E-Paper
Advertisement

కారు క్లచ్‌ను సేఫ్ గా ఉండాలంటే, ఈ తప్పులు అస్సలు చేయకండి!

కారు క్లచ్‌ను సేఫ్ గా ఉండాలంటే, ఈ తప్పులు అస్సలు చేయకండి!
Advertisement

Car Clutch Care Guide: కారు డ్రైవింగ్‌ లో క్లచ్, గేర్‌ బాక్స్ ముఖ్యమైన భాగాలు. ఇవి సరిగ్గా పనిచేస్తేనే వెహికల్ పనితీరు, మైలేజ్ బాగుంటుంది. అయితే, చాలా మంది డ్రైవర్లు తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల క్లచ్ త్వరగా అరిగిపోతుంది. ఒకసారి క్లచ్ ప్లేట్ లేదంటే గేర్‌ బాక్స్‌ లో సమస్య వస్తే, రిపేర్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ, కొన్ని ఈజీ టిప్స్ పాటిస్తే, క్లచ్ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రైవింగ్ లో క్లచ్ మీద కాలు ఉంచకూడదు!

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది చేసే పెద్ద తప్పు క్లచ్‌ మీద కాలు ఉంచుతారు. దీనిని  హాఫ్ క్లచ్ అంటారు. ఇలా ఎక్కువసేపు నొక్కి ఉంచితే క్లచ్ ప్లేట్స్ మధ్య ఘర్షణ పెరిగి వేడి ఎక్కువ అవుతుంది. క్లచ్ త్వరగా దెబ్బతింటుంది. సో, గేర్ మార్చిన వెంటనే క్లచ్‌ మీది నుంచి కాలు తీయాలి.

Advertisement

అటు అవసరం లేకుండా క్లచ్ వాడటం మంచిది కాదు. వేగం తగ్గించాల్సినప్పుడు వెంటనే క్లచ్ నొక్కడం కాకుండా, వాహనాన్ని గేర్‌ లోనే నెమ్మదిగా తగ్గించాలి. దీనిని ఇంజిన్ బ్రేకింగ్ అంటారు. ఇలా చేస్తే క్లచ్, బ్రేక్ రెండింటిపైనా ఒత్తిడి తగ్గుతుంది.

గేర్ మార్చే విధానం కూడా చాలా ముఖ్యం. అకస్మాత్తుగా గేర్ మార్చడం, బలవంతంగా లివర్‌ ను నెట్టడం వల్ల గేర్‌ బాక్స్‌ లోని భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సరైన స్పీడ్‌లో, సున్నితంగా గేర్ మార్చడం మంచిది. ఇలా చేస్తే వాహనం కూడా స్మూత్‌ గా నడుస్తుంది.

Advertisement

కొండ ప్రాంతాలు, వాలుగా ఉన్న ప్రదేశాల్లో కారును ఆపి ఉంచేటప్పుడు చాలామంది క్లచ్‌ తోనే పట్టుకొని ఉంచుతారు. ఇది క్లచ్‌కు చాలా ప్రమాదం.  అలా చేయకుండా బ్రేక్‌ను ఉపయోగించి వాహనాన్ని స్టాప్‌లో ఉంచాలి. స్టార్ట్ చేసే సమయంలో మాత్రమే క్లచ్‌ ను ఉపయోగించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం గేర్ లివర్‌పై చేతిని ఉంచడం. చాలామందికి ఇది అలవాటు. కానీ గేర్‌బాక్స్‌ లోని భాగాలపై ఒత్తిడిని పెంచుతుంది. గేర్ మార్చేటప్పుడు మాత్రమే లివర్‌ను తాకడం మంచిది.

ట్రాఫిక్ లో క్లచ్ జాగ్రత్తగా వాడాలి!

ట్రాఫిక్‌ లో డ్రైవింగ్ చేసే సమయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. ఆగి ఆగి వెళ్లే ట్రాఫిక్‌ లో క్లచ్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. కానీ, ముందున్న వాహనంతో సరైన దూరం ఉంచితే, అనవసరంగా గేర్ మార్చాల్సిన అవసరం తగ్గుతుంది. దీని వల్ల క్లచ్‌పై ఒత్తిడి కూడా తగ్గుతుంది.

మెయింటెనెన్స్ అత్యంత కీలకం

వాహనం మెయింటెనెన్స్ కూడా ముఖ్యం. గేర్‌ బాక్స్ ఆయిల్ సమయానికి మార్చడం, క్లచ్ సిస్టమ్‌ను చెక్ చేయించడం వల్ల పెద్ద సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. చిన్న చిన్న శబ్దాలు, గేర్ మార్చడంలో ఇబ్బందులు, కాలిన వాసన వస్తే, వెంటనే మెకానిక్ దగ్గరికి వెళ్లాలి. మొత్తంగా క్లచ్ ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే డ్రైవింగ్ స్టైల్‌ లో చిన్న మార్పులు చేయడం మంచిది.

Read Also: కారు మీద గీతలు పడ్డాయా? డోంట్ వర్రీ.. సింఫుల్ గా ఇంటి దగ్గరే రిమూవ్ చెయ్యొచ్చు!

Related News

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×