందరపడి ఒప్పుకుంటే.. పోలీస్ కేసులో చిక్కుకున్నట్లే. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతంలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్లంగా కలకలం రేపుతోంది.
గుర్తుతెలియని వ్యక్తులు తమ దుకాణాలకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌లను, ఇతరులకు పంపి డబ్బులు కొట్టివగా, గుర్తు తెలియని వ్యక్తులకు నగదు ఇచ్చినందుకు ముగ్గురు వాణిజ్య కేంద్రాల వ్యక్తులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. పోలీసుల దర్యాప్తులో వారి పై కేసులు కూడా నమోదయ్యాయి. అసలు ఈ డబ్బుల వెనుక ఉన్న కథ ఏమిటంటే.. నల్గొండ జిల్లాకు చెందిన షేక్ ఇర్ఫాన్, చింతలచెరువు ప్రశాంత్ ఒక ముఠాగా ఏర్పడి పోలీసులమంటూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని నమ్మించేలా పక్కా ప్లాన్ వేశారు.
Also read: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. మీ బట్టలూడదీసే ధైర్యం మాకుంది, వైసీపీకి సీఎం చంద్రబాబు వార్నింగ్
తమ వాట్సాప్ నంబర్లకు పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను డీపీగా పెట్టుకోవడంతో పాటు, ట్రూ కాలర్‌లో కూడా పోలీసుల తరహాలో గుర్తింపును చూపిస్తూ బాధితులను నమ్మించే ప్రయత్నం చేశారు. కేసముద్రం మండలంలోని బంగారు వ్యాపారులకు ఫోన్ చేసి.. “మీరు దొంగ బంగారం కొనుగోలు చేశారు. మీకు బంగారం అమ్మిన దొంగలు మా దగ్గర పట్టుబడ్డారు. మేము ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం” అంటూ భయపెట్టారు.
పోలీసుల పేరుతో బెదిరింపులకు దిగడంతో కొందరు వ్యాపారులు భయాందోళనలకు గురయ్యారు. ఇదే అదనుగా సుమారు రూ.4 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు దొంగలు పట్టుబడ్డారు. నిందితులను అరెస్ట్ చేయడం పాటు మోసపోయిన వారి డబ్బులు రికవరీ చేశారు. ఎలాంటి సంబంధం లేని పలు వాణిజ్య కేంద్రాల యాజమానుల అకౌంట్లు సీజ్ అయ్యాయి. దీంతో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఎవరు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే నగదు ఇవ్వొద్దని ఎస్పీ తెలిపారు.
Also read: వరి వద్దు.. ఈ సర్కార్ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!