E-Paper
Advertisement

అప్పుల లెక్క‌ల కోసం అంగీలు చింపుకుంటున్నరు! ఆఖిర్‌ తుమ్ లోగ్ క్యా సాబిత్ క‌ర్నా చాహెతో హో…!

అప్పుల లెక్క‌ల కోసం అంగీలు చింపుకుంటున్నరు! ఆఖిర్‌ తుమ్ లోగ్ క్యా సాబిత్ క‌ర్నా చాహెతో హో…!
Advertisement

అప్పుల లెక్క‌ల‌పై మొద‌టి నుంచి ఇద్ద‌రిదీ లొల్లే. ఒక‌రేమో అధికారంలోకి రాగానే లంకె బిందెలున్నాయ‌నుకుని వ‌చ్చాం.. తీరా చూస్తే ఇక్క‌డ అప్పుల చిప్ప‌లే మిగిలాయి.. అడుక్కుతినేతందుకు..! అని అంటారు. మేమ‌న్ని అప్పులు చేయ‌లేదు.. ఇగో ఇన్నే చేసినం.. కావాలంటే ఇగో కాకి లెక్కులు.. అదే కాగ్ లెక్క‌లు.. అని కాయితాలు ప‌ట్టుకుని బ‌య‌లుదేరుతున్న‌రు.

అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి దాకా.. అంటే రెండున్న‌రేండ్లుగా ఈ ముచ్చ‌ట లైవ్‌ల‌నే ఉంటుంది. దీన్ని అట్ల ఉంచితేనే మంచిద‌ని అధికార పార్టీ భావిస్తున్న‌ది. ఇట్ల చేస్తే జనం నోరు మూసుకుంట‌రు.. ఏమీ అన‌రు.. అడ‌గ‌రు అని వారి ఫీలింగు. ఎందుకంటే.. ఇగో మేం అన్నీ చేద్దామ‌నుకున్నాం… ఈడ ఏముంది..మ‌న్ను మశానం త‌ప్ప‌..!అని చెప్పేందుకు ఈ ముచ్చ‌ట‌ను అట్ల లైవ్‌ల ఉంచుతుంద‌న్న మాట అధికారం.

Advertisement

ఇక అధికారం చెలాయించి.. మూల‌కు ప‌డ్డ పార్టీ.. అగో అంత‌గ‌నం అప్పులు చేసినమ‌ని చెబితే.. జ‌నం మ‌మ్మ‌ల్ని ఛీ థూ అని ఉమ్చుత‌రు కావొచ్చు. మ‌న‌మెందుకు దోషులెక్క, దొంగ‌లెక్క ఉండాలె..? అంత‌గాదు.. చేసినం గానీ ఇగో గింతే చేసినం అని చెప్పి నిరూపించుకుని, జ‌నాల ముంగ‌ట నిటారుగా నిల‌బ‌డాలె అని తండ్లాడుతున్న‌ది.

ఇగ ఇది మ‌ళ్లా ఈ రెండు మూడొద్ద‌ల నుంచి లైవ్‌ల గింగిరాలు తిరుగుతున్న‌ది. దీన్ని అధికార పార్టీ ముందు ముంగ‌ల వెట్టింది. పాపం.. అని ఫామ్‌హౌజ్ మీద ఏ మాత్రం జాలి క‌లిగిన‌ట్టు అనిపించినా.. వెంట‌నే తేరుకుని.. ఏ గాళ్ల‌ను పాపమ‌న‌కుండ్రి.. ఇగో ఆళ్లు చేసిన పాపాలు.. అప్పుల కుప్ప‌లు.. అని చెప్ప‌నీకి రెడీ అయిపోత‌డు రెడ్డీ సాబ్‌!

Advertisement

ఇగో ఆళ్లు చేసిన అప్పులు.. దీని కోసం నెల‌కు, ఏడాదికి ఎంత మిత్తీ క‌డుతున్నమో తెలుసా? అందుకే పైస‌ల‌న్నీ దీనికే అయిపోతున్న‌య్‌..! గందుకే మీకే ఏం చేయలేక‌.. మింగ‌లేక‌..క‌క్క‌లేక చ‌స్తున్నం..! కాబ‌ట్టి మీరు ఆళ్ల‌ను ఇంకా ఇంకా తిడ్త‌నే ఉండాలె. ఇంకో ట‌ర్ము మాత్రం మ‌మ్మ‌ల్నే గెలిపించాలె. ఇగో అప్ప‌టి దాకైతే ఆళ్ల‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా.. తిట్టాలె.

