28 Degree Celsius Movie Review : నవీన్ చంద్ర హీరోగా రూపొందిన ’28°C’ అనే చిన్న సినిమా ఈరోజు చాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది. ‘పొలిమేర’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసిందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
కార్తీక్ ఒక అనాథ. అయితే కష్టపడి చదువుకుని డాక్టర్ అవ్వాలనేది అతని లక్ష్యం. ఫైనల్ గా అతను అనుకున్నట్టే మెడిసన్లో జాయిన్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి అంజలి(షాలిని వడ్నెకట్టి) పరిచయమవుతుంది. తర్వాత ఆమెతో అతను ప్రేమలో పడతాడు. షాలిని కూడా కార్తీక్ ని ఇష్టపడుతుంది. అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ ఆమె ఇంట్లో వాళ్ళు కార్తీక్ తో పెళ్ళికి ఒప్పుకోరు. కారణం కుల వివక్ష. దీంతో కార్తీక్, అంజలి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటారు. అయితే అంజలికి ఒక అరుదైన వ్యాధి ఉంటుంది. అదేంటంటే ఆమె 28° సెల్సియస్ టెంపరేచర్లో మాత్రమే ఉండగలదు. అంతకు మించిన టెంపరేచర్ అయినా.. తక్కువ టెంపరేచర్లో ఉన్నా.. ఆమె ప్రాణాలు పోతాయి. దీంతో కార్తీక్ ఆమెను తీసుకుని జార్జియా వెళ్తాడు. అక్కడ ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే మరోపక్క అక్కడి హాస్పిటల్లో పనిచేసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు కార్తీక్ ఇంటికి వచ్చేసరికి అంజలి చనిపోయి ఉంటుంది? తర్వాత అదే ఇంట్లో ఆమె ఆత్మ అయ్యి తిరుగుతూ ఉంటుందనే రూమర్ క్రియేట్ అవుతుంది. అది ఎందుకు?అసలు అంజలి చనిపోయింది? వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా
విశ్లేషణ :
‘పొలిమేర’ ‘పొలిమేర 2′ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ విశ్వనాథ్. అతని మొదటి సినిమాగా ’28°C’ మొదలైంది. అయితే బడ్జెట్ సమస్యలు..వంటి ఇతర కారణాల వల్ల షూటింగ్ డిలే అయ్యింది. సినిమా హోల్డ్ లో పడిపోయింది. పాత సినిమా కాబట్టి.. ఓటీటీ వాళ్ళు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో థియేటర్లలోకి వదిలారు. ‘పొలిమేర 2’ రిలీజ్ చేసిన వంశీ నందిపాటి.. ఈ సినిమాని కూడా రిలీజ్ చేశాడు. సినిమా 7 ఏళ్లపాటు ఆలస్యమైనా.. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. ఐడియా చాలా బాగుంది. స్వతహాగా దర్శకుడు డాక్టర్ కావడంతో అతనికి ఇలాంటి కొత్త ఐడియా వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. కానీ కథనం అయితే వీక్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఎక్కువ అవ్వడంతో కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే హీరోయిన్ కి ఉన్న డిసార్డర్ గురించి బయటపడుతుందో అక్కడి నుండి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. తర్వాత ఆత్మ ట్రాక్ కానీ.. క్లైమాక్స్ పోర్షన్ కానీ పర్వాలేదు అనిపిస్తాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాగుంది. ఇది చిన్న బడ్జెట్ సినిమా అనే లోటు కనబడకుండా చేసింది. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంచెం ఓకే. ఇక గ్యారీ బి హెచ్ ఎడిటింగ్లో చాలా లోపాలు కనిపించాయి. బహుశా అతను కాకుండా అతని టీంతో ఎడిటింగ్ చేయించడం వల్ల రిజల్ట్ తేడా కొట్టినట్టు ఉంది. నిర్మాణ విలువలు అయితే కథకి తగ్గట్టే ఉన్నాయి. నిర్మాత బాగానే ఖర్చు పెట్టాడు అని స్పష్టమవుతుంది.
నటీనటుల విషయానికి వస్తే.. నవీన్ చంద్ర ఎప్పటిలానే హానెస్ట్ గా పెర్ఫార్మ్ చేశాడు. షాలిని గ్లామర్ షోకి పెద్దగా స్కోప్ లేని పాత్ర ఇది. పెర్ఫార్మన్స్ పరంగా ఓకే అనిపించింది. ఆమె కెరీర్ ప్రారంభంలో తీసిన సినిమా కావడంతో ఆమె మరింత అందంగా కనిపించింది అనుకోవచ్చు. ప్రియదర్శి కూడా ‘పెళ్ళిచూపులు’ టైంలో చేసిన సినిమా ఇది అనుకోవాలి. ఇప్పుడైతే ఇలాంటి పాత్రని అతను చేయడమో. వైవా హర్ష కామెడీ జస్ట్ ఓకే. దేవయాని శర్మ రోల్ బాగానే ఉంది.
ప్లస్ పాయింట్స్ :
కాన్సెప్ట్
రన్ టైం
మైనస్ పాయింట్స్ :
కథనం
ఫస్ట్ హాఫ్
మొత్తంగా.. ’28°C’ లో మంచి పాయింట్ ఉంది. కానీ కథనం వీక్ గా ఉండటం వల్ల ఎటువంటి మెరుపులు మెరిపించదు.
రేటింగ్ : 2/5