Big Stories

IND vs ENG 4th Test Records: రాంచీ టెస్టు రికార్డులివే..!

India vs England 4th Test Records
India vs England 4th Test Records

India vs England 4th Test Records: ఇంగ్లాండ్‌తో రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయ ఢంకా మోగించింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ జట్టుపై విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓవర్ నైట్ స్కోర్ 40/0 తో నాలుగో రోజు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. కాగా స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో భారత అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ గిల్, జురెల్ లాంఛనాన్ని పూర్తి చేశారు.

- Advertisement -

ఈ విజయంతో డబ్లూటీసీ(WTC) పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 64.58 విజయాల శాతంతో టీమిండియా సెకెండ్ ప్లేస్‌లో ఉండగా 75 శాతంతో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇండియా తర్వాత ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వరుస స్థానాల్లో నిలిచాయి. కాగా ఇంగ్లాండ్ జట్టు 19.44 విజయ శాతంతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

- Advertisement -

రాంచీ టెస్టు రికార్డులివే..

  • 0-1 తేడాతో వెనుకబడి సిరీస్‌ను గెల్చుకోవడం ఇండియాకు ఇది ఏడోసారి. మొత్తంగా ఇంగ్లాండ్‌పై మూడో సిరీస్.
  • టీమిండియా వరుసగా 17 సిరీస్‌లను సొంతం చేసుకుంది.

Read More: రాంచీ టెస్ట్ లో టీమిండియా విజయం .. సిరీస్ కైవసం..

  • అత్యధిక 5 వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్లలో కుంబ్లే రికార్డును సమం చేసిన అశ్విన్ ( 35 సార్లు)
  • ఇండియాలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కుంబ్లే (350)రికార్డును అధిగమించిన అశ్విన్(354)
  • 200 కంటే తక్కువ టార్గెట్‌ను ఛేదించడం ఇండియాకు ఇది 30వ సారి. మొత్తం 33 మ్యాచుల్లో 3 డ్రా కాగా, ఒకదాంట్లో టీమిండియా ఓటమి చవిచూసింది.
  • బెన్ స్టోక్స్-మెక్‌కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లాండ్ తొలిసారి సిరీస్‌ను కోల్పోయింది.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News