E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఇక్కడ కేసీఆర్‌.. అక్క‌డ స్టాలిన్‌! ఓడిన త‌రువాత ముఖం చాటేసిన తండ్రులు!

ఇక్కడ కేసీఆర్‌.. అక్క‌డ స్టాలిన్‌! ఓడిన త‌రువాత ముఖం చాటేసిన తండ్రులు!
Advertisement

ఎక్క‌డైనా అధికార ప‌క్షాన్ని ప్ర‌తిప‌క్షం ఇరుకున పెడుతుంది. నిల‌దీస్తుంది. కానీ అధికార ప‌క్ష‌మే ప్ర‌తిప‌క్షాన్ని ఆడుకుంటే.. ఆ ఛాన్స్ ఆ ప్ర‌తిప‌క్ష నేతే వారికి ఇస్తే.. ఇదే జ‌రుగుతోంది త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో. తెలంగాణ త‌ర‌హాలోనే త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఏళ్ల‌కు ఏళ్లు ఏలిన ఏలిక‌లు .. ఒక్క‌సారి ఓడ‌గానే జ‌నానికి ముఖం చాటేసిన వైనం.. ఇప్పుడు అధికార పార్టీ అస్త్రాలుగా మారుతున్నాయి. ఇప్ప‌టికే మీకు విష‌యం అర్థ‌మైపోయి ఉంటుంది.

అయితే త‌మిళ‌నాడులో తాజా సంఘ‌ట‌న చెప్పుకున్న త‌రువాత తెలంగాణ‌కు వ‌ద్దాం. తమిళ‌నాడు సీఎం విజ‌య్ ద‌గ్గ‌ర‌ వ్యంగ్యం కావాల్సినంత ఉంది. దీన్ని చ‌మ‌త్కార‌మ‌ని కూడా అనాలేమో. సంద‌ర్భోచితంగా ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాన్ని ఇరుకున పెట్టే విధంగా సెటైరిక‌ల్‌గా మాట్లాడ‌టం బాగా అల‌వాటుగా ఉన్న‌ట్టుంది. బ‌హుశా అవి త‌న సినిమాల అనుభ‌వంతోనే వ‌చ్చి ఉంటాయి.

Advertisement

అస‌లేం జ‌రిగిందంటే.. స్టాలిన్ మొన్న ఎన్నిక‌ల్లో ఓడాడు. అసెంబ్లీకి వ‌చ్చే ఛాన్సు లేదు. కానీ విజ‌య్ … ఉద‌య‌నిధితో ఏమ‌న్నాడో తెలుసా? ఏంటీ నాన్న క‌నిపించ‌డం లేదు? అని. వాస్త‌వానికి ఓడిన నేత అసెంబ్లీకి రాడు. కానీ ఇక్క‌డ ఆయ‌న ఉద్దేశ్య‌మేమిటంటే.. సీఎంగా చేసిన స్టాలిన్‌ను అసెంబ్లీలోకి కూడా రానీయకుండా చేశాము చూశావా! అని ఎద్దేవా చేసిన‌ట్టుగా ఉద‌య్‌కు చురక‌లంటిండాన్న‌మాట‌.

దీనికి కౌంట‌ర్‌గా ఉద‌య్ కూడా ఇచ్చాడు బాగానే బ‌దులు. ఎలాగూ ఓ స్థానంలో ఉప ఎన్నిక రాబోతుంది క‌దా? అక్క‌డ పోటీ చేసి అసెంబ్లీకి వ‌స్తాడులే! అన్నాడు. విజ‌య్ రెండు చోట్ల పోటీ చేసి గెలిచాడు. ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ చోట ఉప ఎన్నిక వ‌స్తుంది.. అక్క‌డ్నుంచి మ‌ళ్లీ పోటీ చేసి స్టాలిన్ గెలుస్తాడ‌నేది ఉద‌య్ కౌంట‌ర్‌. దీనికి స్టాలిన్ కూడా బ‌దులిచ్చాడు ఘాటుగానే. నేను అక్క‌డ అసెంబ్లీలో లేక‌పోవ‌చ్చు గానీ, ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్నాన‌ని అన్నాడు.

