E-Paper
Advertisement

స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!

స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!
Advertisement

Pakistan Fuel Hike: పాకిస్థాన్ తన 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. అక్కడి ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (OGRA) సిఫార్సుల మేరకు సవరించిన ఈ కొత్త ధరలు ఆగస్టు 14 నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో స్వాతంత్రం రోజు కూడా ఈ ధరల బాదుడు ఏంటని పాక్ ప్రజలు వాపోతున్నారు.

ఎంత పెరిగాయంటే?

పాక్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధరపై 45 పైసలు పెరిగింది. దీంతో నిన్నటి వరకు రూ. 324.98గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 325.43కి చేరింది. అటు హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు రూ. 1.16 పెరగ్గా.. ధర రూ. 382.79 నుండి రూ. 383.95కి ఎగబాకింది.

కొత్త విధానం అమలు

Advertisement

భారత్ తరహాలో పాక్ సైతం ఇటీవల రోజువారీ ఇంధన ధరల నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగానే తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గుల కారణంగా గత జులై నుంచి రోజూవారీ ప్రాతిపదికన ధరలను పాక్ సవరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గత 7 రోజుల సగటు ఆధారంగానే దేశీయంగా ప్రతిరోజూ ధరలను మారుస్తున్నామని ఆ దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ పేర్కొన్నారు.

సామాన్యుడిపై మరింత భారం

ఈసారి పెరిగిన ధరలు స్వల్పంగానే ఉన్నప్పటికీ ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇది మరింత భారాన్ని మోపనుంది. పెట్రోల్ ధర పెంపుతో పాక్ లోని ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. మరోవైపు డీజిల్ ధరలు పెరగడం వల్ల సరుకు రవాణా వ్యయం పెరిగి నిత్యావసరాల ధరలు మరింత మండే ప్రమాదం ఉంది.

Advertisement

Also Read: సావర్కర్ వివాదంలో ట్విస్ట్.. సుప్రీంకోర్టులో కేసు క్లోజ్.. రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్!

అంతర్జాతీయ ప్రభావం

ఈ ఏడాది పాక్ లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఒక దశలో లీటర్ పెట్రోల్ ధర రూ. 458, డీజిల్ ధర రూ. 520 దాటిపోయాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 100కి పైగా పన్నులు వసూలు చేస్తుండటంతో ఇంధన ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి.

Also Read: ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?

Tags

Related News

పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన.. బలూచ్ మహిళా కమాండోలు.. ఫస్ట్ అటాక్‌లోనే 9 మంది మృతి!

ఖమేనీ అంతం తర్వాత కూడా లొంగని ఇరాన్.. ట్రంప్ వేసిన ప్లాన్ ఎక్కడ తప్పింది?

వరద గుప్పిట్లో బ్యాంకాక్ సిటీ.. 48 గంటల్లో 300 మి.మీ. వర్షం, విమానాల గురించి..

రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?

నేపాల్‌కు పొంచివున్న ముప్పు.. హిమాల్ శిఖరంపై భారీ హిమపాతం, 10 మంది మిస్సింగ్

లాడెన్ ఎక్కడ దొరికాడో మర్చిపోయావా? ఐరాసలో పాక్ ప్రధానికి ఇచ్చిపడేసిన భారత్!

DR కాంగోలో ఘోర ప్రమాదం.. ఆర్మీ విమానం ధ్వంసం… 14 మంది సజీవ దహనం!

ఇరాన్‌కు బిగ్ షాక్.. ‘సీజ్‌ఫైర్’ రిక్వెస్ట్‌కు ట్రంప్ నో.. భారీ అటాక్‌కు స్కెచ్!

Big Stories

Advertisement
×