E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..!? హ‌రీశ్ నిన్నే…!

నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..!? హ‌రీశ్ నిన్నే…!
Advertisement

నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే కుట్ట‌నా? అని చీమ త‌న మ‌న‌సులోని భావ‌న చెప్ప‌డం దీని ఉద్దేశ్య‌మ‌న్న‌మాట‌. ఇప్పుడు అచ్చంగా ఫ్యూచ‌ర్ సిటీకి వ‌ర్తిస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి మాన‌స పుత్రిక ఫ్యూచ‌ర్ సిటీ. కానీ ఈ సిటీని తాము అధికారంలోకి రాగానే ర‌ద్దు చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు హ‌రీశ్‌. దీనికి కేటీఆర్ మ‌ద్ద‌తు తెలుపుతున్న‌డు. వంద‌శాతం ఏకీభ‌విస్తాన‌న్నాడు. అయితే ఈ ముచ్చ‌ట‌ను ప‌దే ప‌దే లేవ‌నెత్తుతున్న‌ది మాత్రం హ‌రీశే.

ప‌క్కా మేము అధికారంలోకి వ‌స్తాం.. వంద‌శాతం ఆ ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తూనే ఉన్నాడు ఎక్క‌డ‌బ‌డితే అక్క‌డ‌. ఏ వేదిక‌లెక్కినా ఇదే ముచ్చ‌ట‌. ఇగ చూసీ చూసీ … ఓపిక న‌శించింది రేవంత్ రెడ్డికి. ఫ్యూచరే లేనోళ్ల మాట‌లు ప‌ట్టించుకోవ‌ద్దు.. బీఆరెఎస్ అంటేనే చెల్ల‌ని వెయ్యి నోట‌న్న‌ట్టు.. అని జ‌నాల‌కు ఎంత అభ‌యం ఇద్దామ‌ని ట్రై చేసినా.. ఎంత భ‌రోసా క‌ల్పిద్దామ‌ని విశ్వ ప్ర‌య‌త్నం చేసినా.. వాటికి గండి పెడుతూనే ఉన్నాడు హ‌రీశ్‌.

Advertisement

ఇక అట్ల గాదు ఇట్ల కాదు అనుకున్న‌ట్టున్నాడు రేవంత్‌.. అస‌లు నువ్వు సిద్దిపేటల గెలుస్త‌వా? అది చూసుకో మ‌ళ్లా..అని హ‌రీశ్ ఆయువు ప‌ట్టులాంటి ఈ టాపిక్‌ను తీసుకుని దాడి చేయ‌డం మొద‌లు పెట్టాడు రేవంత్‌. వాస్త‌వానికి, హ‌రీశును సిద్దిపేట‌లో ఓడించ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. ఒకవేళ బీఆరెస్‌కు తీవ్ర‌మైన వ్య‌తిరేక గాలి వీచి.. కేసీఆర్ కూడా తుక్కు కింద ఓడిపోతాడనే రిపోర్టు ఉన్నా.. హ‌రీశ్ మాత్రం గెలుస్తాడ‌నే చెబుతాయి ఏ స‌ర్వే రిపోర్టులైనా. ఆయ‌న ట్రాక్ రికార్డు అలాంటిది మరి.

మెజారిటీ పెరుగుతూ పోయిందే త‌ప్ప‌.. త‌గ్గ‌డం లేదు. గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కే అయ్యిందే త‌ప్ప‌.. ఎప్ప‌డూ ఓట‌మి ద‌రిదాపుల్లోకి కూడా పోలేదు హ‌రీశ్ రావు. రాజ‌కీయాల‌కు అతీతంగా.. అక్క‌డ పార్టీ అని చూడ‌కుండా.. కేసీఆర్ గీసీఆర్ జాన్తానై.. కేవ‌లం హ‌రీశ్ వ్య‌క్తిత్వానికే ఓటు.. అనే విధంగా ట్రెండ్ సెట్ చేసుకున్నాడ‌త‌ను. లోన మ‌నిషి త‌త్వం ఎట్లా ఉన్నా.. కొంద‌రు అన్న‌ట్టుగా అత‌ను క‌న్నింగ్ ఫెలో అయి ఉన్నా.. త‌ను వ్య‌వ‌హ‌రించే తీరు.. స్పందించే వైఖ‌రి అంద‌రికీ భిన్నం. స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చిన వారిని సంతృప్తి ప‌రిచి.. వారి ప‌ని కాకున్నా.. త‌న వంతు ప్ర‌య‌త్నం చేశాన‌నే ఆయ‌న చేతలు.. వారిని క‌ట్టిప‌డేస్తాయి.