అవ్‌.. మ‌రి! మన‌ల్ని బికారీ గాళ్ల‌ను చేసిండ్రు మ‌రి. దివాళా దీపిచ్చుర్రు హౌలాగాళ్లు. ఆళ్ల‌ను ఉత్త‌గ‌నే వ‌దిలిపెట్టొద్దు. ఆ ఫామ్‌హౌజ్‌ల‌నే బంధించాలె. బ‌య‌ట‌కు రానీయొద్దు..! స‌రేనా? అని .. ఆయ‌న చేసిన హామీలు అటకెక్కించి.. జ‌నం ద‌గ్గ‌ర హామీలు తీసుకునుడు మొద‌లుపెట్టిండు.

ఇగ రా తేల్చుకుందాం.. జ‌నాల‌కు క‌రెక్టు లెక్క తెలియ‌జేద్దాం.. ఎవ‌రెన్ని అప్పులు చేసిర్రో అని .. ఒక‌రి మీద మ‌రొక‌రు.. తొడ‌లు చ‌రుచుకుని, నీ ఇంటికొస్తా.. నీ న‌ట్టింటికొస్త..న‌ని శ‌ప‌థాలు చేసుకుని, కారాలు, మిరియాలు నూరుకుని, జ‌ర్రంత సేపు ఢాం ఢూం డుస్కుమ‌నిపించి.. ఎక్క‌డోళ్ల‌క్క‌డ పోయిండ్రు. ఇగ ఇయ్య‌ల్టి సినిమా ఇంతే.. అని జ‌నానికి రెస్టు ఇచ్చిండ్రు.

ఇవ‌న్నీ చూసిన జ‌నాల‌కు ఒక్క‌టే అర్థ‌మైంది. ఆఖ‌రికి మీరేం చెప్పాల‌నుకుంటుర్రు. బిచ్చ‌గాళ్ల‌మైనం. ఏమీ చేయ‌లేం. ఇచ్చింది తీసుకోర్రి.. ఎక్కువ‌త‌క్క‌వు అడ‌గ‌కుర్రి.. అని చెప్పాల‌నుకుంటుర్రా? ఆళ్ల‌కు చాత‌గాక ఇవ‌న్నీ ముచ్చ‌ట్లు చెబుతున్న‌రు గానీ, అదే అధికారం మాకిస్తే గీ అప్పుల‌న్నీ మేం మీ ముంగ‌టేసోటోళ్ల‌మా? ఆడ‌నో ఈడ‌నో మీ త‌ల‌కాయలు తాక‌ట్టు పెట్టైనా స‌రే, ఎన్ని ల‌క్ష‌ల కోట్లైనా అప్పులు తేమా? మీకు ప‌థ‌కాల మీద ప‌థ‌కాలు.. ఉచితాల మీద ఉచితాలు.. పంపిణీ చేయ‌మా? మీ దిల్‌ఖుష్ చేసేందుకు ఎన్ని తిప్ప‌లు ప‌డ్డామో చూసిర్రు క‌దా.. అందుకే! అప్పుల గురించి ఫిక‌రు చేయ‌కుర్రి. చిప్ప‌లు మేం ప‌ట్టుకుంటాం.. అప్పుల కోసం తిరుగుతం. మిమ్మ‌ల్ని తిప్ప‌లు పెట్టం.. అన్నీ మీ ముంగిట తెచ్చిపెడ‌తం..! అంతేనా?ఈ ముచ్చ‌ట్లేనా మీరు చెప్పేది!

Related News

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్! స‌ర్కార్‌పై ముప్పేట దాడి.. ధీటుగా జ‌వాబివ్వ‌లేక‌పోతున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా!

రేవంత్‌పై లేస్తున్న‌ రెబల్‌ గొంతులు.. నేరుగా నేత‌ల‌ బెదిరింపులు.. దేనికి సంకేతం?

ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాం.. వెన‌క్కి త‌గ్గినం.. కానీ ఇక‌పై అలా చేయ‌బోం.. నిజ‌మైన ఉద్య‌మ‌మే చేస్తాం..!

చెట్టుకు క‌ట్టేసి కొట్టండి.. త‌న్ని త‌ర‌మండి.. మంత్ర‌గాళ్ల‌ను వ‌ద‌లొద్దు.. ప‌ళ్లు రాల‌గొట్టండి..!

గౌడులో గౌడు.. రేవంతు గౌడు… మ‌న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంతు గౌడు..!

సిరిసిల్ల త‌ల‌నొప్పి! ప‌ట్టు సాధించేందుకు కేటీఆర్ తండ్లాట‌.. టూరిస్ట్ ఎమ్మెల్యే అంటూ బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ నిర‌స‌న‌లు..

దళితులకు మూడెకరాలు..కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ …! పేదలందరికీ ఎకరం జాగా ఇస్తామంటున్న కవిత…సాధ్యమా!?

పండిత పుత్ర ప‌ర‌మ శుంఠ‌.. నిజంగా కేటీఆర్ అంత వెర్రోడా? సీఎం ఇకపై రోజూ నిజాలు చెబుతాడ‌ట‌.. అంటే..?

Big Stories

Advertisement
×