Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో భాగంగా ఇప్పటికే లీగ్ దశ మ్యాచ్ లు ముగిసిపోయాయి. లీగ్ దశలో టీమిండియా 3 మూడు మ్యాచ్ లు ఆడింది. అయితే వాటిలో టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ శుబ్ మన్ గిల్ మాత్రం బ్యాటింగ్ లో విఫలం చెందాడనే చెప్పాలి. ముఖ్యంగా శుబ్ మన్ గిల్ యూఏఈతో 9 బంతుల్లో 20, పాకిస్తాన్ తో 7 బంతుల్లో 10, ఒమన్ తో మాత్రం 8 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పాటు ఒమన్ బౌలర్ షా ఫైసల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు గిల్. దీంతో నెటిజన్లు గిల్ పై ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఆసియా కప్ 2025 నుంచి శుభ్ మన్ గిల్ ను తొలగించాలని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఓపెనర్ గా శుబ్ మన్ గిల్ కంటే సంజు శాంసన్ పంపించడం బెటర్ అని కొందరూ కామెంట్స్ చేయడం విశేషం.
Also Read : Ind vs aus : కొత్త జెర్సీలో టీమిండియా..రెచ్చిపోయిన ఆసీస్.. తొలిసారిగా 400పైగా స్కోర్
వాస్తవానికి శుబ్ మన్ గిల్ ను టెస్టులకు కెప్టెన్సీ చేయగానే.. ఇంగ్లాండ్ తో భారత జట్టు అద్భుతంగా రాణించింది. వెంటనే ఆసియా కప్ 2025 టీ 20 జట్టులో చోటు కల్పించడంతో పాటు ఏకంగా వైస్ కెప్టెన్ పదవీ కూడా కట్టబెట్టారు. వాస్తవానికి అద్భుతమైన ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ని అస్సలు పట్టించుకోలేదు. మరోవైపు బౌలింగ్ లో కూడా హర్షిత్ రాణాని సెలెక్ట్ చేశారు.కానీ టీమిండియా కీలక బౌలర్ మహ్మద్ సిరాజ్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో ఇంకా ఇప్పటికీ అర్థం కావడం లేదని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు. అసలు శుభ్ మన్ గిల్ ఫామ్ లో లేకున్నా ఎందుకు ఆడిస్తున్నారు. అతని ప్లేస్ లో రింకూ సింగ్ లేదా జితేశ్ శర్మను తీసుకోవడం బెటర్ అంటూ సూచిస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పటి వరు జరిగిన మ్యాచ్ లు లీగ్ దశలో కాబట్టి పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ తరువాత సూపర్ 4 మ్యాచ్ ల్లో కూడా ఇలాగే గిల్ వ్యవహరిస్తే.. ఫైనల్ మ్యాచ్ లో తీసేయకుంటే టీమిండియా ఆసియా కప్ 2025లో విజయం సాధించదు అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంటున్నారు.
అసలు శుభ్ మన్ గిల్ ఫామ్ లో లేకున్నా ఎందుకు ఆడిస్తున్నారు. అతని ప్లేస్ లో రింకూ సింగ్ లేదా జితేశ్ శర్మను తీసుకోవడం బెటర్ అంటూ సూచిస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో అయితే శుబ్ మన్ గిల్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు ఫ్యాన్స్. ఆసియా కప్ 2025లో సూపర్ 4 తొలి మ్యాచ్ తలపడేది పాకిస్తాన్ జట్టుతో అయితే అటు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో కూడా టీమిండియా బలంగా ఉండాలని భావిస్తోంది. ఒమన్ తో మ్యాచ్ కాబట్టి నామమాత్రంగా ఆడారు. ఒమన్ మ్యాచ్ లో అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు చోటు కల్పించారు. కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ కి మాత్రం లీగ్ దశలో పాకిస్తాన్ తో ఆడిన జట్టుతోనే ఆడనున్నట్టు తెలుస్తోంది. లేదంటే బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్ కి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ చాలా ఇబ్బంది పడింది. ఒమన్ మ్యాచ్ గెలవకున్నప్పటికీ.. అభిమానుల మనస్సు గెలిచింది. టీమిండియాకి గట్టి పోటీని ఇచ్చింది. ఇక మరీ సెప్టెంబర్ 21న జరిగే పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ ఫలితం ఏవిధంగా ఉంటుందో వేచి చూడాలి మరీ.