E-Paper
Advertisement

అయ్య జాగీరే! రెచ్చ‌గొట్టి.. చిచ్చుపెట్టి..! తెలంగాణ బీజేపికి కొత్త చిక్కు తెచ్చిపెట్టి!

అయ్య జాగీరే! రెచ్చ‌గొట్టి.. చిచ్చుపెట్టి..! తెలంగాణ బీజేపికి కొత్త చిక్కు తెచ్చిపెట్టి!
Advertisement

హ‌నుమంతుడిని చేయ‌బోతే కోతైందంట‌! అచ్చం అట్ల‌నే ఉంది ప‌వ‌న్ క‌ళ్యాన్ తెలంగాణ ఎంట్రీ. ప‌వ‌న్‌కు మోడీ తెలంగాణ మంత్ర‌మేదో చెవిలో ఊది చెప్పాడు. బాబుగారు ఏదో ప్లాన్ వేసే ఉంటారు. అంతా క‌లిసి తెలంగాణ బీజేపీకి జాకీలు పెట్టైనా స‌రే లేపుదామ‌ని అనుకున్నారు. తెర వెనుక అంతా ప్రీ ప్లాన్డ్‌గానే ఉన్నారు. మొన్న మొన్న‌నే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద్రారావు కూడా అన్నారు. మేము ఒంట‌రిగానే పోటీ చేస్తాం.. కానీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్‌, చంద్ర‌బాబులు వ‌స్తే వారి సేవ‌లు వినియోగించుకుంటాం.. అని!

దీనిర్థం ఏంటీ? హైద‌రాబాద్‌లో ఉండే సెటిల‌ర్ల ఓట్ల‌తో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో కొంత బ‌ల‌ప‌డాల‌ని. కొన్ని సీట్లు ద‌క్కించుకోవాలని. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి హైద‌రాబాద్‌, దాని చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏమైనా చాన్స్ ఉంటే సీట్లు కైవ‌సం చేసుకునే ప్లాను..! ఇదీ ఓ ప్రాసెస్ ప్ర‌కారం న‌డిపించాల‌నుకున్నారు. ఇక్క‌డ ప‌వ‌న్ రావ‌డం రావ‌డ‌మే ఎంట్రీ సీన్ అట్ట‌ర్ ఫ్లాపై కూర్చుంది. ఎంతో మెచ్యూరిటీగా మాట్లాడుతాడ‌నుకుంటే.. మీ అయ్యా జాగీరా!అని త‌న స‌హ‌జ శైలిలో కంట్రోల్ త‌ప్పాడు. ఇదే అద‌నుగా ఈ వ్యాఖ్య‌ల‌ను తీసుకుని .. కౌంట‌ర్ల మీద కౌంట‌ర్లిస్తున్నారు.. కాంగ్రెస్ నేత‌లు. తెలంగాణ వాదులు. ఇది బ‌రాబ‌ర్ మా అయ్యా జాగీరే అంటున్నారు.

Advertisement

అంటే.. ప‌వ‌న్ అన్న ఆ కామెంట్ బూమ‌రాంగైంద‌న్న మాట‌. ఎంత‌గా త‌న‌కు తెలంగాణ మీద ప్రేమ ఉంద‌ని చెప్పుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసినా .. మ‌ధ్య‌లో గ‌ద్ద‌ర్ ఎపిసోడ్‌ను వాడుకునైనా త‌న వ్య‌క్తిత్వన్ని పెంచుకుని..అంద‌రికీ చాటి చెప్పాల‌ని చూసినా.. ఈ ఒక్క మాట‌.. ఇది మీ అయ్యా జాగీరా! అనేదే మొత్తం ప్లానింగ్ బెడిసి కొట్టేలా చేసింది. వాస్త‌వానికి, ప‌వ‌న్ వ‌చ్చింది జ‌న‌సేన నుంచైనా.. లోప‌ల బీజేపీ కోటు వేసుకుని ఉన్నాడు. అది బ‌య‌ట‌కు క‌నిపించ‌దు ఇప్పుడు. రేపు రేపు బాబు కూడా వ‌స్తాడు. అత‌నూ బీజేపీనే లేపుతాడు. బీజేపీ వీరిని ఎంత‌లా ఉప‌యోగించుకోవాలో అంత‌గా ఉప‌యోగించుకుంటుంది. చివ‌ర‌కు మొన్న త‌మిళ‌నాడులో చంద్ర‌బాబుతో ప్ర‌చారం చేయించుకున్నారు మోడీ, అమిత్ షాలు.

ఎంతైతే అంత లాభం.. ! అనే దానికి క‌ట్టుబ‌డి ఉన్నారిద్ద‌రు. అందుకే వీరిద్ద‌రినీ ఇక్క‌డ హైద‌రాబాద్ రాజ‌కీయాల కోసం వాడుకోవ‌డం ప‌క్కా అనే ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. కానీ ప‌వ‌న్ మాట్లాడిన మీ అయ్య జాగీరా ! అనే ప‌దాన్ని కాంగ్రెస్ బాగా వాడుకోవ‌డానికి సిద్ద‌ప‌డింది. మా గ‌డ్డ మీద‌కు వ‌చ్చి మ‌మ్మ‌ల్నే ప్ర‌శ్నిస్తావా? అని జ‌నం ముందు ప‌వ‌న్‌ను దోషిలా నిలిపేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నం చేస్తుంది. అప్పుడు బీజేపీ కూడా ప‌వ‌న్‌తో ప్ర‌చారం చేయించుకోవ‌డానికి వెనక్కి త‌గ్గొచ్చు.

Advertisement

చంద్ర‌బాబు మొన్న‌నే తెలంగాణ విష‌యంలో త‌మ నేత నోరు జారిన న‌ష్టాన్ని వెంట‌నే పూడ్చుకునే ప్ర‌య‌త్నం చేశాడు. తెలంగాణ అనే ప‌ద‌మే డిక్ష‌న‌రీలో లేద‌ని తెలంగాణ టీడీపీ నేత బ‌క్క‌ని న‌ర్సింహులు మ‌హానాడులో అన్న మాట‌లు తెగ వైర‌ల్ అయ్యాయి. దీన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు వెంట‌నే దీన్ని స‌రిదిద్దాడు. తెలంగాణ‌కు ఎంతో చారిత్ర‌క నేప‌థ్యం ఉంద‌ని, ఇలా అన‌డం పొర‌పాటేన‌ని, తమ నేత అన్న మాట‌ల‌ను ఓ ప్ర‌క‌ట‌న ద్వారా ఖండించాడు. సినిమాలో డైలాగులు పేలిన‌ట్టు… ఇలా ప్రాక్టిక‌ల్ రాజ‌కీయాల్లో కూడా ఓట్లు రాల్చి పెడ‌తాయ‌ని భావిస్తే.. అన్ని స‌మయాలు ఒక‌లా ఉండ‌వు. ఇలా అప్పుడ‌ప్పుడు రివ‌ర్స్ అవుతూ ఉంటాయి. ప‌వ‌న్ విష‌యంలో అదే జ‌రిగింది.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×