Radhika Sarathkumar allegation against actor kamal haasan: ప్రస్తుతం హేమ కమిటీ రిపోర్టు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యావత్ దేశ ప్రజలు విస్తుపోయేలా ఈ రిపోర్టు ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. ఈ రిపోర్టు ప్రకారం.. మలయాళ ఇండస్ట్రీలోని కొందరు డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు సహా ఇంకెందరో మహిళా నటీమణులను, హీరోయిన్లను లైంగికంగా వేధించినట్లు తేలింది. అయితే మరి ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ నోరుమెదపకపోవడం ఏంటని పలువురు ఆశ్యర్యపోతున్నారు. అయితే ఈ లైంగిక వేధింపులపై కొందరు అప్పట్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇంకొందరు మాత్రం అవకాశాలు రావని.. చెప్తే వాళ్ల పేరు ఎక్కడ పోతుందో అని బిక్కు బిక్కుమంటూ బతికేవారు.
అయితే ఈ హేమ కమిటీ రిపోర్ట్ చూసి కేరళ ప్రభుత్వం షాక్‌కు గురైంది. దీంతో వెంటనే సిట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ కోసం ఆదేశించడంతో నటీమణులు ఒక్కొక్కరిగా ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వస్తున్నారు. తమ సినీ కెరీర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను బయటకొచ్చి చెప్పుకుంటున్నారు. తమకు ఇష్టం లేకున్నా కొన్ని సమయాల్లో సినిమాల్లో నటించాల్సి వచ్చిందని నిర్ముహమాటంగా చెప్తున్నారు. అంతేకాదు తమను లైంగికంగా వేధించిన వారి పేర్లు సైతం బయటపెట్టేందుకు వెనుకాడటం లేదు.
అందులో ఇప్పటికే ఎంతో మంది నటీమణులు బయటకొచ్చి తమ గోడును విలపించుకున్నారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్. ఆమె ప్రతి ఇండస్ట్రీలోనూ నటించింది. కోలీవుడ్, టాలీవుడ్ సహా మిగతా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అందువల్ల ఆమెకు ప్రతి ఇండస్ట్రీలోనూ ఏం జరుగుతుందో తెలుస్తుంది.
Also Read: హేమ కమిటీ రిపోర్ట్‌పై రజినీకాంత్ వ్యాఖ్యలకు.. స్పందించిన రాధిక శరత్ కుమార్
ఇందులో భాగంగానే ఇటీవల ఆమె చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాను కేరళలో ఓ సినిమా షూటింగ్‌కి వెళ్లి తిరిగి షూటింగ్ ముగించుకుని కారవాన్‌లోకి వెళ్తున్న క్రమంలో సెట్ వద్ద కొందరు యువకులు కూర్చుని మొబైల్‌లో ఏదో వీడియో చూస్తూ నవ్వుకుంటున్నారని.. అది చూసి వెంటనే తాను ఓ వ్యక్తికి పిలిచి ఏమైందో అడిగి తెలుసుకోగా అతడు చెప్పే సమాధానం తనను ఆవేదనకు గురిచేసిందని అన్నారు. కారవాన్‌లో కొందరు సిసి కెమెరాలు పెట్టి మహిళలు రహస్యంగా బట్టలు మార్చుకుంటున్న వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారని అతడు చెప్పడంతో ఆమె షాక్‌కి గురైనట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టింది. ఇప్పుడు రాధికకు సంబంధించిన మరికొన్ని కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఆమె చేసిన కొన్ని కామెట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ స్టార్ హీరో తనను, తన కోడలిని ముద్దుల సన్నివేశాల్లో నటించమని చాలా ఇబ్బందులు పెట్టాడని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆయన మరెవరో కాదని.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అని అన్నారు. అప్పుడు కమల్ హాసన్‌పై రాధిక చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. సాధారణంగా కమల్ హాసన్ సినిమాల్లో ముద్దుసీన్లు ఉంటాయి. ఒకప్పుడు కచ్చితంగా కమల్ సినిమాల్లో ముద్దు సీన్లు ఉండాలని రూల్ ఉండేది.
అయితే కొందరు ఇష్టంతో నటిస్తారు. మరికొందరు ఇష్టంలేక సినిమాల్లో నటించడం మానేస్తారు. అలాంటిదే తనకు ఎదురైందని తెలిపారు. ముద్దుల సీన్లలో నటించడానికి ఇష్టం లేకపోవడం వల్లనే సిప్పీండీ ముత్ సినిమా తర్వాత కమల్‌తో మరి సినిమాల్లో నటించడం మానేశానని రాధిక చెప్పుకొచ్చారు. అతడు ముద్దు సీన్లలో పెదాలను నొక్కి ముద్దులు పెట్టేవాడని.. తననే కాదు, తన కోడలిని సైతం ఇలానే హింసించాడని చెప్పారు. అయితే దానిని తాను తప్పుబట్టినపుడు సినిమా అవకాశాలు చేజారిపోయాయని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.