Taapsee Pannu Latest photos: తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు బాలీవుడ్ లో లేడి ఓరియెంటెడ్ సినిమాలకు కెరాఫ్ అడ్రస్ గా మారింది తాప్సి సినిమాల కంటే ముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసింది. ఆ తర్వాత మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించింది. మోడలింగ్ చేస్తూనే రిలయన్స్ ట్రెండ్స్, రెడ్ఎప్ఎం, కోకాకోలా వంటి వాణిజ్య ప్రకటనలో నటించింది ఈ ముద్దుగుమ్మ. "ఝుమ్మంది నాదం" సినిమాతో హీరోయిన్ గా సినీరంగం ప్రవేశం చేసింది. తెలుగులో వస్తాడు నారాజు, మిష్టర్ పర్ఫెక్ట్, వీర, సాహసం , దొంగాట తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత "చష్మి బద్దూర్" సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. "బేబి పింక్" చిత్రాలతో బాలీవుడ్ స్టార్ నటిగా మంచి గుర్తింపు పొందింది. అత్యధిక పారితోషకం తీసుకునే బాలీవుడ్ నటీనటుల్లో తాప్సీ ఒకరు. ఈ అమ్మడు ప్రస్తుతం నటిగా, వ్యాపారవేత్తగా రాణిస్తుంది. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్, శభాస్ మిథు, డంకీ సినిమాలో అలరించింది. ప్రస్తుతం తాప్సీ పెళ్లి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో తాప్సి మొట్ట మొదటి సారిగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "చీరతో రొమాన్స్ ఎప్పటికీ తనివి తీరదు" అని అర్ధం వచ్చేలాగా ఆ ఫోటోలకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోలలో చీర మీద బ్లాక్ కలర్ సూట్ వేసుకుని హొయలు పోతూ కనిపించింది. [gallery td_select_gallery_slide="slide" ids="161421,161422,161424,161420,161419,161417,161411,161410,161413,161415,161408,161409,161407"]