BigTV English
Advertisement

OTT Movie : అదిరిపోయే ఫైట్ సీన్స్‌, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు… ఓటీటీలోకి వచ్చేసిన సర్వైవల్ హారర్ జాంబీ థ్రిల్లర్

OTT Movie : అదిరిపోయే ఫైట్ సీన్స్‌, ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు… ఓటీటీలోకి వచ్చేసిన సర్వైవల్ హారర్ జాంబీ థ్రిల్లర్

OTT Movie : ఇప్పటిదాకా మనం ఎన్నో హారర్, జాంబీ సినిమాలను చూశాము. కానీ జాంబీలతో భయపెట్టే సన్నివేశాలతో పాటు, అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉన్న మూవీస్ మాత్రం అతి తక్కువగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఎందుకంటే జాంబీల నుంచి తప్పించుకోవడం అనే సర్వైవల్ కాన్సెప్ట్ పైనే ఇప్పటిదాకా ఎక్కువగా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మాత్రం సర్వైవల్ ప్లస్ యాక్షన్ సీన్స్ తో దుమ్మురేపుతోంది. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? కథ ఏంటి? అనే వివరాలను తెలుసుకుందా పదండి.


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్…

“జియామ్” (Ziam) అనేది 2025లో విడుదలైన థాయ్‌లాండ్‌కు చెందిన యాక్షన్-హారర్ జాంబీ చిత్రం. జూలై 9 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా భవిష్యత్తు థాయ్‌లాండ్‌లో పర్యావరణ విపత్తు, ఆహార కొరత నేపథ్యంలో జరిగే ఒక ఉత్కంఠభరితమైన జాంబీ అపోకలిప్స్ కథ. ముయ్ థాయ్ మార్షల్ ఆర్ట్స్‌తో కూడిన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, భయంకరమైన జాంబీలు, సమాజంలోని అసమానతలు, పర్యావరణ సమస్యలను సూచించే సందేశం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ఈ చిత్రం ప్రధానంగా యాక్షన్, హారర్ జానర్‌ లో తెరకెక్కినప్పటికీ, జాంబీ అపోకలిప్స్ థీమ్‌తో సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ వంటి అంశాలు కూడా ఉన్నాయి. ముయ్ థాయ్ ఫైట్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జాంబీలతో జరిగే హోరాహోరీ యుద్ధాలు హారర్ అభిమానులను ఆకట్టుకుంటాయి. ఇందులో మార్క్ ప్రిన్ సుపరత్ (సింగ్), నైచా నుట్టనిచా (రిన్), వైలా వాన్‌వైలా (బడ్డీ) ప్రధాన పాత్రలు పోషించారు.


కథలోకి వెళ్తే…

భవిష్యత్తు థాయ్‌లాండ్‌లో పర్యావరణ విపత్తు, ఆహార కొరత సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. అక్కడే నివసించే సింగ్ ఒక మాజీ ముయ్ థాయ్ ఫైటర్. ఇప్పుడు మాత్రం డెలివరీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. అతని ప్రేయసి రిన్ ప్రచమిత్ అనే ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తుంది. హఠాత్తుగా ధృవాలలో కరిగిన మంచు నుండి విడుదలైన ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరస్ ఆసుపత్రిలో వ్యాపిస్తుంది, అది మనుషులను వేగవంతమైన, కిరాతకమైన జాంబీలుగా మారుస్తుంది.

సింగ్, రిన్‌ తో పాటు ఒక చిన్న బాలుడు బడ్డీని రక్షించేందుకు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తాడు. అతని ముయ్ థాయ్ నైపుణ్యాలతో జాంబీల తుక్కు రేగ్గొడుతూ, ఆలస్యం కాకముందే వారిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రాయల్ థాయ్ ఆర్మీ ఈ జాంబీలు ఉన్న అదే ఆసుపత్రిని బాంబులతో నాశనం చేయడానికి సిద్ధం అవుతుంది. బాంబు కూడా పెడుతుంది. మరి హీరో హీరోయిన్ ను అనుకున్నట్టుగానే అంతమంది జాంబీల నుంచి రక్షించగలిగాడా ? చివరికి వచ్చే ట్విస్ట్ ఏంటి? హీరో అందులో నుంచి బయట పడ్డాడా లేక చనిపోయాడా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ ను చూడాల్సిందే.

Read Also : లేడీ గెటప్ వేసిన పాపానికి ఊహించని పని… అబ్బాయి అని తెలిసినా వదలకుండా…

Related News

OTT Movie : 43 అవార్డులను గెలుచుకున్న సిరీస్… గ్రిప్పింగ్ నరేషన్, థ్రిల్లింగ్ ట్విస్టులు… తెలుగులోనూ స్ట్రీమింగ్

OTT Movie : నెట్ ఫ్లిక్స్ లో ఉన్న తోపు కే-డ్రామాలు… IMDb లో 8.5 కంటే ఎక్కువ రేటింగ్‌… ఇందులో మీరెన్ని చూశారు ?

OTT Movie : తండ్రి కళ్ళముందే పక్కింటోడితో ఆ పని… చదువుకోవాల్సిన వయసులో ఇదేం పాడు పని పాపా?

OTT Movie : ఓటీటీలో గత్తర లేపుతున్న 1 గంట 52 నిమిషాల థ్రిల్లర్ డ్రామా… క్షణక్షణం ఉత్కంఠ… IMDb లో 7.1 రేటింగ్

OTT Movie : మొదటి రాత్రే వదిలేసే భర్త… ఫొటోగ్రాఫర్ తో పని కానిచ్చే భార్య… మనసుకు హత్తుకునే రొమాంటిక్ డ్రామా

OTT Movie : చీమలు దూరని చిట్టడవిలో ట్రాప్… 100 ఏళ్ళ దెయ్యాల రివేంజ్‌కు బలి… కల్లోనూ వెంటాడే హర్రర్ కథ

OTT Movie : భార్యాభర్తల మధ్యలోకి మరొకరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : డీమాన్‌తో దిక్కుమాలిన పని… ఫ్రెండ్స్‌నే బలిచ్చి… గుండె జారిపోయే సీన్లున్న హర్రర్ మూవీ

Big Stories

×