BigTV English

OTT Movie : లేడీ గెటప్ వేసిన పాపానికి ఊహించని పని… అబ్బాయి అని తెలిసినా వదలకుండా…

OTT Movie : లేడీ గెటప్ వేసిన పాపానికి ఊహించని పని… అబ్బాయి అని తెలిసినా వదలకుండా…

OTT Movie : హర్రర్ జానర్లోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందింది. ఇందులో ఓ ఫ్యామిలీలోని మనుషులు వరుసగా చనిపోతారు. అలా హర్రర్ మాత్రమే కాదు స్క్రీన్ లకు కట్టిపడేసే సస్పెన్స్ కూడా ఉంటుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.


జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘అంధర్ మాయ’ (Andhar Maya). ఇదొక మరాఠీ సూపర్‌ నాచురల్ హారర్ వెబ్ సిరీస్. హర్రర్, మిస్టరీ, సస్పెన్స్ అంశాలు కలగలిపి ఉన్న ఈ మూవీ ఒక మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఈ సిరీస్ రొటీన్ హారర్‌ ను మించి, కుటుంబ సంబంధాలలోని భావోద్వేగ, ఆధ్యాత్మిక హాంటింగ్‌, సైకలాజికల్ డెప్ తో నడుస్తుంది. ఇది కుటుంబ వివాదాలు, నమ్మక లోపం, సీక్రెట్స్ వంటి అంశాలను హైలైట్ చేస్తూ, ఒక హర్రర్ కథనంతో సాంస్కృతిక అంశాలను మిళితం చేసి తెరకెక్కించిన కథ. ఈ సిరీస్‌లో కిషోర్ కడం (గోన్యా), రుతుజా బాగ్వే, శుభంకర్ తావ్డే, స్వప్నలీ పాటిల్, శుభంగీ భుజ్బల్, అనుప్ బెల్వాకర్, ఓంప్రకాశ్ షిండే, పిహు గోసవి, ఆరవ్ ఆయీర్ నటించారు. “అంధర్ మాయ” డైరెక్ట్ గా ZEE5లో ప్రీమియర్ అయింది. ప్రస్తుతం అందులోనే స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : పెళ్ళైన అమ్మాయిలతోనే మగ దెయ్యం పాడు పనులు… కల్లోకి వచ్చి మరీ ఈ అరాచకం ఏంటి భయ్యా ?


కథలోకి వెళ్తే…
ఖాటు కుటుంబం తమ పూర్వీకుల మాన్షన్‌ కు, కొంకణ్ ప్రాంతంలోని ఒక పాత వాడాకు వెళ్తుంది. అక్కడ ఒక వృద్ధుడి చావుకు సంబంధించిన ఆచారాలను నిర్వహించడానికి, అలాగే ఆస్తిని అమ్మడానికి తిరిగి వస్తుంది ఈ ఫ్యామిలీ. ఈ మాన్షన్ అనేక తరాల కుటుంబ చరిత్రను కలిగి ఉంటుంది. కానీ దానిలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా, గోన్యా (కిషోర్ కడం) అనే కేర్‌ టేకర్, ఈ కుటుంబం అంతా ఒకే ఇంటిలో ఉండటం పట్ల సంతోషిస్తాడు. కానీ వారి రీఎంట్రీ అసాధారణ సంఘటనలతో భయానకంగా మారుతుంది.

కుటుంబ సభ్యులు ఒక్కొక్కరూ విచిత్రమైన, వివరించలేని పరిస్థితులలో మరణిస్తారు. ఇది ఒక దుష్ట ఆత్మ పని అనుకుంటారు. ఆస్తి వివాదాలు, కుటుంబ సంఘర్షణలు, గతంలోని గాయాలు ఈ భయంకరమైన సంఘటనలకు ఆజ్యం పోస్తాయి. సిరీస్ ఐదవ ఎపిసోడ్ నుండి వేగం పుంజుకుంటుంది. చివరి రెండు ఎపిసోడ్‌లలో ఊహించని ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఈ ఫ్యామిలీని ఆ ఆత్మ ఎందుకు వేటాడుతోంది? అనే అంశాలను తెరపై చూడాల్సిందే.

Related News

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..

OTT Movie : కోట్లాది ప్రజల ప్రాణాలు గాల్లో… సీక్రెట్ ప్లేస్ లో దాక్కొని సినిమా చూసే దిక్కుమాలినోళ్లు… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : బంగారం గొలుసు తీగ లాగితే మర్డర్ డొంక కదిలే… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చావు ఇంట్లో ముసలావిడ చెవిదుద్దులు మిస్సింగ్… కట్ చేస్తే కళ్ళు తిరిగే ట్విస్టు… మస్ట్ వాచ్ తమిళ థ్రిల్లర్

Bakasura Restaurant OTT: నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న బకాసుర రెస్టారెంట్!

Big Stories

×