E-Paper
Advertisement

ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. మార్పు తెచ్చి చూపిస్తా! రేవంత్ మార్క్ మార్పైతే కాద‌ట‌!

ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. మార్పు తెచ్చి చూపిస్తా! రేవంత్ మార్క్ మార్పైతే కాద‌ట‌!
Advertisement

తన‌కు ఒక్క ఛాన్సిచ్చి చూడాల‌ని క‌విత తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అప్పీలు చేసుకుంటున్నారు. ఒక్క‌సారి అధికారం ఇచ్చి చూడండి.. క‌చ్చితంగా మార్పు తెచ్చి చూపిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు ఆమె. సింగ‌రేణి బొగ్గుబాయి ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారిలా! రామగుండం ఓసీపీ -3, బేస్ వర్క్ షాప్ లను సందర్శించి, కార్మికులతో ఆమె మాట్లాడారు. ప్ర‌శ్నించినందుకు త‌న‌ను పార్టీలోంచి తీసేశార‌ని, ప్ర‌జా సేవ చేయాల‌నే నా ఆలోచ‌న‌ల‌ను, అకుంఠిత దీక్ష‌ను ఎవ‌రూ తుడిచేయ‌లేన్న ఆమె.. అందుకే కొత్త పార్టీ పెట్టాన‌న్నారు.

మీ అందరికీ తెలుసు నన్ను బీఆర్ఎస్ ను బయటకు పంపితే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టాను… నాకు ప్రాణప్రదమైన సింగరేణి కార్మికులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను…బాయిబాట కార్యక్రమం ద్వారా కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను…అని అన్నారామె. మీకు నేను 20 ఏళ్లుగా తెలుసు. ఉద్యమంలోనూ అదే విధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనూ మీతే పాటు పనిచేశాను…నేను ఎప్పుడూ కూడా కార్మికుల పక్షానే ఉన్నాను. కానీ గుంటనక్క కాంట్రాక్టర్ల పక్షాన ఉంది.. అని ప‌రోక్షంగా హ‌రీశ్‌పై ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement

ఎప్పుడూ కూడా నేను కార్మికుల కోసమే పనిచేస్తాను.. నేను ఎంత మొండి దాన్నో మీకు తెలుసు…బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఏ ప్రతిపక్షం చేయనన్ని పోరాటాలు మేము చేస్తున్నాం…అవి కార్మికుల‌కు వివ‌రించారామె. యూనియన్లు, ప్రతిపక్షాలు ప్రశ్నించి వదిలేస్తాయి…కానీ మేము ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే విధానంతో వెళ్తున్నామ‌న్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఈ విధంగా పరిష్కరించామ‌న్నారు. త‌మ పార్టీ పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వెళ్తోందని, ఉచిత విద్య, వైద్యం, సామాజిక న్యాయం, రైతుకు గౌరవం, యువత ఉపాధి, రుణాలు ఇవ్వాలనే సంకల్పం పెట్టుకున్నామ‌న్నారు.

కచ్చితంగా మాకు అవకాశం ఇస్తే మంచి మార్పు తెస్తామ‌న్న ఆమె.. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మార్పు మాత్రం కాదు. ప్రజల కోసం మంచి మార్పు కచ్చితంగా తెస్తామ‌న్నారు. బీఆరెస్ పాల‌న‌లో జ‌రిగిన పొర‌పాట్ల‌కు తాను క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌న్నారు క‌విత‌.

Related News

మెున్న శ్రీరెడ్డి, నిన్న పోసాని, నేడు బోరుగడ్డ.. అయ్యో అయ్యో అయ్యయ్యో?

తండ్రులు సామ్రాజ్యాలు క‌ట్టారు.. కొడుకులు కూల‌గొట్టారు.. ఆ ఇద్ద‌రికీ ‘స‌న్’ స్ట్రోక్స్.. సీఎం యోగం ఉన్న‌ట్టా, లేన‌ట్టా?

ఆ రెండు ఆల‌యాలకు క్షుద్ర‌పూజ‌ల మ‌ర‌క‌.. రాజ‌కీయాల కోసం ఆ రెండు రాష్ట్రాల భ‌క్తుల‌ మ‌నోభావాలు దెబ్బ తీసేలా.. డిఫెన్స్‌లో ప‌డేశారా? సెల్ఫ్ డిఫెన్స్‌లో ప‌డ్డారా?

అందితే జుట్టు.. అంద‌క‌పోతే కాళ్లు.. పోల‌వ‌రం క్రెడిట్ కోసం వైసీపీ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌!

హీరోగా ఓకే, బిజినెస్‌మెన్‌గా డబుల్ ఓకే… పొలిటిక‌ల్‌గా నాట్ ఓకే.. యావ‌రేజ్ లీడ‌ర్‌!

క్షుద్రపూజ‌ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న తెలంగాణ‌.. అజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న‌లో బిజీగా రెండు పార్టీలు!

ఓ ర‌కుల్‌.. ఓ త్రిష‌.. రాజ‌కీయ అస్త్రాలుగా సినీ తార‌లు.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేందుకూ వెన‌కాడ‌ని వైనం…!

కుక్క‌ను నిలబెట్టినా గెలుస్తాం.. అహంకార‌పు మాట‌ల‌కు, చేష్ట‌ల‌కు కాలం చెల్లు!

Big Stories

Advertisement
×