
Actress Anjali latest photos: తెలుగు అమ్మాయి అయినా తమిళ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంజలి.

షాపింగ్ మాల్ అనే డబ్బిగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత ఆమె నటించిన జర్నీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో నటించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికి అంతగా గుర్తింపు రాలేదు.

దాంతో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ లోను కనిపించింది.

సూర్య నటించిన సింగం 3, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసింది అంజలి.

ఆ తర్వాత మరోమారు “మసాల “సినిమాలో వెంకటేష్ తో జోడీ కట్టింది.

బాలకృష్ణ సరసన డిక్టేటర్ మురిపించింది. బలుపు, గీతాంజలి , శంకరాభరణం, చిత్రాంగద, నిశ్శబ్దం వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమాలో నటించింది అంజలి .ఈ సినిమాలో అంజలి నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఇలా , తెలుగు కన్నడ సినిమాలోనూ నటిస్తుంది.

తాజాగా ఒక ఈవెంట్ లో పింక్ డ్రస్ లో అందంగా కనిపించింది.

ఆ డ్రస్ లో అందరిని అట్రాక్ట్ చేసింది. ఒక్కో ఫోటోకు ఒక్కో రకమైన ఫోజులిచ్చి నెటిజన్లను కట్టిపడేసింది.

అందులో ఆమె చాలా అందంగా .. నవ్వుతూ కనిపించి అభిమానుల హృదయాలను దోచుకున్నది ఆ చిన్నది.