E-Paper
Advertisement

వ‌చ్చే సీజ‌న్‌కు కాళేశ్వ‌రం నీళ్లిస్తాం..! బీఆరెస్‌ దూకుడుకు రిపేరు క‌ళ్లెం వేసిన కాంగ్రెస్!

వ‌చ్చే సీజ‌న్‌కు కాళేశ్వ‌రం నీళ్లిస్తాం..! బీఆరెస్‌ దూకుడుకు రిపేరు క‌ళ్లెం వేసిన కాంగ్రెస్!
Advertisement

కాళేశ్వ‌రం దూకుడుకు కాంగ్రెస్ బ్రేకులు వేసింది. బీఆరెస్ మంచి దూకుడు మీదున్న‌ది. ఎల్‌నినో బూచిని చూపెట్టి.. కాళేశ్వ‌రంపై కాల‌యాప‌న చేస్తూ వ‌స్తున్న కాంగ్రెస్ స‌ర్కార్‌కు ఇరుకున పెడ‌దామ‌ని చేసిన ప్ర‌య‌త్నాలు కొంత మేర ఫ‌లించాయి.

హ‌రీశ్ లేవ‌నెత్తిన స‌వాళ్లు, వేసిన ప్ర‌శ్న‌ల‌పై బాగానే చ‌ర్చ జ‌రిగింది. మూడు సీజ‌న్ల‌ను వృథా చేశార‌ని, ఇంకా ఒక్క సీజ‌నే బాకీ ఉంద‌ని, ఇంకెప్పుడు చేస్తారు..? అని స‌ర్కార్‌ను ప్ర‌శ్నించాడు హ‌రీశ్. ఇంకా టెస్టింగుల‌కే పంప‌లేదు.. రిపేర్లు ఎప్పుడు చేస్తార‌ని? అని అడిగిన లాజిక‌ల్ ప్ర‌శ్న కొంత చ‌ర్చ‌కు తెర తీసింది.

Advertisement

మ‌రోవైపు బీజేపీతో పాటు టీఆరెస్ చీఫ్ క‌విత కూడా కాళేశ్వ‌రం మీద ఇంకా మీన‌మేశాలు లెక్కించ‌డం వ‌ద్ద‌ని, రైతుల‌కు ఇబ్బందులు రాకుండా చేయాల‌ని, ఏదో ఒక మ‌ధ్యేమార్గం ఆలోచించాల‌ని సూచిస్తూ వ‌స్తున్నారు. ఓవైపు త‌మ్మిడిహ‌ట్టి వ‌ద్ద నిర్మాణం అనేది సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని స‌ర్కార్‌కూ తెలుసు.

మ‌రి ఇప్పుడు కాళేశ్వ‌రంపై ఇలాగే మొండికేస్తూ పోతే తీరా రైతుల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని గ్ర‌హించింది స‌ర్కార్‌. మేడిగ‌డ్డ వ‌ద్ద రెండు పిల్ల‌ర్లు కుంగాయి. దీన్ని మ‌ర‌మ్మ‌తులు చేస్తే స‌రిపోతుంది. కానీ స‌ర్కార్ ఈ చ‌ర్య‌లకు దిగ‌లేదు ఇంత వ‌ర‌కు. దీన్నే హైలెట్ చేసుకుంటున్న‌ది బీఆరెస్‌. దీంతో పాటు దాని రిపేరు అయ్యే లోపు క‌న్నెప‌ల్లి పంపుహౌజ్ వ‌ద్ద మోటార్ల‌ను చాలు చేసి నీటిని విడుద‌ల చేయాల‌నే డిమాండ్‌ను లేవ‌నెత్తారు.

Advertisement

ఇది కూడా స‌ర్కార్‌కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టింది. ఏదో ఒక విధంగా ఈ సీజ‌న్ త‌ప్పించుకోగ‌లుగుతమేమో గానీ, వ‌చ్చే వానాకాలం సీజ‌న్ వ‌ర‌కు మాత్రం ఇదే ప‌రిస్థితిని కంటిన్యూ చేయ‌లేమ‌ని తేల్చుకున్న‌ది స‌ర్కార్‌. అందుకే ఇటు ప్ర‌తిప‌క్షానికి ఆన్స‌ర్ ఇవ్వ‌డ‌మే కాదు.. రైతుల్లో ఉన్న అపోహ‌లు కూడా పోగొట్టేందుకు ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌తో ముందుకు వ‌చ్చింది రేవంత్ స‌ర్కార్‌.

వ‌చ్చే వానాకాలం సీజ‌న్ నాటికి మేడిగ‌డ్డ‌ను రిపేరు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. అంటే హ‌రీశ్ అన్న‌ట్టుగా.. టెస్టుల కోసం వ‌డివ‌డిగా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు స‌ర్కార్ సిద్ద‌మైంద‌న్న‌మాట‌. ఈ టెస్టులు చేస్తే గానీ, మేడిగ‌డ్డలో కుంగిన పిల్ల‌ర్ల‌ను రిపేరు చేయ‌డానికి రాదు. అందుకే దీనికో డెడ్‌లైన్ పెట్టుకున్నారు. ఇక కాల‌యాప‌న క‌రెక్టు కాద‌ని స‌ర్కార్ కూడా మేల్కొన్న‌ది.

అందుకే ఈ స‌ర్కార్ ట‌ర్మ్‌కు లాస్ట్ సీజ‌న్‌గా ఉన్న వానాకాలం సీజ‌న్ నాటికి రిపేర్లు కంప్లీట్ అయ్యేలా చేసి.. నీటిని అందిస్తామని ఇవాళ నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ద్వారా స‌ర్కార్ ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయించింది. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేకులు ప‌డిన‌ట్టేన‌ని భావించాలి.

మ‌రోవైపు బీఆరెస్ ఇప్పుడ‌ప్పుడే దీన్ని వ‌ద‌లేలా లేదు. ముందుంది క‌రువు వాతావ‌వ‌ర‌ణం కాబ‌ట్టి.. నీరు లేక పంట‌లు ఎండితే.. త‌మ మాట విని క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ నుంచి నీరువిడుద‌ల చేస్తే ఇప్పుడు ఈ దుస్థితి వ‌చ్చేది కాదు క‌దా..? అని నిల‌దీసేందుకు స‌మ‌యం కోసం వేచి చూస్తూ ఉన్న‌ది…

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

Big Stories

Advertisement
×