BigTV English

Anuja Short Film : ఆస్కార్ కు నామినేట్ అయిన ‘అనూజ’ స్టార్ కిడ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

Anuja Short Film : ఆస్కార్ కు నామినేట్ అయిన ‘అనూజ’ స్టార్ కిడ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

Anuja Short Film : 2025లో ఆస్కార్ (Oscar 2025) నామినేషన్లలో ఇండియా నుంచి స్థానం దక్కించుకున్న షార్ట్ ఫిల్మ్ ‘అనూజ’ (Anuja). ఈ మూవీతో పాటు అందులో నటించిన 9 ఏళ్ల అమ్మాయి ఎవరు అనే విషయాన్ని నెట్టింట్లో తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


రెండవసారి ఆస్కార్ అదృష్టం  

‘ది ఎలిఫెంట్ విస్పర్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో 2023లో ఒకసారి ఆస్కార్ అవార్డును గెలుచుకున్న నిర్మాత గునీత్ మోంగా. ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో ఉన్న ‘అనూజ’ సినిమాకు కూడా ఆయనే నిర్మాత. మరి ఈసారి ఆయనను అదృష్టం వరిస్తుందో లేదో తెలీదు. కానీ ఆ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సజ్దా పఠాన్ (Sajda Pathan) అనే 9 ఏళ్ల బాలిక పేరు మాత్రం మార్మోగిపోతోంది. ఆమె ఎవరో తెలుసుకోవడానికంటే ముందు సజ్దా పఠాన్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అనూజ’ కథ ఏమిటో తెలుసుకుందాం.


‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ కథ 9 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె అక్క పాలక్ ఓ ఫ్యాక్టరీలో పాన్ఐ చేస్తుంది. ఆమె లాగే ఈ పాప కూడా పనికి వెళ్తుంది. కానీ ఒకానొక టైమ్ లో ఫ్యాక్టరీలో పని చేయడం లేదా చదువుకోవడం… రెండింటిలో ఒక ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బాల కార్మికురాలైన ఆ అమ్మాయికి బోర్డింగ్ స్కూల్‌లో చదువుకునే సువర్ణావకాశం లభిస్తుంది. ఇది ‘అనూజ’ భవిష్యత్తు జీవితాన్ని మార్చేసే నిర్ణయం. మరి అనూజ ఏం నిర్ణయించుకుంది? ఆమె చదువుకోవడానికి వెళ్తే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

సజ్దా పఠాన్ ఎవరు?

‘అనూజ’ పాత్రను 9 ఏళ్ల పాప సజ్దా పఠాన్ (Sajda Pathan) పోషించింది. సజ్దా ఒక బాలకార్మికురాలు. ఆ చిన్నారిని సలామ్ బాలక్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ రక్షించింది. ఢిల్లీ వీధుల్లో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చి, చదువు చెప్పిస్తోంది నటి మీరా నాయర్ ట్రస్ట్. ఓవైపు చదువుకుంటూనే ఆమె నటనా రంగంలో కూడా రాణిస్తోంది. ఆమె జీవితంపై ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు. పైగా అందులో సజ్దా ప్రధాన పాత్ర పోషించడం, ఆస్కార్ కు కూడా నామినేట్ కావడం అద్భుతం. సజ్దా గతంలో 2023 ఫీచర్ ఫిల్మ్ ‘ది బ్రెడ్’లో కూడా నటించింది.

ఎన్నో అవార్డులు 

‘అనూజ’లో సజ్దా పఠాన్ (Sajda Pathan) అక్కగా అనన్య షాన్‌భాగ్ నటించగా, నగేష్ భోంస్లే, గుల్షన్ వాలియా కీలక పాత్రలు పోషించారు. ఆడమ్ జె గ్రేవ్స్, సుచిత్రా మట్టై దర్శకత్వం వహించారు. గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. హాలీవుడ్ స్టార్ రైటర్ మిండీ కాలింగ్ ఈ షార్ట్ ఫిల్మ్ కి నిర్మాత.

‘అనూజ’ ఇప్పటి వరకు న్యూయార్క్ షార్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024, హాలీవుడ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ లైవ్ ఇన్ యాక్షన్ ఫిల్మ్, మోంట్ క్లైర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులను గెలుచుకుంది. ఎల్లో బార్న్, ఫోయిల్, ఇండీ షార్ట్స్ వంటి అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ‘అనూజ’ను ప్రదర్శించారు.

సలామ్ బాలక్ ట్రస్ట్ కీలక పాత్ర 

‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నిర్మాణం, నటీనటుల ఎంపిక ప్రక్రియలో సలామ్ బాలక్ ట్రస్ట్ సపోర్ట్ చాలా ముఖ్యమైనది. ఈ సంస్థ వీధుల్లో నివసించే పిల్లలకు సహాయం చేస్తుంది. ఈ ట్రస్ట్ ను సినీ నిర్మాత, దర్శకురాలు, నటి మీరా నాయర్ కుటుంబం స్థాపించింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×