Gundeninda GudiGantalu Today episode October 09th : మనోజు కిందకి రావడంతోనే ప్రభావతిని నానమ్మ అని సత్యం నీ తాతయ్య అని అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అమ్మ మా అమ్మ ఎక్కడ అని మనోజ్ అడగడంతో ప్రభావతి ఏంట్రా నేను నీకు నానమ్మన ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు ఏమైంది రా నీకు అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. నిజంగా నీకు ఏదో అయింది రా? నువ్వు అందుకే ఇలా ఉన్నావు అని ప్రభావతి అంటుంది. అయితే మనోజ్ మాత్రం పసిపిల్లడిలాగా ప్రవర్తిస్తూ రచ్చ రచ్చ చేస్తాడు. సత్యం నీ తాతయ్యని అనడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్అయ్యి ఎవర్రా నీకు తాతయ్య ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అంటూ కోపంతో రగిలిపోతుంది. నువ్వు చేసిన తాయత్తు ప్రయత్నం ఇలా అవుతుందని అసలు ఊహించలేదమ్మా చూశావా నువ్వు చేయడం వలే వాడిలా మారిపోయాడు అని ప్రభావతిని బాలు అంటాడు. సత్యం ఆ తాయత్తుకు విరుగుడు ఏమైనా ఉందేమో ఆవిడకి ఫోన్ చేసి కనుక్కో వెళ్ళు అని పంపిస్తాడు ప్రభావతిని.
బాలు మనోజ్ ని చిన్నపిల్లాడి లాగా ఆడిస్తూ ఏడుస్తూ ఉంటే బుజ్జగిస్తూ ఉంటాడు. అయితే అటు రవి కూడా మనోజ్ ని ఆడిస్తూ ఉంటాడు. ఇక బాలు మీనాలని అంకులాంటి అనడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అటు శృతిని కూడా ఆంటీ అని పిలవడంతో శృతి మనోజ్ ని వచ్చి తల మీద మొట్టికాయలు వేస్తుంది. మనోజ్ ఏడుస్తూ బయటికి వెళ్లిపోతాడు మనోజ్ ని ఎలాగైనా సరే మన దారిలోకి తెచ్చుకోలేని అందరూ ప్లాన్ చేస్తూ ఉండగా బయటకు వెళ్లిపోవడంతో అందరూ తన కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే మనోజ్ ఒక కారును కొనుక్కొని లోపలికి తీసుకొని వస్తాడు. అది చూసి అందరూ ఏంట్రా ఇదంతా అని ఆలోచిస్తూ ఉంటారు అటు ప్రభావతి స్వామీజీకి ఫోన్ చేసి పరిహారం అడుగుతూ ఉంటుంది.
మనోజు బయటకు వెళ్లి అక్కడున్న ఒక చిన్న బాబు దగ్గర కారు కొట్టేసి తీసుకొని వస్తాడు అయితే ఈ కారు ఎక్కడికి రాని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతుంటే నాదే నేను అక్కడ ఉంటే తెచ్చుకున్నాను అని అంటారు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు రా అసలు ఎవరిదిరా ఈ కారు అని అందరూ అడుగుతూ ఉంటారు కానీ మనోజ్ మాత్రం మౌనంగా కారుతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక ఈ ప్రభావతి స్వామి ఏం చెప్పారో తెలుసుకోవాలి అని అక్కడికి వెళుతుంది. ఒక్కసారి ఎలాగైనా సరే మనోజ్ కి మళ్ళీ మంచి బుద్ధి వచ్చేలా చేయాలి అని అనుకుంటుంది. అయితే నేను బయటకు వెళ్లి స్వామీజీ తో మాట్లాడుతూ వస్తున్నాను. ఏమైంది ఇప్పుడు ఎందుకు మీరందరూ అలా ఉన్నారు అని అడుగుతుంది ప్రభావతి. అప్పుడే ఒక ఆవిడ వచ్చేసి మీ అబ్బాయి మా అబ్బాయి కారు తీసుకుని వచ్చాడు అని చెప్పగానే వాడికి ఏదో గాలి సోకినట్లు ఉంది అందుకే అలా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది.
బాలు మనోజ్ ఆడుకుంటూ ఉండగా ఆ కారు లాగేసి అలా కొట్టగానే మనోజ్ కింద పడిపోతాడు అయ్యో మనోజ్ కి ఏమైంది ఎందుకు కిందపడిపోయాడు అని అడుగుతుంది. అయితే ఏం మనోజ్ అలా కింద పడి అందరూ కూడా ఒక్కసారిగా షాక్అయ్యి ఏమైందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే మనోజ్ నాకేమైంది ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో మనోజ్ మళ్ళీ తిరిగి వచ్చేసాడు అంటూ అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక బాలు అరేయ్ పక్కతడిపడేమో చూసి వెళ్ళదా అని అనగానే నేను పక్క తడపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అని బాలు పై సీరియస్ అవుతాడు మనోజ్.
రోహిణి మనోజ్ కోసం బట్టలు ఐరన్ చేసి పెడుతుంది. అయితే మనోజ్ అప్పుడు అక్కడికి వచ్చి ఈ తాయెత్తులు కాదు ఇంకా ఏమైనా కట్టుకోవాలి మూడో తారీకు కట్టుకుంటే మళ్లీ సెట్ అవుతాడు. కానీ రోహిణి షర్ట్ ఐరన్ చేసిన విషయాన్ని పట్టించుకోకుండా అక్కడున్న ఐరన్ బాక్స్ ని పట్టుకుంటాడు. వెంటనే అది కాలడంతో మనోజ్ ఒక్కసారిగా కెవ్వుమని అరుస్తాడు. దాంతో రోహిణి పరిగెత్తుకుంటూ ఏమైంది మనోజ్ ఎందుకలా అరిచావు అంటూ వస్తుంది. అయితే కాలింది అని చెప్పగానే నాకోసం నువ్వు ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు అని మనోజ్ సీరియస్ అవుతాడు. కానీ రోహిణి మాత్రం నీకోసమే కదా నేను ఇదంతా చేస్తున్నాను అని అంటుంది. మొత్తానికి మనోజ్ రోహిణి ప్రేమను అర్థం చేసుకునేలా కనిపిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : కన్నా తల్లి వచ్చేసింది.. మాధవ్ ఎమోషనల్.. నారాయణ సీరియస్..