E-Paper
Advertisement

మోసం చేయ‌లేదు.. కానీ మోసపోయా! మోసం ఎందుకు చేశానంటే..? పార్టీ మార‌లేదు. కానీ పార్టీ ఎందుకు మారానంటే..?

మోసం చేయ‌లేదు.. కానీ మోసపోయా! మోసం ఎందుకు చేశానంటే..? పార్టీ మార‌లేదు. కానీ పార్టీ ఎందుకు మారానంటే..?
Advertisement

పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి తాజాగా మాట్లాడిన మాట‌లు వింటే జాలేసింది. సానుభూతీ క‌లిగింది. పాపం ఈ వ‌య‌సులో ఎంత‌టి దౌర్బాగ్య స్థితి వ‌చ్చింది? ఎందుకు చేశాడిదంతా? అంటే కొడుకు కోస‌మ‌ని అర్థ‌మ‌వుతూనే ఉంది. కొంద‌రికి అంతే. స‌న్ స్ట్రోక్ దెబ్బ‌కు మెద‌డు స‌రిగా ప‌నిచేయదు. ఏం మాట్లాడుతున్నామో తెలియ‌దు. అచ్చం అట్ల‌నే ఉంది పోచారం ప‌రిస్థితి.

తాను పార్టీ మార‌లేదంటాడు. అమ్ముడుపోలేదంటాడు. నేనేమ‌న్నా పిచ్చోన్నా.. అన్నం పెట్టినోడిని మోసం చేస్తానా? అని ద‌బాయిస్తాడు. కానీ కేసీఆర్‌ను మోసం చేయాల్సి వ‌చ్చింద‌ని ఉన్నవిష‌యం చెప్పేస్తాడు. ఎందుకు మోసం చేయాల్సి వ‌చ్చిందో తెలుసా? మీ కోస‌మే అని కార్య‌క‌ర్త‌ల్ని, అక్క‌డి ప్ర‌జ‌ల‌ను కూడా అందులోకి లాగి త‌న నిర్ణ‌యాన్ని తానే స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు.

Advertisement

పార్టీ మారినా ఏం సుఖం ఉంది? రావాల్సిన డ‌బ్బులు రాలేదు. ఇస్తామ‌న్న నిధులు ఇవ్వ‌లేదు. చెప్పిన ప‌నుల‌న్నీ కాలేదు. అని అన్న వెంట‌నే నేనేమ‌న్నా అమ్ముడుపోయానా? చెప్పు రేవంత్ నా ఎమ్మెల్యేగిరీని నువ్వు కొన్నావా? పార్టీ మారినందుకు నాకేమ‌న్నా పైస‌లిచ్చిన‌వా? అని నిల‌దీసిన విష‌యాన్ని డేర్‌గా ఓపెన్‌గా తెగేసి చెప్పేశాడు.

ఇంకా న‌యం జాతీయ జెండా క‌ప్పుకున్న‌.. కాంగ్రెస్ జెండా క‌ప్పుకోలేద‌ని త‌న తెలివికి తానే శెభాష్ అని భుజాలు చ‌రుచుకున్నాడు. అదేందీ.. పార్టీ మారిన అంటాడు.. పార్టీ కండువా క‌ప్పుకోలేదు కాబ‌ట్టి నేను కాంగ్రెస్ లీడ‌ర్‌ను కాదు అంటాడు. అమ్ముడుపోలేదంటాడు.. పార్టీలో చేరిన త‌రువాత నాకిస్తాన‌న్న నిధులు విడుద‌ల చేయ‌లేదంటాడు…? పెద్దాయ‌న మాట‌లు అర్థం కాలేదు అక్క‌డున్న‌వారికి.

Advertisement

బాధ‌లో మాట్లాడుతున్నా .. నిజాలే మాట్లాడుతున్నాడ‌నిపించింది. అన్ని నిజాలే. కానీ అంతిమంగా అందులో త‌న త‌ప్పేమీ లేద‌నే విష‌యాన్ని మాత్రం గ్ర‌హించాల‌నేదే ఆయ‌న తప‌న‌లా క‌నిపించింది. ఓ డెబ్బై కోట్లిచ్చాడు. మ‌రో న‌ల‌భై కోట్లిచ్చాడు.. అంతే.. మ‌ళ్లీ ఏమీ లేవు. అన్నీ బంద్‌..అని త‌ను ఎంత కోరాను.. వారెంతిచ్చారు..? ఇదేనా ఇద్ద‌రి మ‌ధ్య డీల్‌.. అన్న‌ట్టుగా ఓపెన్‌గా త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన అమౌంట్ గురించి కూడా చెప్పేశాడు.

నేన‌మ‌న్నా మంత్రి ప‌ద‌వి అడిగిన్నా.. అన్నీ చేసినా.. స్పీక‌ర్‌గా చేసినోడికి వేరే ప‌ద‌వులు ఓ లెక్కా? అని ప‌ద‌వుల మీద ఆశే లేద‌న్న‌ట్టుగా న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసినా ఎవ‌రూ న‌మ్మ‌లేదు. కొంద‌రు బేకార్ గాళ్ల వ‌ల్ల పార్టీ మారాల్సి వ‌చ్చింద‌ని చివ‌ర‌గా అన్నాడు. అంటే ప్ర‌జ‌ల కోసం కాదా? నియోజ‌క‌వ‌ర్గం కోసం కాదా? నిధుల కోసం కాదా? కొడుకు కోసం కాదా? స‌రే బై.. వీరంద‌రి కోస‌మే అనుకో.. కానీ ఏం లాభం కులం చెడ్డా సుఖం ద‌క్క‌లేదు క‌దా! అదే పోచారం బాధ‌.

మ‌రి ఇప్పుడు మ‌నం ఏ పార్టీనే కాక‌… అన్నాడు ప‌క్క‌నున్నోడు.. అన్నం పెట్టిన పార్టీనా? మ‌న‌కు సున్నం పెట్టిన పార్టీనా? మ‌నం సున్నం పెట్టిన పార్టీనా? కోపంగా చూశాడు పెద్దాయ‌న‌. అంత ఓపిక లేక‌పోతే ఎట్ల‌రా..? వ‌య‌స్సు మీద ప‌డ్డ‌ది.. అంత తొంద‌ర‌పాటు ప‌నికిరాదు.. అని క‌స్సున లేచాడాయ‌న‌.

Tags

Related News

ఒకే ఫార్ములా.. ఇద్దరు నేతలు.. ఒకరిది జైలు, ఇంకొకరిది సెటిల్‌మెంట్!

క్యాంప్ రాజకీయాకి చెక్.. చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకుంటే?

జగన్ మాస్టర్ ప్లాన్.. అసెంబ్లీకి వస్తారా..?

అమ్మాయిల దుస్తులపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..!

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా లేనట్టేనా..?

డాక్టర్ కాదు.. యమధర్మరాజు! RMPల క్లినిక్‌లకు వెళ్తే ప్రాణాలు గోవిందా?

‘ఆమె’ కోసమే పాత నోటిఫికేషన్ రద్దు చేశారా..? తెలంగాణ వికలాంగుల శాఖలో సంచలనం!

Big Stories

Advertisement
×