E-Paper
Advertisement

రజనీకాంత్ విలన్.. విజయ్ హీరో, తమిళనాడులో కొత్త చర్చ.. ఎందుకంటే?

రజనీకాంత్ విలన్.. విజయ్ హీరో, తమిళనాడులో కొత్త చర్చ.. ఎందుకంటే?
Advertisement

Tamil Politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది? రీల్ లైఫ్‌లో హీరో రజనీకాంత్.. రియల్ లైఫ్‌లో కొత్త అవతారం ఎత్తారా? ఆ విధంగా ఎందుకు కొత్త చర్చ మొదలైంది? విజయ్ సీఎం కాకుండా రజనీకాంత్ కావాలనే అడ్డుకుంటున్నారా? అవుననే అంటున్నారు కోలీవుడ్‌లోని ఓ వర్గం-టీవీకే పార్టీ కార్యకర్తలు. ఈ చర్చ వెనుక అసలేం జరిగింది?

తమిళనాడులో కొత్త చర్చ

Advertisement

తమిళనాడు రాజకీయాలు గడిచిన మూడు రోజులుగా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాల వెనుక కోలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిలో ఒకరు సీనియర్ నటుడు తలైవా. రీల్ లైఫ్‌‌లో హీరోగా కనిపించిన ఆయన, రియల్ లైఫ్‌లో విజయ్ పాలిట విలన్‌గా మారారని అంటున్నారు.

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ వ్యవహారంలో గవర్నర్ తీరుపై కోలీవుడ్ నటులు రియాక్ట్ అయ్యారు. సీనియర్ నటుడు కమల్‌హాసన్, ప్రకాశ్ రాజ్, విశాల్, ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే చాలా లిస్టు ఉంది. ప్రజల మద్దతులో గెలిచారని, ఆయన సీఎం అంటూ పలువురు నటులు తమతమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. కానీ తలైవా నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ విషయంలో తలైవా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? రాజకీయాలకు తనకు సంబంధం లేదని అనుకున్నారా? విజయ్ ముఖ్యమంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

Advertisement

రాజకీయ ఎపిసోడ్‌లో రజనీకాంత్ విలన్.. విజయ్ హీరో

ఒక్కసారి వెనక్కి వెళ్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే నాలుగు విడుదల అయ్యాయి. రెండు రోజుల తర్వాత అంటే బుధవారం నటుడు రజనీకాంత్, చెన్నైలోని మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఓవైపు రజనీకాంత్.. మరోవైపు స్టాలిన్ కూర్చుని మాట్లాడుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య చర్చ ఏం జరిగిందనేది కాసేపు పక్కనబెడదాం.

రజనీకాంత్ తన మద్దతును స్టాలిన్‌కు తెలియ జేయడానికి వచ్చారనే చర్చ మొదలైపోయింది. ఎన్నికల్లో మా పార్టీ ఓడిపోయిందని, ప్రజా తీర్పును శిరసావహిస్తామని గురువారం మాజీ సీఎం స్టాలిన్ చెప్పుకొచ్చారు. ఇక్కడే కొత్త పాయింట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడే రజనీకాంత్-స్టాలిన్ మధ్య విజయ్ వ్యవహారం చర్చకు వచ్చిందట.

ALSO READ: బీజేపీలో మోడీ టెన్షన్.. ఈసారి ఏమంటారో?

ప్రతిపక్షానికే పరిమితం కావాలని భావించిన స్టాలిన్, తెర వెనుక రజనీకాంత్ పావులు కదిపారనేది కొందరు బహిరంగంగా చెబుతున్నారు. రాజకీయాలపై రజనీకాంత్‌కు ఆసక్తి ఉంది.2017లో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించి 2021లో ఆరోగ్య కారణాలతో రావడం లేదని ప్రకటన చేశారు. గతంలో డీఎంకేకు రజనీకాంత్ మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు.

1995లో తలైవా రాజకీయాల్లోకి రావాలని భావించారని, ఆ సమయంలో ఆయన వెనక్కి తగ్గారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చి ప్రచారం చేశారని అంటున్నవాళ్లూ లేకపోలేదు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన ఆ పార్టీకి మద్దతు ఇచ్చారనీ గుర్తు చేస్తున్నారు. మొత్తానికి తమిళనాట ప్రస్తుత రాజకీయాల్లో తలైవాను విలన్‌గా కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related News

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

నా బంగారు విగ్గు ముట్టుకుంటే తిట్టనా? ఓ తాతా .. ఓ విగ్గు కథ.. మధుకు మంటెక్కింది అందుకేనా?

మూడేళ్లు సభకే రాలేదు.. కానీ చైతన్య రథంతో జనంతోనే ఉన్నారు! అవమానానికి బద్లా తీర్చుకున్న ఎన్టీఆర్‌.. ప్రతిపక్ష నేతగా బాబుకు పగ్గాలు!

Big Stories

Advertisement
×