E-Paper
Advertisement

తెలంగాణలో ఇళ్లకు కరెంట్ మీటర్ల గండం: జగదీష్ రెడ్డి!

తెలంగాణలో ఇళ్లకు కరెంట్ మీటర్ల గండం: జగదీష్ రెడ్డి!
Advertisement

RDSS Scheme: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం తొందరలోనే చీకటిలోకి నెట్టివేయబడుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రడ్డి అన్నారు. రైతుల పాలిటనే కాదు ఉచిత విద్యుత్ పొందుతున్న వారందరు పిడుగు వార్త అని జగదీష్ రెడ్డి అన్నారు. RDS కారణంగా తెలంగాణలో ప్రతి ఒక్కరి నెత్తిపైన పిడుగు పడబడబోతుందని అన్నారు. RDSS విధానాన్ని మొదటి నుంచి కేసీఆర్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్‌లో RDSS పథకం క్రింద మీటర్లు పెట్టారని అన్నారు. RDSS పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మహిళలు వేలాదిగా రోడ్డు పైకి వచ్చి మీటర్లను తగలబెట్టారుని గుర్తు చేశారు.

విద్యుత్ రంగం ప్రైవేట్ పరం..

తెలంగాణలో RDSS పథకం ద్వారా ప్రతిఒక్కరి ఇంట్లో మీటర్లు పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైంది. RDSS మీటర్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు నష్టం వాటిల్లుతుందిని అన్నారు. RDSS మీటర్‌కు ముందే రీచార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది, లేకపోతే కరెంట్ కట్ అవుతుందిని అన్నారు. RDSS ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందిని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్సంటేజ్‌లతో మీటర్ ఖర్చు ఎంతకు పోతుందో తెలియదు. కొత్తగా రూరల్ డిస్కం తెచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రూరల్ డిస్కంను అదానీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది.

Advertisement

Also Read: చంద్రబాబు స్పీడ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్. బుల్లెట్ వేగంతో మారుతున్న ఆంధ్రప్రదేశ్!

కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీనా..?

ఆంధ్రప్రదేశ్‌లో RDSS పథకాన్ని శ్రీకాకుళంలో పెట్టీ వెనక్కి తీసుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో RDSS పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన చేసి, తెలంగాణలో RDSS పథకానికి అనుకూలంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా, ప్రాంతీయ పార్టీనా అని ఎద్దేవా వేశారు. కాంగ్రెస్ వస్తే బ్రతుకులు చీకటి అవుతాయని కేసీఆర్ ముందు నుంచి చెప్తూనే ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని తొందర్లోనే బంగాళాఖాతంలో వెయ్యడం ఖాయం. RDSS కు వ్యతిరేకంగా బిఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు.

Advertisement

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో మరో కోత్త సేవలు ప్రారంభం!

Related News

పాలమూరు జిల్లాలో అన్నాచెళ్లెల్ల పోటాపోటీ పర్యటనలు..! కొడంగల్‌లో కవిత భారీ బహిరంగ సభ.. ఒక రోజు ముందే కేటీఆర్‌ హడావుడి టూర్..

రామాయణంలో పిడకల వేట.. ఫామ్‌హౌజ్‌ల వెంట కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర..!

జీహెచ్ఎంసీ ఎన్నికలు మరింత దూరం.. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ఇక సర్కార్‌ నజర్.. ! మరో ఏడాది పట్టే అవకాశం..?

ఖైరతాబాద్‌ బైపోల్‌పై కమలం కన్ను.. జెండా పాతేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

పదేళ్ల డేటా.. రోజూ ఒక లీక్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ సరికొత్త పొలిటికల్ అస్త్రం!

జనం చెవిలో నాడు పునరేకీకరణ పువ్వు! అదే బాటలో పయనించి నేడు కాంగ్రెస్‌ బొక్క బోర్లా..!

ఆస్తులు విశాలం.. భవంతులు సువిశాలం.. మనసులే ఇరుకిరుకు..!

శ్రీమంతుడు మా బాపు.. నడిమంతరపు సిరి నీది.. ఎప్పటికైనా సిరి సంపదలు మావి.. మా జాతే …!

Big Stories

Advertisement
×