E-Paper
Advertisement

కేటీఆర్‌కు క‌లిసొచ్చే కాలం.. పెండింగ్ ప‌థ‌కాల‌న్నీ అమ‌లు చేసేయొచ్చు.. తెలంగాణ భ‌వ‌న్ నుంచి!

కేటీఆర్‌కు క‌లిసొచ్చే కాలం.. పెండింగ్ ప‌థ‌కాల‌న్నీ అమ‌లు చేసేయొచ్చు.. తెలంగాణ భ‌వ‌న్ నుంచి!
Advertisement

కేటీఆర్ ఎదురుచూస్తున్న మంచి రోజులు వ‌స్తున్న‌ట్టే ఉన్నాయి. మెల్ల‌గా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతూ వ‌స్తోంది. దానికి త‌గ్గ‌ట్టు ప‌రిస్థితులు ప్ర‌భుత్వానికి ప్ర‌తికూలంగా.. కేటీఆర్‌కు అనుకూలంగా మారుతున్న‌ట్టే క‌నిపిస్తున్నాయి. నిన్న‌నే కేటీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్ల‌లో కంటి వెలుగు ప‌థ‌కాన్ని అమ‌లు చేశాడు. త‌న సొంత ఖ‌ర్చుల‌తో.. త్వ‌ర‌లో దీన్ని ఆ జిల్లా మొత్తానికి విస్త‌రింప‌జేస్తాన‌న్నాడు. మంచి నిర్ణ‌యం. రేవంత్ స‌ర్కార్ దీన్ని ఆపేసింది. ఇలా చాలా ప‌థ‌కాలే కొన‌సాగ‌డం లేదు.

కంటి వెలుగు స్టార్ట్ చేశాడో లేదో.. అదే రోజు కోర్టు నుంచి కేటీఆర్‌కు ఖుష్ క‌బ‌ర్ వ‌చ్చింది. క‌ళ్యాణ‌ల‌క్ష్మీని నిలిపివేయండ‌ని. కోర్టు అలా స్టే విధించ‌డానికి కార‌ణం.. కేసీఆర్ స‌ర్కార్ నిర్ణ‌య‌మే. జీవోల రూపంలో దీనికి క్లియ‌రెన్స్ ఇచ్చి.. చ‌ట్ట‌బ‌ద్ద‌త లేదు అన‌డానికి ఆస్కార‌మివ్వ‌డం మూలంగానే కోర్టు ఆ విధంగా నిర్ణ‌యం తీసుకున్న‌ది. రేవంత్ స‌ర్కార్ కూడా దీనిపై ఉదాసీనంగా ఉంది. ఆపేస్తేనే మాకింత భారం త‌గ్గుంద‌నే భావ‌న కూడా కావొచ్చు. ఇది మా ప‌థ‌కం కాదు క‌దా.. అనే ఫీలింగూ ఉండి ఉండ‌వ‌చ్చు.

Advertisement

కానీ ఇది బీఆరెస్‌కు క‌లిసి వ‌చ్చే అంశ‌మే. ఎందుకంటే క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ ప‌థ‌కాన్ని కూడా ఏ సిరిసిల్ల నుంచో.. గ‌జ్వేల్‌, మెద‌క్‌ల నుంచో స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ల‌బ్దిదారులు .. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. స‌చివాల‌యంలా తెలంగాణ భ‌వ‌న్‌ను ఉప‌యోగించుకుంటే స‌రి. అంటే అది ఇక‌పై తెలంగాణ భ‌వ‌న్ కాదు.. జ‌న‌తా గ్యారేజ్‌లా అది బీఆరెస్ గ్యారేజ్ అన్న‌మాట‌. అధికారంలోకి రాగానే ప్ర‌భుత్వ‌మే ఈ ప‌థ‌కాల భారం ఎలాగూ మోస్తుంది క‌దా..! అప్ప‌టి దాకా మీ పార్టీ ఫండ్ నుంచి వీటికి నిధులు కేటాయించాలి అంతే. పెద్ద క‌ష్ట‌మైన పనేం కాదు. 1400 కోట్లంటే మాట‌లు కాదు.. కంటి వెలుగుతో పాటు క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్‌, కేసీఆర్ కిట్‌, 4వేల పింఛ‌న్‌, స్కూటీలు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు 2500, అవును మ‌రిచిపోయా… క‌ళ్యాణ‌ల‌క్ష్మీతో పాటు తులం బంగారం.. ఇవ‌న్నీ అమ‌లు చేయొచ్చు.

