E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

తారక్ రికార్డ్‌పై ‘పెద్ది’ గురి తప్పిందా?.. ఎంత కష్టపడినా చరణ్‌కు అది అందని ద్రాక్షేనా ?

తారక్ రికార్డ్‌పై ‘పెద్ది’ గురి తప్పిందా?.. ఎంత కష్టపడినా చరణ్‌కు అది అందని ద్రాక్షేనా ?
Advertisement

Peddi vs Devara: కలెక్షన్స్ …సినిమా ఇండస్ట్రీ వీటి చుట్టే చక్కర్లు కొడుతుంది. అందుకే హీరోల స్టామినాని,క్రేజ్ ని వీటి ఆధారంగానే లెక్కగడుతుంటారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం టాప్ స్టార్స్ సినిమాలు మినిమం 500 కోట్లు కొట్టాల్సిందే అన్నట్టుగా అయిపొయింది.ఈ క్రమంలోనే పెద్ది సినిమా 450 కోట్లు వసూలు చేసిందని మేకర్స్ పోస్టర్ వదలడంతో సినిమా 500 కోట్లు కొడుతుందా లేదా అన్న డిస్కషన్ కి తెరతీశారు మూవీ లవర్స్. అయితే విచిత్రంగా ఈ సినిమా కలెక్షన్స్ ని తారక్ దేవర కలెక్షన్స్ తో పోలుస్తూ ఉండటం గమనార్హం.

500 కోట్ల క్లబ్‌లో చేరి కాలర్ ఎగరేసిన దేవర 

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాకి అప్పట్లో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిసింది. సినిమా చూసిన కొందరు ఇదేంట్రా అని తలలు పట్టుకున్నా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ పవర్‌తో బాక్సాఫీస్ గల్లా పెట్టెలు గలగల లాడాయి.అలా దేవర ఏకంగా 500 కోట్ల క్లబ్‌లో చేరి కాలర్ ఎగరేసింది.ఇక అంతే, సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ హడావుడి చూసి తట్టుకోలేక, మెగా ఫ్యాన్స్ అంతా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని కూర్చున్నారు. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో వస్తున్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి, దేవర రికార్డులను పెద్ది బద్దలు కొడుతుందని గట్టి నమ్మకంతో పందాలు కూడా కాసేశారు.

Advertisement

also read:Pawan Kalyan OG 2…ఊహించని రేంజ్‌లో ‘OG 2’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

తొలిరోజే ఏకంగా 135 కోట్ల గ్రాస్ వసూలు

కట్ చేస్తే, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ది థియేటర్లలోకి దిగింది. తొలిరోజే ఏకంగా 135 కోట్ల గ్రాస్ వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పెట్టిన భారీ బడ్జెట్‌కు తగ్గట్టే, రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. 1990ల విజయనగరం బ్యాక్‌డ్రాప్, కొండ ప్రాంత ప్రజల కష్టాలు, దానికి తోడు చరణ్ కూలీగా, క్రికెటర్‌గా, రెజ్లర్‌గా మూడు అవతారాల్లో పడ్డ కష్టం స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించింది. మధ్యలో జాన్వీ కపూర్ క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో, మేకర్స్ కంగారుపడి సీన్లు మార్చడం, కొత్త సీన్లు యాడ్ చేయడం లాంటి ప్యాచ్ వర్కులు కూడా చకచకా చేసేశారు. చరణ్ పడ్డ కష్టానికి, థియేటర్ల రెస్పాన్స్‌కు మైలురాళ్లు దాటడం పెద్ద లెక్క కాదనుకున్నారు.

500 కోట్ల మార్క్ మాత్రం ‘అందని ద్రాక్ష’

Advertisement

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. ఎంత కష్టపడి మూడు గెటప్‌లు మార్చినా, ఎంతమందితో ఫైట్లు చేసినా.. పాపం చరణ్‌కు ఆ మ్యాజికల్ 500 కోట్ల మార్క్ మాత్రం ‘అందని ద్రాక్ష’లాగే మిగిలిపోయేలా ఉంది. ప్రస్తుతం పెద్ది సినిమా 450 కోట్ల మైలురాయి దగ్గర రొప్పుతూ, పడుతూ అడుగులు వేస్తోంది. థియేటర్ల రన్ దాదాపు ముగింపు దశకు వచ్చేయడంతో, ఈ 500 కోట్ల క్లబ్ అనేది మెగా ఫ్యాన్స్‌కు కలగానే మిగిలిపోయేలా ఉందని తేల్చేశారు ట్రేడ్ పండిట్స్.అంటే ఈ లెక్కన ఎంత గింజుకున్నా, ఎన్ని సీన్లు మార్చినా.. కలెక్షన్ల రేసులో చరణ్ తన దోస్త్ తారక్‌ను దాటలేకపోయాడన్నమాట. ఒకరకంగా దేవర రికార్డును బద్దలు కొట్టాలన్న మెగా ఫ్యాన్స్ ఆశలపై పెద్ది గట్టిగానే నీళ్లు చల్లినట్టే కనిపిస్తుంది.

also read:పాస్‌పోర్ట్ సీజ్ అన్నారు.. సింహం బోను అన్నారు.. కట్ చేస్తే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసిన మహేష్

వసూళ్ళతో దూసుకుపోతుందో లేదో 

ఇక థియేటర్లలో ఎలాగూ టార్గెట్ మిస్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఫ్యాన్స్ అంతా ఓటీటీ లెక్కల వైపు షిఫ్ట్ అయిపోతున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2 నుంచి పెద్ది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా.. థియేటర్లలో ఎలాగూ తారక్ దేవరను దాటలేకపోయింది, కనీసం నెట్‌ఫ్లిక్స్ వ్యూవ్‌షిప్ మిలియన్లలో అయినా ఆ రికార్డును దాటేసి పరువు నిలబెడితే బాగుండని ఆరాట పడిపోతున్నారు మెగా ఫ్యాన్స్.చూడాలి మరి నిజంగానే ట్రేడ్ పండితుల అంచనాలు నిజమై 500 కోట్ల లోపే సినిమా ఆగిపోతుందా లేక అంచనాలు తలకిందులు చేస్తూ మరింత వసూళ్ళతో దూసుకుపోతుందా చూడాలి.

Related News

Pawan Kalyan OG 2…ఊహించని రేంజ్‌లో ‘OG 2’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

40 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ క్రేజీ కాంబో.. ‘ధర్మన్’ మేకింగ్ వీడియోతో పూనకాలు!

పోలీస్ స్టేషన్ టు బిగ్‌బాస్ హౌస్? సీజన్ 10 మేకర్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఎస్‌ఐ..

పాస్‌పోర్ట్ సీజ్ అన్నారు.. సింహం బోను అన్నారు.. కట్ చేస్తే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసిన మహేష్

వెండితెరపై ‘మిర్జాపూర్’ విధ్వంసం.. టీజర్ చూస్తే గూస్‌బంప్స్ గ్యారంటీ!

‘మా ఇంటి బంగారం’ సినిమాకు సమంత ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?

ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ కింగ్ ‘బ్లాస్ట్ జోన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Big Stories

×