Advertisement

ఆ ఒక్క‌డు వంద‌మందికి చెబుతాడు. అరే భ‌య్‌… ఎంతో మంది లీడ‌ర్ల‌ను చూసినా గానీ… హ‌రీశ్ రావు అసొంటోడిని చూడ‌లేరా భ‌య్‌! అబ్బ ఏం లీడ‌ర్ ర్రా.. అట్లుండాలె! అని దొరికిన చోట‌ల్లా త‌న భావ‌న‌లు పంచుకుంటూ ఉంటారు. దీంతో సిద్దిపేట‌లోనే కాదు.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌కు పాకింది హ‌రీశ్ స్టైల్‌. లీడ‌ర్ క్వాలిటీస్‌. అత‌ను స్పందించే ల‌క్ష‌ణం గురించి. ఇదంతా ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వ‌స్తుందంటే.. సీఎం రేవంత్ రెడ్డి .. హ‌రీశ్ రావును టార్గెట్ చేశాడు.

సిద్దిపేట‌లోనే అత‌న్ని ఓడించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నాడు. పాత రికార్డుల‌న్నీ ఒక వైపు.. ఇప్పుడు ఓ లెక్క అనేట్టుగా రేవంత్ చేస్తున్న శ‌ప‌థం చూస్తుంటే.. హ‌రీశ్ ఓట‌మి త‌ప్ప‌దా? అనే విధంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ మ‌ధ్య‌లో సిద్దిపేట‌లో మీటింగు పెట్టి.. ఇక్క‌డ కాంగ్రెస్ త‌రుపున అభ్య‌ర్థి గెల‌వ‌బోతున్నాడు.. కేబినెట్‌లో కీల‌క హోదాలో ఉంటాడు..! అని కూడా ప్ర‌క‌టించి వ‌చ్చాడు.

ఫ్యూచ‌ర్ సిటీ గురించి హ‌రీశ్ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా టార్గెట్ చేస్తుండ‌టంతో.. రేవంత్ కూడా అస‌లైన ఆయువుప‌ట్టు కేంద్రంగా హ‌రీశ్‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నాడు. నీ సీటు నువ్వే గెలిచే ప‌రిస్థితి లేకుండా చేస్తాం.. ఇక ఫ్యూచ‌ర్ నీకు ఉండ‌దు.. నువ్వెక్క‌డ మా ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తావ్‌? అనేది రేవంత్ లాజిక్‌. ఇప్పుడ‌ర్ద‌మ‌య్యిందా? నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే కుట్ట‌నా? అనే సామెత‌కు ప‌ర‌మార్థం..

Related News

పంట కొనుగోళ్ల పై పచ్చి అబద్ధాలు! రైతు కేంద్రంగా రాజకీయాలు!

బండి భ‌గీరథ్‌ను వ‌ద‌ల‌ని బీఆరెస్‌! బెయిల్ మంజూరైనా… అది రేవంత్ వ‌ల్లేన‌ట‌!

స‌ర్కార్ రాంగ్ స్టెప్‌.. పాండురంగా ఆత్మ‌హ‌త్య‌తో చ‌ర్చ‌లోకి వ‌చ్చిన రైతుబీమా!

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!

వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!

క‌విత‌పై దండ‌యాత్ర‌.. ! మ‌రింత దూకుడుగా బీఆరెస్ సోష‌ల్ మీడియా ఆమెపై దాడి!

జెన్‌-జీ మెచ్చిన నేత రాహుల్‌! మ‌రి మోడీపై ఎందుకా వ్య‌తిరేక‌త‌!?

Big Stories

×