మొద‌ట ఓ నియోజ‌క‌వ‌ర్గంలో ఫైల‌ట్ ప్రాజెక్టుగా ప్రారంభించి.. ఆ త‌రువాత జిల్లా మొత్తంగా విస్త‌రించాలి. ఐడియా భ‌లే ఉంది క‌దా! మీ స‌ర్కార్ రాగానే నాకు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇవ్వాలి మ‌రి. ఇలాంటి బోలెడు ఐడియాలు మీకిచ్చి మిమ్మ‌ల్ని ఎక్క‌డికో తీసుకెళ్లే బాధ్య‌త నాది. న‌మ్మండి! క‌విత కూడా ఇక ఈ పార్టీ ఫండ్ ముచ్చ‌ట మ‌రోసారి తీసుకు రాకుండా ఉంటుంది. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌మాట‌.

Advertisement

ప్ర‌భుత్వం చేయ‌లేని ప‌ని మేం అధికారంలో లేకున్నా చేసి చూపిస్తున్నాం తెలుసా..? మా పాత ప‌థ‌కాలే కాదు.. వారిచ్చిన హామీలు కూడా ఎలా నేర‌వేరుస్తున్నామో చూశారా? మా స్టామినా అదీ… ! ఇదంతా ఎవ‌రి కోసం.. మీ కోసం కాదా? తెలంగాణ ప్ర‌జ‌లంటే మాకు అంత ప్రేమ‌.. ! అని చెప్పొచ్చు. అందుకే మా సొంత సొమ్మును ఇలా.. వ‌ద్దులే ఈ మాట‌న‌కండి.. ఎందుకంటే.. అది మీ సొంత సొమ్ము కాదు క‌దా. అంతా ఇక్క‌డి జ‌నం సొమ్మే కాబ‌ట్టి.. వారికే పంచి ఇచ్చిన‌ట్ట‌వుతుంది. కానీ ప్ర‌జ‌లు మాత్రం మిమ్మ‌ల్ని మ‌రిచిపోరు ఇలా చేస్తే.

ఏ ఎన్నిక‌లు రాని మీ పార్టీకే గుద్దుత‌రు. అంతే మీరు గ‌ద్దెమీదొచ్చి ప‌డ‌త‌రు. ఇది నా గ్యారెంటీ. గ్యారెంటీ అంటే గుర్తొచ్చింది. మీవి ఆరు గ్యారెంటీల‌ ప‌థ‌కాలు.. మావి ప‌క్కా గ్యారెంటీ ప‌థ‌కాలు అని కూడా ఎన్నిక‌ల నినాదంగా మనం ముందుకు పోవ‌చ్చు. అందుకే అంటారు క‌లిసొచ్చే కాలానికి న‌డిచొచ్చే కొడ‌క‌ని. మ‌న ద‌గ్గ‌ర అన్నీ ఉన్నాయి.. ఒక్క అధికారం త‌ప్ప‌. ఆ అధికారం మ‌ళ్లీ మ‌న చేతుల్లోకి రావ‌డానికి సంపాదించిన కొంత సొమ్ము ఇలా ఖ‌ర్చు పడితే రెండు విధాల లాభం.. అధికారానికి అది చేరువ చేసే మంత్రంగా ప‌నిచేస్తుంది. కాదంటావా?

Tags

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

రాముడి యుగం నాటి దివ్య వృక్షం.. విజయవాడలో ప్రత్యక్షం!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

ఆయన వేలు పెడితే నాకు టికెట్ ఖాయం.. కిషన్ రెడ్డి మద్దతు ఎవరికో తెలుసా?

ఆ శాఖలోకి మీడియాకు నో ఎంట్రీ.. తెరవెనుక ఏం జరుగుతోంది?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

మెట్రో పిల్లర్ల కేసులో అసలు కథ ఇదేనా? బెయిల్ కోసం సెక్షన్లు తగ్గించేశారా?

కేంద్రం నిర్ణయాలతో ధరల సూచి హైక్.. ధరల మంటతో సామాన్యుడి విల విల!

Big Stories

Advertisement
×