BigTV English

Hanuma Vihari on AP Cricket Association: ఆంధ్రా క్రికెట్‌కు జీవితంలో ఆడను.. రాజకీయ జోక్యంపై విహారి మనస్థాపం

Hanuma Vihari on AP Cricket Association: ఆంధ్రా క్రికెట్‌కు జీవితంలో ఆడను..  రాజకీయ జోక్యంపై విహారి మనస్థాపం
Hanuma Vihari
Hanuma Vihari

Hanuma Vihari Says Good Bye to Andhra Cricket Association: సిడ్నీ టెస్టులో భారత్‌‌ను హీరోగా నిలిచిన హనుమ విహారి ఆంధ్ర రాష్ట్ర క్రికెట్‌ సంఘంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తాను మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ తరఫున క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని కుండ బద్ధలు కొట్టాడు.


ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా విహారి ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఒక ఆటగాడితో గొడవ కారణంగా తనని రాజీనామా చేయవలసిందిగా కోరారు. సదరు ఆటగాడి తండ్రి ఒక ప్రముఖ రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. విహారి తన సహచరుల మద్దతును కలిగిన ఒక లేఖను రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడికి పంపించాడని తెలిపాడు.

“బెంగాల్‌తో జరిగిన మొదటి గేమ్‌లో నేను కెప్టెన్‌గా ఉన్నాను, ఆ గేమ్ సమయంలో నేను 17వ ఆటగాడిపై అరిచాను. అతను తన తండ్రికి (రాజకీయ నాయకుడు) ఫిర్యాదు చేశాడు, అతని తండ్రి నాపై చర్య తీసుకోవాలని అసోసియేషన్‌ను కోరాడు.


Read More: India vs England 4th Test Records: రాంచీ టెస్టు రికార్డులివే..

అయినప్పటికీ, మేము గత ఏడాది ఫైనలిస్టులు బెంగాల్‌పై 410 పరుగులతో ఛేజ్ చేసాము, నా తప్పు లేకుండా కెప్టెన్సీకి రాజీనామా చేయమని నన్ను అడిగారు. నేను ప్లేయర్‌తో వ్యక్తిగత గొడవల గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. కానీ గత ఏడాది ఎడమ చేతితో బ్యాటింగ్ చేసి, గత 7 సంవత్సరాలలో 5 సార్లు ఆంధ్రను నాకౌట్ దశకు తీసుకువెళ్లిన ఆటగాడికంటే, ఇండియా తరఫున 16 టెస్టులు ఆడిన ఆటగాడికంటే అతనే ముఖ్యం అని భావించి నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించింది.” అని విహారి ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

కాగా విహారి ఆంధ్ర తరఫున 37 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు.

Hanuma Vihari
Hanuma Vihari

Related News

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Big Stories

×