Advertisement

ఇప్పుడు తెలంగాణకు వ‌ద్దాం. ఇక్క‌డ కేసీఆర్ గెలిచాడు. కానీ అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకే కాదు.. ఎక్క‌డికీ రాడు. ఏదో అలా అమాస పున్నానికి ఓసారి త‌న అవ‌స‌రం రీత్యా అంతే.. ! జ‌నం కోసం కాదు. ఒక‌వేళ జ‌నం కేసీఆర్ అన్నా.. నువ్వు రావాల‌న్నా..! అని నోరు తెరిచి పిలిచినా.. అరిచినా..! పోపోవోయ్‌.. క‌త్తి వాడికెవ‌డికో ఇచ్చి.. న‌న్ను యుద్దం చేయ‌మంటావా? ఛ‌ల్‌.. న‌డువ్‌..! అని గ‌దుమాయిస్త‌డు. అంటే ఆయ‌న ఇప్ప‌ట్ల రాడు. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కే వ‌స్త‌డ‌న్న‌మాట‌.

కానీ ఇక్క‌డ కూడా కేసీఆర్ రాక‌పోవ‌డాన్ని బాగానే ట్రోల్ చేస్తోంది అధికార ప‌క్షం. ఎందుకు అసెంబ్లీకి రావ‌డం లేద‌ని నిల‌దీస్తూనే ఉంది. కానీ ఒక్క జ‌వాబు కూడా కేసీఆర్ నుంచి రాలేదు ఇప్ప‌టి వ‌ర‌కు. కానీ కేటీఆర్ మాత్రం.. ఆయ‌న ఏడుండాల్నో ఆడున్న‌డు. ఎప్పుడు రావాల్నో అప్పుడొస్త‌డు. నేను స‌రిపోనా? ఆయ‌నే కావాలా? ఆయ‌న చేయ‌ని ప‌ద‌వి లేదు.. ఆయ‌న ఎక్క‌ని కుర్చీ లేదు.. అని స‌మ‌ర్థింపు మాట‌లు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు.

అక్క‌డ్నేమో.. కొత్త‌గా ఏర్పాటైన పార్టీ చేతిలో మ‌ట్టి క‌రిచి ఇలా చురుకులు పెట్టుకుంటున్నారు తండ్రీకొడుకులు. ఇక్క‌డ మా నేతే జాతిపిత అని భుజ‌కీర్తులు త‌గిలించుకున్న పార్టీ ఓడిపోగానే జ‌నం మీద అలిగి ఫామ్‌హౌజ్ మంచ‌మెక్కింది. ఇద‌న్న‌మాట ముచ్చ‌ట‌.

Related News

కోదండ‌రామ్‌ను టార్గెట్ చేసిన క‌విత‌! ప‌ద‌వులు పోతాయ‌ని స్థానిక‌త మీద సైలెంట్‌..!

అవును.. నేను గుంపుమేస్త్రీనే..! సెల‌వు తీసుకోకుండా..తెలంగాణ కోసం శ్ర‌మిస్తున్నా!

మ‌ళ్లీ ముల్కీరూల్స్ తెర‌పైకి…! నాలుగేళ్ల స్థానిక‌త కాదు.. ప‌దిహేనేండ్లు అయి వుండాలె!

అంత‌టా ఓటు టెన్ష‌న్‌! సిటీ నుంచి ఊర్ల‌కు.. ఓటు పోతుంద‌నే భ‌యం అంద‌రిలో!

ఔను మేం త‌ప్పు చేశాం! కార్య‌క‌ర్త‌ల్ని ప‌ట్టించుకోలే.. ఉద్య‌మ‌కారుల‌ను గౌర‌వించ‌లే!

త‌లైవాకు త‌త్వం బోధ‌ప‌డ్డ‌ది.. ధైర్య‌మే స‌రిపోవ‌డం లేదు! మౌన‌ముని పాత్రే బెట‌ర‌ట‌!

దేవుడికి దండం పెట్టినా త‌ప్పేనా? ఏపీలో కుల‌, మ‌త రాజ‌కీయాల కుమ్ములాట‌లు!

Big Stories

×