Laxmi rai: శాండిల్‌వుడ్ బ్యూటీ లక్ష్మీరాయ్ తెగ హంగామా చేస్తోంది. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలుగా గడుస్తున్నా.. తానింతా యంగ్ బ్యూటీ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది.
Laxmirai hungamaతెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అప్పుడప్పుడు బాలీవుడ్‌లో స్పెషల్‌గా కనిపిస్తోంది.
ఏమైందో తెలీదుగానీ రెండేళ్లగా సౌత్ ఇండస్ట్రీలో ఒక్క ప్రాజెక్టు చేయలేదు. కాకపోతే నిత్యం సోషల్‌మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
రకరకాల ఫోటోషూట్లు చేస్తూ, ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతోంది. ఆ మధ్య లక్ష్మిరాయ్ అలియాస్ రాయ్‌లక్ష్మీ ఫారెన్ టూరేసింది.
ఆ సమయంలో ఫెరారీ కారుపై రకరకాల ఫోజులిచ్చింది. ఇప్పడు ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.
ఇంతకీ ఫారెన్ టూర్ విశేషాలేంటి? అక్కడే రాయ్ సెటిలైపోయిందా? అంటూ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు.
కాకపోతే ఈ అమ్మడి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఆ సమయం ఎప్పుడంటూ మరికొందరు రైజ్ చేస్తున్నారు. అదేనండి మ్యారేజ్ వ్యవహారం.. వీటన్నింటికీ ఆమె సైలెంట్‌గా ఉంటోంది.