E-Paper
Advertisement

నువ్వా నేనా..? నాకా నీకా..!? కేంద్ర మంత్రి ప‌ద‌వి కోసం వ‌ర్గ‌పోరు..!

నువ్వా నేనా..? నాకా నీకా..!? కేంద్ర మంత్రి ప‌ద‌వి కోసం వ‌ర్గ‌పోరు..!
Advertisement

ఉన్న‌ది న‌లుగురు. త‌లోదారి. ఎవ‌రి గ్రూపులు వారివి. ఒక‌రిని కాద‌ని మ‌రొక‌రు ఫైర‌వీలు. ఒక‌రిపై మ‌రొక‌రు దుష్ప్ర‌చారాలు, గోతులు త‌వ్వుకోవ‌డాలు.. ఇవ‌న్నీ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కామ‌న్ అయిపోయాయి. మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి కోసం పోటీ నెల‌కొన్న‌ది. నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌, సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్‌ల మ‌ధ్య పోటీ ఉండే. దాదాపుగా ఈట‌ల రాజేందర్‌కు ఈ ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఇక్క‌డి సీనియ‌ర్లు అది కానీయ‌లేదు. కిష‌న్‌రెడ్డి దీనికి ప్ర‌ధాన అడ్డంకిగా మారాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. బండి సంజ‌య్‌ను అనుకోకుండా రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించిన త‌రువాత పార్టీలో అనిశ్చితి నెల‌కొన్న‌ది.

ఆ త‌రువాత అది ఈట‌ల రాజేంద‌ర్‌కే ఇస్తార‌ని అంతా భావించారు. కానీ కిష‌న్‌రెడ్డి చ‌క్రం తిప్పి.. రాంచంద్రారావుకు ఇప్పించుకున్నాడు. ఇక ఇప్ప‌ట్లో అత‌న్ని మార్చేది ఉండ‌దు. మ‌ళ్లీ ఎన్నిక‌ల నాటి ముచ్చ‌ట అది. కానీ ఇప్పుడు కేంద్ర కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌నే ప్ర‌చార నేప‌థ్యంలో.. మళ్లీ ఈ గ్రూపుల లొల్లి తెర‌పైకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఇద్ద‌రు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కిష‌న్‌రెడ్డి ప‌లుకుబ‌డి అధిష్టానం వ‌ద్ద మ‌రింత పెరిగింది. బండి సంజ‌య్ అత‌ని కొడుకు కేసులో మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తారేమోన‌ని అంతా అనుకున్నారు. కానీ అది జ‌రిగేలా లేదు. దీంతో మ‌రొక‌రికి ఇస్తార‌ని ప్ర‌చారం జరుగుతున్న‌ది. ఈ రేసులో ప్ర‌ధానంగా ఈట‌ల రాజేంద‌ర్‌, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. అర్వింద్ కూడా ఆశిస్తున్నా.. అత‌న్ని పెద్ద‌గా అధిష్టానం ప‌ట్టించుకోవ‌డం లేదు. అర్వింద్ ఏ ఒక్క‌రితో కూడా పార్టీలో క‌లిసి ముందుకు సాగ‌డం లేదు.

Advertisement

త‌న పంథా త‌న‌ది. అప్పుడ‌ప్పుడు పార్టీ లైన్‌ను కూడా దాటి న‌డుచుకోవడంతో సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో అత‌నికి చాన్స్ లేన‌ట్టే. ఇక ఉన్న‌ది ఇద్ద‌రు ప్ర‌ధానంగా. ఈట‌ల రాజేంద‌ర్ మొద‌టి నుంచి ఈ పార్టీలో ప‌ట్టింపు లేకుండా ఉన్నాడు.అత‌ని అనుచ‌రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక‌నైనా కేంద్ర ప‌ద‌వి ఇస్తే.. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయొచ్చ‌నే విధంగా అధిష్టానం వ‌ద్ద ఒత్తిడి పెంచుతున్నారు. అధిష్టానం వ‌ద్ద ఈట‌ల‌కు మంచి పేరే ఉన్న‌ది. స‌మీక‌ర‌ణ‌ల‌న్నీ క‌లిసి వ‌స్తే.. త‌న‌కే ఆ కేంద్ర మంత్రి ప‌ద‌వి అని ఈట‌ల అనుకుంటున్నాడు.

కానీ ఇంత‌లోనే ఈట‌ల పై హైద‌రాబాద్‌లో పోస్ట‌ర్లు వెలిశాయి. పార్టీకి అత‌ని వ‌ల్ల న‌ష్ట‌మే త‌ప్ప‌.. ఎలాంటి లాభం లేద‌నే విధంగా వేసిన పోస్ట‌ర్లు క‌ల‌క‌లం రేపాయి. ఇది పార్టీ వర్గాల కుట్రేన‌ని ఈట‌ల వ‌ర్గం దీనిపై భ‌గ్గుమంటోంది. ఈట‌ల‌కు ఈ విష‌యంలో మ‌ద్ద‌తు వెల్లువ‌లా ల‌భిస్తోంది. ఆ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఎప్పుడు జ‌రుగుతుందో కానీ.. ఎవ‌రికి వారుగా విడిపోయి.. గ్రూపుల వారీగా త‌లోదారి చూసుకుంటున్నారు. ఇంటి గుట్టు బ‌య‌ట పెట్టుకుని ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది.

Related News

కుక్క తోకను ఆడిస్తోందా? తోక కుక్కను ఆడిస్తోందా? సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పైనే పాలకులు ఆధారపడుతున్నారా?

రేవంత్‌ మాస్టర్‌ స్ట్రోక్‌కు.. కేటీఆర్‌ మాస్టర్ ప్లాన్‌…! సీఎం టూర్‌ తరువాత మరో పథకం అనౌన్స్‌మెంట్‌కు సన్నాహాలు..?

చెల్లెనే కాదు.. తల్లి, భార్యనూ అవమానించారు..! బీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మీరిద్దరు చాలు..! ఇంకెవరూ అసవరం లేదు..

కేసీఆర్‌లా పంచు డైలాగులు కొట్టబోయి.. విమర్శల పాలైన కేటీఆర్‌! ఆయన మందలింపు మాటలనూ ఎంజాయ్‌ చేస్తారు…మీరంటే ఎగతాళి చేస్తారు!

ఎమ్మెల్యేలను నెత్తినపెట్టుకుని పెద్ద తప్పు చేశాం..! కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటిదే..! కేటీఆర్‌ కామెంట్స్‌ వెనుక మర్మమేమిటీ? పాతకాపులకిక చెక్?

పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేశ్‌ డోలో గోలీ మంత్రం..! పప్పు అనే విమర్శల నుంచి చమత్కార ఛలోక్తులు విసిరే స్థాయికి..!

పక్కనే ఉంటూ యువనేత పుట్టిముంచనున్న ఆ ఇద్దరు..! మొన్నటి దాకా జీవన్‌రెడ్డి.. ఇప్పుడు కౌషిక్‌రెడ్డి.. !

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

Big Stories

Advertisement
×