మూవీ : హత్య
రిలీజ్ డేట్ : 24 జనవరి 2025
డైరెక్టర్ : శ్రీవిద్య బసవ
నటీనటులు : ధన్య బాలకృష్ణ, బిందు చంద్రమౌళి, పూజా రామచంద్రన్ తో పాటు తదితరులు
ప్రొడ్యూసర్ : ఎస్ ప్రశాంత్ రెడ్డి
Hatya Movie Rating : 1/5
ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో దేనిపైనా పెద్దగా అంచనాలు లేవు. ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి కొన్ని సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. అందులో ‘హత్య’ ఒకటి. ధన్య బాలకృష్ణ, రవివర్మ వంటి కొందరు తెలిసిన నటీనటులు నటించడం వల్ల కొంతమంది ఆడియన్స్ ఈ సినిమాకి వెళ్లే సాహసం చేయొచ్చు. మరి అలాంటి వాళ్ళని ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకోవచ్చు? అనే విషయాన్ని ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
కథ :
2019 ఎలెక్షన్స్ కి ముందు జరిగిన వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు ఓ సంచలనం. దాని గురించి ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. 2024 కి ముందు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఓ ప్రెస్ మీట్ పెట్టి.. పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫోటోలు చూపించి షాకిచ్చిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్నీ ఎలా ఉన్నా. ఎలెక్షన్స్ కి ముందు ‘వివేకం’ అనే సినిమా యూట్యూబ్లో రిలీజ్ అయ్యి అది మరో సంచలనం సృష్టించింది. ఎన్ని సార్లు దాన్ని డిలీట్ చేసినా.. కొత్త డొమైన్లతో దాన్ని అప్లోడ్ చేస్తూనే వచ్చారు. అందులో వివేకానంద రెడ్డిని ఎంత ఘోరంగా కొట్టి చంపారో.. చాలా క్లియర్ గా చూపెట్టారు. చివర్లో దోషులు ఎవరు అనే దాన్ని కూడా చూపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి..లు వివేకానంద రెడ్డిని హత్య చేయించినట్టు..దాన్ని ల్యాండ్ గొడవగా డైవర్ట్ చేసినట్టు అందులో చూపించారు. అయితే ‘హత్య’ కథని దానికి కొంచెం రివర్స్ చేసి కూతురే ఆస్తి కోసం హత్య చేయించినట్టు చూపించారు. కథ అయితే ఇదే. పూర్తిగా ఇది సునీతా రెడ్డికి వ్యక్తిరేకంగా తీసిన సినిమా.
విశ్లేషణ :
‘హత్య’ టెక్నికల్ గా మెప్పించే విధంగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. 2 గంటల 28 నిమిషాల క్రిస్ప్ రన్ టైంలో చెప్పాలనుకున్న కథని చెప్పారు.కాకపోతే చాలా వరకు అందరికీ ఒక అవగాహన ఉన్న కథ ఇది. అలాంటప్పుడు పూర్తిగా ఒకరికి మద్దతుగా తీస్తున్నారు అని ఆడియన్స్ కి ఒక ఐడియా వచ్చేశాక.. ఆ వరల్డ్ లోకి ఎలా వెళ్లగలడు. ఒక వేళ న్యూస్ లు వంటివి తక్కువ చూసేవాళ్ళకి, వివేకా నందరెడ్డి హత్య గురించి తెలీని వాళ్ళకి ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీని మెచ్చుకోవచ్చు. కెమెరా యాంగిల్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. మరీ ‘వివేకం’ లో ఉన్నంత వయొలెన్స్ లేకుండా.. ఎమోషన్ ని పండించాలని చూశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో డిస్కస్ చేసిన లాజిక్కులు కూడా పూర్తిగా ఒకవైపే ఉన్నప్పటికీ.. వాటి లెక్కలు బాగానే వేసుకున్నారు డైరెక్టర్ శ్రీదివ్య బసవ. నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని వై.ఎస్.వివేకా నందరెడ్డిని జె.సి.ధర్మేంద్ర రెడ్డిగా చూపించారు.సీనియర్ నటుడు రవివర్మ ఆ పాత్రని పోషించాడు. వయసు మీదపడ్డ పాత్రని చాలా చక్కగా పోషించాడు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్రని ఇక్కడ కిరణ్ రెడ్డిగా చూపించారు. భరత్ రెడ్డి ఆ పాత్రలో నటించాడు. అతను కూడా జగన్ ని బాగానే ఇమిటేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. పోలీస్ ఆఫీసర్ గా చేసిన ధన్య బాలకృష్ణ సీరియస్ పాత్రకి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. పూజా రామచంద్రన్ ముస్లిం అమ్మాయిగా బాగానే నటించింది.
ప్లస్ పాయింట్స్ :
టెక్నికల్ టీం పనితీరు
రన్ టైం తక్కువగా ఉండటం
రవివర్మ నటన
మైనస్ పాయింట్స్ :
ఒరిజినాలిటీ మిస్ అవ్వడం
సెకండాఫ్
క్లైమాక్స్
మొత్తంగా ఈ ‘హత్య’ సినిమా సునీత రెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా తీసుకున్న సినిమా. కల్పితం ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్ కి ఇది పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు.
Hatya Movie Rating : 1/5