E-Paper
Advertisement

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు
Advertisement

Delhi: తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజశ్విసూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కచ్చితంగా సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన వ్యాఖ్యలను రికార్డుల తొలగించాలని కోరారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.

తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హాట్ కామెంట్స్

Advertisement

శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దంటూ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు ఎంపీ మాటలను రికార్డులను తొలగించాలని, అలాగే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దంటూ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదరు ఎంపీ మాటలను రికార్డులను తొలగించాలని, అలాగే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి. తెలంగాణ గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎలాంటి అవగాహన ఉందని మాట్లాడారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం 1600 మంది బలి దానాలు, నీళ్లు, నిధులు, నియామకాలు వంటి నినాదంతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడం ఏంటని ప్రశ్నించారు.

ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. కచ్చితంగా ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సదరు ఎంపీ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. ఆయనకు మద్దతుగా మాట్లడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు వెనుకేసికొచ్చారని ప్రశ్నించారు.

ALSO READ: మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలు గెలిపించడం వల్లే జరిగిందన్నారు. పార్టీ ఎంపీని మందలించకుండా ఆయన్ని వెనుకేసురావడం ఏంటంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో బీఆర్ఎస్‌పై కూడా విరుచుకుపడ్డారు. ఎంపీ మాట్లాడిన సమయంలో సభలో తాము లేమని చెప్పడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ. కావాలనే బీఆర్ఎస్ దాగుడు మూతలు ఆడుతోందని విమర్శించారు.

అటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ విభజనను పాకిస్థాన్-భారత్ విభజనతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తేజస్వి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు కాంగ్రెస్ ఎంపీలు.

 

Related News

టంగ్ స్లిప్ప‌వుతుందా? ఓట‌మిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారా? జ‌నాల‌ను కించ‌ప‌రిచేలా ఈ మాట‌లేలా?

ఆది నుంచి త‌ప్పట‌డుగులే.. వివాదాలే ఆమె దారి? ఇదీ కొండా సురేఖ వైఖరి!

ఇకపై అసమ్మతి గళాలకు బ్రేకులు… పరిపాలన పై రేవంత్ సర్కార్ మరింత పట్టు..

రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేలా అధిష్టానం అడుగులు! ఢిల్లీ పెద్ద‌ల‌తో స‌త్సంబంధాల సంకేతాలు..!

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

Big Stories

Advertisement
×