Killer Artiste Movie Review: ఈవారం పలు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయగా అందులో ‘కిల్లర్ ఆర్టిస్ట్’ కూడా ఒకటి. ఇందులో సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ హీరోహీరోయిన్‌గా నటించారు. దీనిని ఎస్.జె.కె. ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించారు. సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సుదర్శన్, పి కిరీటీ, వెంకీ మంకీ, సోనియా ఆకుల, స్నేహమాధురి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రతన్ రిషి ‘కిల్లర్ ఆర్టిస్ట్ మూవీని డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్ ప్రెస్టీజియస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన మైత్రీ మూవీ మేకర్స్ చేతుల మీదుగా ఈ సినిమా నైజాం ఏరియాలో విడుదలయ్యింది. స్పెషల్‌గా మీడియా కోసమే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ ఏర్పాటు చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథ, అందులో ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్.. ఇలా రెండు వేర్వేరు జోనర్లను కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం..
కథ :
పిచ్చ రవి (బాహుబలి ప్రభాకర్) అమ్మాయిలను అత్యాచారం చేస్తూ ఆపై వారిని దారుణంగా హత్య చేస్తుంటాడు. అతడిని పట్టుకోవడం కోసం సీఐ ప్రకాశ్ (సత్యం రాజేష్) పెద్ద స్కెచ్ వేసి పట్టుకుంటాడు. కానీ పట్టుకున్న తర్వాత జైలుకు తరలించే క్రమంలో అతడు ప్రకాశ్‌తో సహా మరో ఆరుగురు పోలీసులపై దాడి చేసి తప్పించుకుని పారిపోతాడు. ఇక మరోవైపు విక్కీ (సంతోష్ కల్వచెర్ల), జాను (క్రిషేక పటేల్)లు పీకల్లోతు ప్రేమలో ఉంటారు. వీరి ప్రేమ జాను తల్లికి నచ్చదు. అదే సమయంలో విక్కీ చెల్లెలు (స్నేహా మధురిశర్మ)ను ఎవరో కిరాతకంగా హత్య చేస్తారు. చెల్లి చనిపోయిన బాధలో విక్కీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ఎలాగైనా తన చెల్లిని చంపిన వాళ్లను పట్టుకుని పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. మరి విక్కీ చేతికి తన చెల్లిని చంపిన హంతకులు చిక్కుతారా? అసలు పిచ్చ రవి ఎందుకు సీరియల్ కిల్లర్‌గా మారాడు? లాంటి కథ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ :
ఒక సీరియల్ కిల్లర్ కథ ఇది. ఒక కళగా భావించి హత్యలు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. తరచుగా మన చుట్టూ సమాజంలో, వార్తల్లో చూస్తున్న కొన్ని నిజమైన సంఘటనలు చూసి, వాటి నుండి ఇన్‌స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు రతన్ రిషి. పరువు హత్యలు, సైకోలుగా మారి కొందరు చేసే హత్యాచారాలు, హత్యలు బేస్ చేసుకొని ఈ కథను రాసుకున్నాడు. ఇక ఇలాంటి థ్రిల్లర్ కథ చుట్టూ ఒక ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ను కూడా క్రియేట్ చేశాడు దర్శకుడు. అసలు ఈ సినిమాలో జరిగే సీరియల్ మర్డర్స్ ఒకరు చేస్తున్నారా? ఇద్దరు చేస్తున్నారా? అనే అనుమానాలను కూడా ప్రేక్షకుల్లో కలుగుతాయి.
ఇంటర్వెల్ బ్యాంగ్‌తో అసలు కథ మొదలవుతుంది. ఇందులో విపరీతమైన వైలెన్స్‌తో పాటు ఓ అందమైన అన్నా చెల్లెళ్ల స్టోరీని కూడా యాడ్ చేయడంతో ఎమోషనల్ యాంగిల్ వర్కవుట్ అయ్యింది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ నుంచి ఈ కథ మొదలయ్యి రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకోవడమే సినిమాలో హైలెట్. సినిమా మొత్తం చాలావరకు ప్రేక్షకులు ఆసక్తితో చూసేంత ఎంగేజింగ్‌గానే ఉంటుంది. ఈ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ ఆడియన్స్‌కు ఒక కొత్త సినిమాటిక్ ఫీల్‌ను అందించడం ఖాయం. మీ ఫేవరెట్ జోనర్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే ఈ సినిమా మీకు ఫుల్ మీల్స్.
నటీనటుల విషయానికి వస్తే… హీరో సంతోష్ లుక్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. తను లవర్ బాయ్‌గా మాత్రమే కాదు.. రివెంజ్ తీసుకునే మాస్ హీరోగా కూడా కనిపిస్తాడు. తన యాక్టింగ్ చూస్తుంటే హీరోకు మంచి భవిష్యత్తు ఉంది అనిపిస్తుంది. హీరోయిన్ పాత్ర పర్వాలేదు అనిపిస్తుంది. ఆమె తల్లి పాత్రలో పులి సీత మెప్పించారు. గయ్యాళిగా కనిపించే పాత్ర అయినా ఆమె పాత్రకు ఒక ఇంట్రెస్ట్ ఫ్లాష్‌బ్యాక్‌ను యాడ్ చేశాడు దర్శకుడు. చెల్లి పాత్రలో మాధురి శర్మ బాగా నటించింది. ఇక సినిమా మొత్తం బాహబలి ప్రభాకర్ పాత్రపైనే నడుస్తుంది. సినిమా మొత్తం అతని మీదనే నడుస్తుంది. ఒక సైకో కిల్లర్‌గా తన నటన భయపెడుతుంది. సత్యం రాజేష్ పాత్ర బాగుంది. మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రలకు చాలావరకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చివరి వరకు సస్పెన్స్‌తో కొనసాగుతూ ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్ట్ రివీల్ చేయడం అనేది బాగుంది. దానికి తోడు దర్శకుడి స్క్రీన్ ప్లే మెప్పించేలా ఉంటుంది. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్లింగ్ సీన్స్‌లో ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా చేసింది. సినిమాటోగ్రాఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుంటే సినిమా మరింత బాగుండేది అనే ఫీలింగ్ ఆడియన్స్‌కు కలగొచ్చు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక క్లారిటీ సినిమాను ప్రేక్షకులకు అందించారు.
Killer Artiste Telugu Movie Rating : 2.25 / 5